శ్రీ వాసవి చాలీసా (Sri Vasavi Chalisa)
ఓం శ్రీ వాసవాంబాయై నమః
- అమ్మ వాసవి కన్యకా మమ పాలించే దేవతా, నోరారా నీ చాలిసా తర తరాలకు స్మరణీయం..
- సమాధి మహర్షి ఆశీస్సుల తో, సోమ దత్తముని ప్రార్ధన తో..
- కుసుమ దంపతుల ఫలనివై, వైశ్య కులానికి పరానివై..
- వైశ్యకులముని వేలిశావమ్మ, ఘనతలనెన్నో తెలిపావమ్మ..
- పెనుగొండలో న జననం, పరమ పవిత్రం నీ చరితం..
- ఐదో యేడు రాగానే, గురుకులానికి చేరితివి..
- సమస్త విద్యలు సాదించి, అనంత శక్తులు అర్జించితివి..
- యుక్త వయసులో వాసవిగా, అపురూపవతివై వేలిగావమ్మ..
- వివాహమంటే వలదన్నావు, కన్యకగానే ఉన్నావు..
- విష్ణువర్ధన మహారాజు, బలదర్ప ము తో చూశాడు..
- కన్ను మిన్ను కానక నిన్ను, కామ కాంక్షలతో చూశాడు..
- కన్యవైన నిన్ను కోరాడు, అకాల మరణం ఆహ్వానించాడు..
- అపచారానికి తలను వంచక, సమర శంకముకు పూరించక..
- అహింసా ధర్మాన్ని ఆశ్రయించి, తనువు త్యాగాన్ని ఆచరించావు..
- శక్తి రూపినిగా సాక్షాత్కరించి, భక్త జనులకు మోక్షమిచ్చితివి..
- దేహబ్రాంతిని తోలిగించావు, అద్వైత సూత్రాన్ని వెలిగించావు..
- ఆత్మకు మానవ రూపం మజిలీగా, పరమాత్మ లో లీనం బదిలీగా..
- శా శ్వత సత్యం ప్రవచించావు, సృష్టి రహస్యం బోధించావు…
- స్థిత ప్రజ్ఞత గలజ్గ్నురాలివి, ప్రతిభా పాటవ ప్రజ్ఞాశాలివి..
- నీ ఆదర్శం అనుస్మరనీయం, నీ వ్యక్తిత్వం స్మరణీయం..
- దుస్టునికి దాసోహం కాక, శిష్టురాలివై మార్గహం చూపావు..
- నీతో నూటారెండు గోత్రాలవారు, ఆత్మార్పనతో పునీతులయ్యారు..
- భూతిక ధర్మాలు భోదించావు, నైతిక సూక్హ్మాలు ధరించమన్నావు..
- నీ మాటలు మాకు శిరోధార్యాలు, నీ భాటలు ఇస్తాయి శౌర్యధైర్యాలు..
- పుణ్యవసిస్టానది తీరము లో, బ్రహ్మకుండ పావన ప్రాంతములో..
- అగ్నిగుండమున అడుగేశావు, పరాశక్తి గా నిలిచావు..
- కరుణాకటాక్షాల కరుణామూర్తిని, కోరిన కోర్కే లు తీర్చే కల్పవల్లీ..
- నిన్నే మదినిలిపి కొలిచేము, ఎన్నటికీ నీనామం తలచేము..
- కోట్ల ప్రజల కుల దేవతగా, దివ్యప్రభల ఇలవేలపుగా..
- మా పూజల గైకొనవమ్మ, మా ప్రార్ధనలు మన్నించవమ్మ..
- కృప చూపాలని వేడితిమమ్మ , ఆపదలు బాపి రక్షించవమ్మ..
- జగన్మాతకు ప్రతిరూపానివి, జగతికి నీవే ఆధారానివి..
- నిన్ను ప్రార్దిస్తే శుభాలుకలుగును, నిన్ను సేవిస్తే సంపదలబ్బును..
- దీక్షాధృతితో ఆత్మార్పణం, శిక్షా స్మృతిగా రాజు మరణం..
- స్వజనుల కాచి పరాశక్తివై, దుర్జనుల కళ్ళు తెరిపించావు..
- వైశాక శుద్ధ దశమి న జననము, మాఘ శుద్ధ విదియన ఆత్మార్పణము..
- చిత్త శుద్ధితో ధ్యానించెదము, భక్తి శ్రద్ధలతో నిన్నుస్మరించేదము..
- అందిస్తున్నామమ్మా వాసవీమాతా, అందుకోవమ్మ మా ప్రణామాలు..
- శక్తి రూపిణిగా సాక్షాత్కరించి భక్త జనులకు మోక్ష మిచ్చితివి..
వాసవీ మాతా చాలీసా ప్రతీ దినం పటించినచో దరి చేరలేవు నీ శోకాలు కలుగునులే శాంతి సుఖాలు…
జై వాసవీ మాతా , జై జై వాసవీ మాతా
Leave a Comment