Home » Stotras » Sri Vinayaka Stotram
vinayaka stotram

Sri Vinayaka Stotram

శ్రీ వినాయక స్తోత్రం (Sri Vinayaka Stotram)

తొండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయగజ్జెలను మెల్లని చూపులు మంద హాసమున్ కొండొక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడు పార్వతి తనయయోయి గణాదిపా నీకు మ్రోక్కెన్ || 1 ||

తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్ధన చేసేద నేకదంత నా వలపటి చేతి ఘంటమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక || 2 ||

తలచెదనే గణనాధుని తలచెదనే విఘ్న పతిని దలచిన పనిగా ధలచనే హీరంభుని దలచెద నా విఘ్నములను తొలగుట కోరుకున్ || 3 ||

అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానబ్రాలు చెరుకురసంభున్ విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్దింతు మదిన్ || 4||

అంకముజేరి శైలతనయా స్తన దుగ్ధము లానువేళ బా ల్యాంకవిచేష్ట తుండమున యవ్వలిచ న్గబలింపబోయి యావంక కుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా లాంకుర శంకనంటెడు గాజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్ || 5 ||

ఈశునంతవాని ఎదురించి పోరాడి మడిసివాని చేత మరళాబ్రతికి
సర్వవంద్యు డైన సామజాతమూర్తి – కంజలింతు విఘ్న భంజనునకు

Sri Vinayaka Dandakam

శ్రీ వినాయక దండకం (Sri Vinayaka Dandakam) శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ   బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు...

Sri Tulasi Shodasa Namavali

శ్రీ తులసీ షోడశ నామావళి (Sri Tulasi Shodasa Namavali) తులసీ శ్రీ మహలక్ష్మీ: విద్యాః విద్యాయశస్వినీ ధర్మ్యా ధర్మాననా దేవీ దేవ దేవ మనః ప్రియా || లక్ష్మీ ప్రియసఖీ దేవీ దౌర్భుమిరచలా చలా షోడశై తాని నామాని తులస్యాః...

Manu Krutha Surya Stuti

మను కృత సూర్య స్తుతి (Manu Krutha Surya Stuti) నమో నమో వరేణ్యాయ వరదాయాంశుమాలినే | జ్యోతిర్మయ నమస్తుభ్యం అనంతా యాజితాయతే || 1 || త్రిలోకచక్షుషె తుభ్యం త్రిగుణా యామృతాయా చ | నమో ధర్మాయ హంసాయ జగజ్జననహేతవే...

Sri Venkateswara Sahasranamavali

శ్రీ వేంకటేశ్వర సహస్రనామావళిః (Sri Venkateswara Sahasranamavali) ఓం శ్రీ వేంకటేశాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం విశ్వేశాయ నమః ఓం విశ్వభావనాయ నమః ఓం విశ్వసృజే నమః ఓం విశ్వసంహర్త్రే నమః ఓం విశ్వప్రాణాయ నమః ఓం విరాడ్వపుషే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!