Home » Stotras » Vasista Kruta Sivalinga Stotram

Vasista Kruta Sivalinga Stotram

వశిష్ఠ కృత శివలింగ స్తుతి (Vasista Kruta Sivalinga Stotram)

నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః
నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః||

నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః
నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః||

నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః
నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే||

నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే
నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః ||

నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః
నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే నమః ||

పురుష లింగాయ భావ లింగాయ వై నమః
నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః ||

నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే నమః
అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః ||

నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః
నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః ||

నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః
నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే ||

దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా
బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో ||
అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ ||

భావం :

కనక లింగమునకు నమస్కారము, వేదలింగమునకు, పరమ లింగమునకు, ఆకాశ లింగమునకు, సహస్ర లింగమునకు, వహ్ని లింగమునకు, పురాణ లింగమునకు, వేద లింగమునకు, పాతాళ లింగమునకు, బ్రహ్మ లింగమునకు, సప్తద్వీపోర్థ్వ లింగమునకు, సర్వాత్మ లింగమునకు, సర్వలోక లింగమునకు, అవ్యక్త లింగమునకు, బుద్ధి లింగమునకు, అహంకార లింగమునకు, భూత లింగమునకు, ఇంద్రియ లింగమునకు, తన్మాత్ర లింగమునకు, పురుష లింగమునకు, భావ లింగమునకు, రజోర్ధ్వ లింగమునకు, సత్త్వ లింగమునకు, భవ లింగమునకు, త్రైగుణ్య లింగమునకు, అనాగత లింగమునకు, తేజో లింగమునకు, వాయూర్ధ్వ లింగమునకు, శ్రుతి లింగమునకు, అథర్వ లింగమునకు, సామ లింగమునకు, యజ్ఙాంగ లింగమునకు, యజ్ఙ లింగమునకు, తత్త్వ లింగమునకు, దైవతానుగత లింగ స్వరూపము అగు శివునికి, సర్వరూపములలో సకలము తానై ఉన్న లింగ స్వరూపుడైన శంభుదేవునకు పునః పునః నమస్కారము|

ప్రభూ! నాకు పరమయోగమును ఉపదేశించుము, నాతో సమానుడైన పుత్రుడనిమ్ము, నాకు అవినాశి యగు పరబ్రహ్మవైన నీ యొక్క ప్రాప్తిని కలిగించుము, పరమ శాంతినిమ్ము, నావంశము ఎన్నటికీ క్షీణము కాకుండుగాక, నా బుద్ధి సర్వదా ధర్మముపై లగ్నమైఉండుగాక.

పూర్వము వశిష్ఠమహర్షి శ్రీపర్వతముపైన (శ్రీశైలమందు) శంభుదేవుని ఈ స్తోత్రముతో స్తుతించగా, శంభుడు అనేక వరములను, శుభములను ఇచ్చి అచటనే అంతర్థానమయ్యెను.

ఇది వశిష్ఠ కృతమైనా దీనిని ఎవరు చదువుతే వారు స్వామికి చెప్పుకున్నట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ స్తోత్రంలో అడిగిన చిట్టచివరి కోరిక మనం అందరం ప్రతిరోజూ ప్రతిక్షణం భగవంతుని పెద్దలను కోరవలసినదే.

Sri Subrahmanya Swamy Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం (Sri Subrahmanya Swamy stotram ) ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః | లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ || సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ | అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ || నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |...

Sri Ganesha Mahimna Stotram

శ్రీ గణేశ మహిమ్నః స్తోత్రమ్ (Sri Ganesha Mahimna Stotram) అనిర్వాచ్యం రూపం స్తవన-నికరో యత్ర గలిత- స్తథా వక్ష్యే స్తోత్రం ప్రథమపురుషస్యాఽత్ర మహతః । యతో జాతం విశ్వం స్థితమపి సదా యత్ర విలయః స కీదృగ్గీర్వాణః సునిగమనుతః శ్రీగణపతిః...

Sri Shyamala Stotram

శ్రీ శ్యామలా స్తోత్రం (Sri Shyamala Stotram) జయ మాతర్విశాలాక్షీ జయ సంగీతమాతృకే | జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే |౧|| నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరీ | నమస్తేస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే ||౨|| జయ త్వం శ్యామలేదేవీ శుకశ్యామే నమోస్తుతే...

Ksheerabdhi Dwadasa Vratam

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత విధానము (Ksheerabdhi Dwadasa Vratam) శ్రీ పసుపు గణపతి పూజ శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!