Home » Dandakam » Sri Vinayaka Dandakam
vinayaka dandakam

Sri Vinayaka Dandakam

శ్రీ వినాయక దండకం (Sri Vinayaka Dandakam)

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ   బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబు నీ కరలంబు నీ పెద్ద వక్త్రంబు నీ పాద హస్తంబు లంబో దరంబున్ సదమూషకాశ్వంబు నీ మంద హాసంబు నీచిన్న తొండంబు నీ గుజ్జ రూపంబు నీ సూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమంబక్ష తాల్జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్మోల్లులు న్ముంఛి చేమంతులున్ దేల్లగాన్నేరులున్ మంకెనలన్ పోన్నలన్ పువ్వులు న్మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి విఘ్నేశ్వరా నీకుతేంకాయ పోన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులన్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోదుమప్పంబులు న్వడల్ పునుగులున్భూరేలున్ న్గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్ను బాలాజ్యము న్నాను బియ్యంచామ్రంబు బిల్వంబు మేల్ బంగురున్ బల్లెమందుంచి నైవేద్య బంచనీరానంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల సేయుటల్ కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ ! యోభక్తమందార ! యోసుందరాకారా ! యోభాగ్య గంభీర ! యోదేవ చూడామణీ లోక రక్షా మణీ ! బందు చింతామణీ ! స్వామీ నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీ దొంతరాజాన్వ వాయుండ రామాబిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూడతన్ నిల్పి కాపాడుటేకాడు విన్గోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గోంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృహన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా ! నమస్తే నమస్తే నమస్తే నమః ||

Sri Rathnagarbha Ganesha Stuti

శ్రీ రత్నగర్భ గణేశ స్తుతి (Sri Rathnagarbha Ganesha Stuti) వామదేవ తనూభవం నిజవామభాగ నమాశ్రితం వల్లభామాశ్లిష్య తన్యుఖ వల్లు వీక్షణ దీక్షితం వాతనంధన వామ్చితార్ధ విదాయినీం సుఖదాయనం వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 1 || కారణం జగతాం...

Sri Garuda Dandakam

శ్రీ గరుడదండకం (Sri Garuda Dandakam) నమః పన్నగనద్ధాయ వైకుణ్ఠవశవర్తినే । శ్రుతిసిన్ధు సుధోత్పాదమన్దరాయ గరుత్మతే ॥ 1॥ Namah pannaganadhaaya Vaikuntavasavarthiney, Shruti Sindhu sudhothpadha mandharaya guruthmathe || గరుడమఖిలవేద నీడాధిరూఢమ్ ద్విషత్పీడనోత్కణ్ఠి తాకుణ్ఠవైకుణ్ఠపీఠీకృతస్కన్ధమీడే స్వనీడాగతిప్రీతరుద్రాసుకీర్తిస్తనాభోగగాఢోపగూఢ స్ఫురత్కణ్టకవ్రాతవేధవ్యథావేపమాన ద్విజిహ్వాధిపాకల్పవిష్ఫార్యమాణ...

Sri Veerabrahmendra Swamy Dandakam

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దండకం (Sri Veerabrahmendra Swamy Dandakam) శ్రీ మన్మహా వీర బ్రహ్మేంద్ర యోగీశ్వరా !! భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూరా!! మహావీరా!! మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ భక్తి మీ సూక్తులెన్నంగ సామాన్యమే!!...

Sri Dundi Ganapathy Stotram

ఢుంఢి గణపతి స్తోత్రం (Sri Dundi Raja Ganapathy Stotram) ౧. జయ విఘ్నకృతామాద్య భక్త నిర్విఘ్నకారక! అవిఘ్న విఘ్నశమన మహావిఘ్నైక విఘ్నకృత్!! ౨. జయ సర్వ గణాధీశ జయ సర్వ గణాగ్రణీః! గణప్రణత పాదాబ్జ గణనాతీత సద్గుణ!! ౩. జయ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!