శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దండకం (Sri Veerabrahmendra Swamy Dandakam)
శ్రీ మన్మహా వీర బ్రహ్మేంద్ర యోగీశ్వరా !! భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూరా!! మహావీరా!! మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ భక్తి మీ సూక్తులెన్నంగ సామాన్యమే!!
దేవ దేవా !! శిలా శిల్ప ప్రభావా !! మతద్వేష గర్వాంధకార ప్రజానీక సంస్కర్తా !! అస్పృశ్యతా జాఢ్య నిర్మూలనా దక్షా !!
ధరన్ వ్యక్తి భేదంబులన్ !! వర్ణ భేదంబులన్ !! పంక్తి భేదంబులన్ !! మాన్పి లోకంబులందెన్న నా ధర్మ తత్వ ప్రభోధంబు గావించి !! నీ దివ్య దృష్ఠిన్ భవిష్యంబులన్ దెల్పి !!
ఫాలాక్ష పద్మాక్ష భేదంబు లేదంచు భాషించి !! లోకాన అధ్వైత సిధ్ధాంత తత్వంబు లెంతేని సమర్థించి !! తద్రాజ
యోగంబు సాధించి !! భూ నాథులం సైత మెప్పించి ఒప్పించి!! లోకైక మాన్యండవై !! పుణ్య శీలుండవై !! లోక కళ్యాణసంధాతవై !! నీవు జీవ సమాధియందున్ప్రవేశించియున్ !!
భక్తులన్ గాచుచున్నట్టి గోవిందమాంబా !! మనో నాయకా !! లోక సుశ్లోకా!! మీ పాద నీరేజ సంసేవనా దీక్ష మాకుప్రసాధింపుమా !! భూరి ధర్మార్థ కామాది మోక్షంబులన్
గూర్పుమా !! పోతులూర్వంశ దీపా !! అస్మదానంద సంకల్ప సిధ్ధి ప్రధాతా !! నమస్తే !! విరాట్ ఈశ్వరా వీర బ్రహ్మేంద్ర
మూర్తీ !!
నమస్తే !! నమస్తే !! నమస్తే !! నమో నమః !!
( ఈ దండకాన్ని సకలజనులు పఠించి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారి కృపకు
పాత్రులు కండి!!)
సర్వే జనాః పంచ బ్రహ్మానుగ్రహసిద్ధిరస్తు !!
సర్వే జనాః పంచ భూతానుగ్రహ సిధ్ధిరస్తు!!!
శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహప్రాప్తిరస్తు!!!
Leave a Comment