Home » Sri Saraswati Devi » Sri Saraswati Devi Pooja Vidhanam
saraswati devi pooja vidhanam

Sri Saraswati Devi Pooja Vidhanam

శ్రీ సరస్వతీ దేవి పూజా విధానం (Sri Saraswati Pooja Vidhanam)

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పర౦బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః!!
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థా౦ గతోపివా
యః స్మరేత్ పు౦డరీకాక్ష౦ స బాహ్యా౦భ్య౦తర శ్శుచిః!!
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష – అని శిరస్సుపై నీళ్ళు చల్లుకోవాలి.

దీపారాధన:

దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః!
భోదీప దేవరూపస్త్వం కర్మసాక్షేహి అవిఘ్నకృతే!
యావత్ కర్మ సమాప్తిస్యాత్ తావతెత్వం సుస్థిరోభవ!!
అని ప్రార్థిస్తూ దీపారాధన గావించి గంధం, కుంకుమతో అలంకరించి ఒక పుష్పమునుంచి నమస్కరించవలెను.

(ఆవునేతితో వెలిగించిన దీపమైతే దేవుడికి కుడివైపూ, నూనె దీపమైతే దేవుడికి ఎడమైవైపూ పెట్టవలెను)

ఆచమనమ్:

ఓం కేశవాయ స్వాహా! నారాయణాయ స్వాహా! మాధవాయ స్వాహా!

(స్త్రీలు ఆచమనం చేయునపుడు ‘నమః’అని ఆచమనం చేయవలెను)

గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీ కేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమఃవాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేన్ద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

ధ్యానమ్:

యశ్శివో నామ రూపాభ్యాం దేవీ సర్వమంగళాం!
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం!!
లాభాస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః!
ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః!!
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం!
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం!!
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే!
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే!!
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః; శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమః; శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః; శ్రీ శచీ పురందరాభ్యాం నమః; శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః; శ్రీ సీతారామాభ్యాం నమః; సర్వేభ్యో మహా జనేభ్యో నమః అయం ముహూర్తస్సుముహూర్తోస్తు!!
అని దేవిపై పూలు, అక్షతలు ఉంచి నమస్కరించాలి.
ఉత్తిష్టంతు భూతపిశాచా! యేతే భూమి భారకాః
ఏతే షా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే!!
అక్షతలు వాసన చూసి ఎడమ ప్రక్కగా వెనుకకు వేసుకొనవలెను.

ప్రాణాయామము:

ఓం భూ : ఓం భువః ఓం  సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం  సత్యం ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోమ్
– అను మంత్రమును ఉచ్చరించవలెను.

సంకల్పము:

విష్ణుర్విష్ణుర్విష్ణుః ఇతి సంస్మృత్య, పంచాశత్కోటివిస్తీర్ణ మహీమండలే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే, కృష్ణాగొదావర్యోః మధ్య ప్రదేశే (స్వ)గృహే లక్ష్మీ నివాస స్థానే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ శ్రీమహావిష్ణో రాజ్ఞీయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే, ప్రథమపాదే, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన …….సంవత్సరే, …..అయనే, …..ఋతౌ, …..మాసే. …..పక్షే, …..తిథౌ, …..వాసరే, …..గోత్రస్య శర్మణః ధర్మపత్నీ శ్రీమతీ …..గోత్రవతీ శ్రీనామధేయవతీ, అహం మమోపాత్త దురితక్షయ ద్వారా యావజ్జీవ సౌమాంగల్య సిద్ద్యర్థం శ్రీ సరస్వతీ పూజాం కరిష్యే.
ఆద్య శ్రీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవతానియమేన ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
అని కుడి ఉంగరం వేలి కొనతో గోరు తగలకుండా నీరు తాకాలి.
తదంగ కలశారాధానం కరిష్యే! కలశం శుద్ధోదకైః గంధపుష్పాక్షతైరభ్యర్చ (పరిశుద్ధమైన నీరు నింపిన కలశమును గంధముతోడను, అక్షతల తోడను, పూజించవలెను. అనంతరము కుడిచేతి వ్రేళ్ళతో కలశమందలి

కలశపూజ:

కలశస్య ముఖే విష్ణుః క౦ఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాః స్మృతాః
కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసు౦ధరాః
ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అ౦గైశ్చ సహితా స్సర్వే కలశా౦బు సమాశ్రితాః
గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు!!
ఆయాంతు శ్రీ సరస్వతీ దేవీ పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశోదకేన , దేవీం ఆత్మానంచ పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య
అనుచూ సమస్త నదీ తీర్థాలను సంభావిస్తూ కలశోదకం పసుపు గణపతి మీదను, శ్రీసరస్వతీమాత పటము పైన, పిదప శిరస్సుపై జల్లుకొని, తరువాత పూజా ద్రవ్యాల పైన పవిత్రమగుటకు చల్లవలెను.
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహాగణపతి పూజాం కరిష్యే అని సంకల్పమొనర్చి నీటిని విడువవలెను.
ఒక పళ్ళెములో బియ్యము పోసి తమలపాకు కొస తూర్పుగా ఉంచి, దానిమీద పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని ఉంచి, కుంకుమతో అలంకరించి, దానిమీద పుష్పం, అక్షతలు కుడిచేతిలో పట్టుకొని

శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!!
వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే!
యం నత్వా కృతకృత్యాసుః తమ్ నమామి గజాననం!!
శ్రీ మహా గణాధిపతిం, సాంగం, సాయుధం, సశక్తి, పత్నీపుత్ర పరివార సమేతం, గణపతిమావాహయామి, స్థాపయామి పూజయామి అని చెప్తూ పుష్పం, అక్షతలు గణపతి మీద ఉంచవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః – ధ్యాయామి ధ్యానం సమర్పయామి; ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని చెప్తూ అక్షతలు వేయవలెను.
శ్రీమహాగణాధిపతయే నమః – పాదయోః పాద్యం సమర్పయామి
శ్రీమహాగణాధిపతయే నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
శ్రీమహాగణాధిపతయే నమః – ముఖే ఆచమనీయం సమర్పయామి
శ్రీమహాగణాధిపతయే నమః – శుద్ధోదకస్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
శ్రీమహాగణాధిపతయే నమః – శ్రీ గంధం సమర్పయామి
శ్రీమహాగణాధిపతయే నమః – గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
శ్రీమహాగణాధిపతయే నమః – పుష్పైః పూజయామి

శ్రీ మహాగణాధిపతి షోడశనామములు:

శ్రీ సుముఖాయ నమః
శ్రీ ఏకదంతాయ నమః
శ్రీ కపిలాయ నమః
శ్రీ గజకర్ణకాయ నమః
శ్రీ లంబోదరాయ నమః
శ్రీ వికటాయ నమః
శ్రీ విఘ్నరాజాయ నమః
శ్రీ గణాధిపాయ నమః
శ్రీ ధూమకేతవే నమః
శ్రీ గణాధ్యక్షాయ నమః
శ్రీ ఫాలచంద్రాయ నమః
శ్రీ గజాననాయ నమః
శ్రీ వక్రతుండాయ నమః
శ్రీ శూర్పకర్ణాయ నమః
శ్రీ హేరంబాయ నమః
శ్రీ స్కందపూర్వజాయ నమః!!
శ్రీ సర్వ సిద్ధిప్రదాయకాయ నమః;
శ్రీ మహాగణాధిపతయే నమః; షోడశ నామభిః పూజాం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః – ధూపమాఘ్రాపయామి
శ్రీమహాగణాధిపతయే నమః – దీపం దర్శయామి
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
(పిమ్మట గుడము(బెల్లం ముక్క), లేక అరటిపండు, లేక కొబ్బరికాయ చిప్పలు పసుపు గణపతి వద్ద ఉంచి దానిమీద నీళ్ళు చిలకరించి)

శ్రీమహాగణాధిపతయే నమః – యథాభాగం గుడోపహార, కదళీఫల, నారికేళ శకలాన్ నివేదయామి
అని చేతితో స్వామికి 5 మార్లు చూపుతూ “ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః” అంటూ నివేదన చేసి, పిమ్మట..

శ్రీమహాగణాధిపతయే నమః – నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
“పూగీఫలైస్సకర్పూరైః నాగవల్లీ దళైర్యుతం!
ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం!!
అంటూ తాంబూల నివేదన చేసి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ నీరు వదలవలెను.
శ్లో!! ఘ్రుతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్థథా!
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ!!
శ్రీమహాగణాధిపతయే నమః – కర్పూర నీరాజనం సమర్పయామి.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
గణపతికి ఉదకము చూపించి పళ్ళెములో వదలవలెను.
పిమ్మట,
శ్రీమహాగణాధిపతయే నమః – దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అంటూ పుష్పం, అక్షతలు స్వామి పాదాలపై ఉంచవలెను.
శ్రీమహాగణాధిపతయే నమః – ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అంటూ నమస్కారం చేసి

శ్లో! వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ!
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!!
అంటూ ప్రార్థన నమస్కారం చేసి అక్షతలు, ఉదకం చేతిలోనికి తీసుకొని, అనేన మయాకృతేన ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతా సుప్రసన్నో వరదో భవతు అంటూ పళ్ళెములో వదిలి
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని అక్షతలు తీసుకొని శిరస్సు మీద వేసుకొనవలెను.
పిమ్మట, శ్రీ గణపతి మీద అక్షతలు చల్లి “శ్రీమహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి, క్షేమార్థం పునరాగమనాయచ” అంటూ పళ్ళెమును జరిపి, దానిని ఒక ప్రక్కగా ఉంచి సరస్వతీ పూజ ప్రారంభించవలెను.

శ్రీ సరస్వతీ దేవతా స్థిరోభవతు సుప్రసన్నా భవతు వరదా భవతు’ (యనుచు సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి క్రింది విధంగా చెప్తూ నమస్కరించవలెను.

దీపం:

దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః!
సౌభాగ్యం దేహి పుత్రంశ్చ సర్వాన్ కామాశ్చ దేహిమే!!
దీపదేవతాభ్యో నమః అని ఆ జ్యోతిని పువ్వులతో పూజించవలెను. తరువాత పరిశుద్ధ హృదయముతో పుష్పములు తీసుకొని మ్రొక్కుచు సరస్వతీ దేవిని ఈ విధముగా ధ్యానించవలెను.
యాకుందేందుతుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవైస్సదా పూజితా!
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ!
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!
విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటీ!
కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించి!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి
శ్లో|| అత్రాగచ్ఛ జగద్వంద్యే సర్వలోకైక పూజితే
మయా కృతా మిమాం పూజాం గృహాణ జగదీశ్వరీం!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ఆవాహయామి
ఆసనం
శ్లో!! సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితమ్!
సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి (అక్షతలు వేయవలెను)

పాద్యం:

శ్లో!! సువాసిత జల౦ రమ్య౦ సర్వతీర్థ సముద్భవమ్
పాద్య౦ గృహాణ దేవీ త్వ౦ సర్వదేవ నమస్కృతే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః పాదయోః పాద్య౦ సమర్పయామి (కలశోదకమును పాదములపై చల్లవలెను)

అర్ఘ్యం:

శుద్ధోదక౦ చ పాత్రస్థ౦ గ౦ధపుష్పాది మిశ్రితమ్
అర్ఘ్య౦ దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్య౦ సమర్పయామి (కలశోదకమును అమ్మవారి చేతిలో వేయునట్లు భావించి పళ్ళెంలో వేయవలెను)

ఆచమనం:

సువర్ణ కలశానీత౦ చ౦దనాగరు స౦యుతమ్
గృహాణాచమన౦ దేవీ మయా దత్త౦ శుభప్రదే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ముఖే ఆచమనీయ౦ సమర్పయామి (కలశోదకమును సమర్పించవలెను)

పంచామృత స్నానం:

పయోదధి ఘృతోపేత౦ శర్కరా మధు స౦యుతమ్
ప౦చామృత స్నానమిద౦ గృహాణ కమలాలయే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ప౦చామృత స్నాన౦ సమర్పయామి (పంచామృతాలతో, ఫలోదకంతో స్నానం చేయించవలెను)
పంచామృతములు: ఆవునెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె.

శుద్ధోదక స్నానం:

గ౦గాజల౦ మయానీత౦ మహాదేవ శిరస్థితమ్
శుద్ధోదక స్నానమిద౦ గృహాణ హరివల్లభే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః శుద్ధోదక స్నాన౦ సమర్పయామి (కలశోదకముతో అభిషేకించవలెను)
స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి.

వస్త్రము:

శ్లో|| శుక్ల వస్త్ర ద్వయం దేవీ కోమలం కుటిలాలకే
మయి ప్రీత్యాత్వయా వాణీ బ్రహ్మాణీ ప్రతిగ్రుహ్యతా౦!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః వస్త్రయుగ్మ౦ సమర్పయామి (అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి)

ఆభరణం:

శ్లో|| కటక మకుటహారై ర్నూపురై రంగదాద్యైనః
ర్వివిధ సుమణి యుక్త్యై ర్మేఖలా రత్న హారై:
కమలదళ విలాసే కామదేవం గృహీత్వా
ప్రకటిత కరుణార్ధ్రే భూషితే భూషణాని!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః సర్వాణి ఆభరణాని సమర్పయామి

యజ్ఞోపవీతం:

శ్లో|| శబ్ద బ్రహ్మత్మికే దేవీ – శబ్ద శాస్త్ర కృతాలయే
బ్రహ్మ సూత్రం గృహాణత్వం బ్రహ్మ శక్రాది పూజితే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః యజ్ఞోపవీత౦ సమర్పయామి (యజ్ఞోపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి)

గంధం:

కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్
గ౦ధ౦ దాస్యామ్యహ౦ దేవీ ప్రీత్యర్థ౦ ప్రతిగృహ్యతామ్!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమఃశ్రీ గంధాన్ ధారయామి
గంధస్యోపరి అలంకరణార్థం కుంకుమ తిలకం ధారయామి.

అక్షతలు:

శ్లో|| అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్!
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతాంఅబ్దిపుత్రికే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పము:

పూజలో ము౦దుగా అష్టవిధ పష్పాలని సమర్పి౦చాలి. అవి

అర్క చ౦పక పున్నాగ, నన్ద్యావర్త౦ చ పాటల౦
బృహతీ కరవీర౦ చ ద్రోణ పుష్పాణి చార్చయేత్!!
సరస్వత్యై నమః – అర్కపుష్ప౦ పూజయామి (జిల్లేడు)
భారత్యై నమః – చ౦పక పుష్ఫ౦ పూజయామి (సంపెంగ)
వాగ్దేవతాయై నమః – పున్నాగ పుష్ఫ౦ పూజయామి
మాతృకాయై నమః – నన్ద్యావర్త పుష్ఫ౦ పూజయామి (నందివర్ధన)
హ౦సాసనాయై నమః – పాటల పుష్ఫ౦ పూజయామి
చతుర్ముఖ ప్రియాయై నమః – బృహతీ పుష్ఫ౦ పూజయామి (వాకుడు)
వేద శాస్త్రార్థ తత్త్వజ్ఞాయై నమః – కరవీర పుష్ప౦ పూజయామి (ఎర్రగన్నేరు)
సకల విద్యాధిదేవతాయై నమః – ద్రోణ పుష్ఫ౦ పూజయామి (తుమ్మి)

అథాంగ పూజ:

శ్రీ బ్రహ్మాణ్యై నమః పాదౌ పూజయామి
శ్రీ బ్రాహ్మణ మూర్తయే నమః గుల్పౌ పూజయామి
శ్రీ జగత్స్వరూపిణ్యై నమః జంఘౌ పూజయామి
శ్రీ జగదాద్యాయై నమః జానునీ పూజయామి
శ్రీ చారువిలాసిన్యై నమః ఊరూ పూజయామి
శ్రీ కమలభూమయే నమః కటిం పూజయామి
శ్రీ జన్మహీనాయై నమః జఘనం పూజయామి
శ్రీ గంభీరనాభయే నమః నాభిం పూజయామి
శ్రీ హరి పూజ్యాయై నమః ఉదరం పూజయామి
శ్రీ లోకమాత్రే నమః స్తన్యౌ పూజయామి
శ్రీ విశాలవక్షసే నమః వక్షస్థలం పూజయామి
శ్రీ గానవిచక్షణాయై నమః కంటం పూజయామి
శ్రీ స్కందప్ర పూజ్యాయై నమః స్కంధౌ పూజయామి
శ్రీ ఘనబాహవే నమః బాహూ పూజయామి
శ్రీ పుస్తక ధారిణ్యై నమః హస్తౌ పూజయామి
శ్రీ శ్రోత్రియ బంధవే నమః శ్రోత్రే పూజయామి
శ్రీ వేద స్వరూపాయై నమః వక్త్రం పూజయామి
శ్రీ సువాసిన్యై నమః నాసికాం పూజయామి
శ్రీ బింబా సమానోష్ట్యై నమః ఓష్టాం పూజయామి
శ్రీ కమలచక్షుషే నమః నేత్రే పూజయామి
శ్రీ తిలదారిణ్యై నమః ఫాలం పూజయామి
శ్రీ చంద్రమూర్తయే నమః చికురాన్ పూజయామి
శ్రీ సర్వప్రదాయై నమః ముఖం పూజయామి
శ్రీ శ్రీసరస్వత్యై నమః శిరః పూజయామి
శ్రీ బ్రహ్మరూపిణ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

సరస్వతీ అష్టోత్తర శతనామ పూజ:

శ్రీ సరస్వత్యై నమః
మహాభద్రాయై నమః
మహామాయాయై నమః
వరప్రదాయై నమః
శ్రీప్రదాయై నమః
పద్మనిలయాయై నమః
పద్మాక్ష్యై నమః
పద్మవక్త్రాయై నమః
శివానుజాయై నమః
పుస్తకహస్తాయై నమః
జ్ఞానముద్రాయై నమః
రమాయై నమః
పరాయై నమః
కామరూపిణ్యై నమః
మహావిద్యాయై నమః
మహాపాతక నాశిన్యై నమః
మహాశ్రయాయై నమః
మాలిన్యై నమః
మహాభోగాయై నమః
మహాభుజాయై నమః
మహాభాగ్యాయై నమః
మహోత్సాహాయై నమః
దివ్యా౦గాయై నమః
సురవ౦దితాయై నమః
మహాకాళ్యై నమః
మహాపాశాయై నమః
పీతాయై నమః
విమలాయై నమః
విశ్వాయై నమః
విద్యున్మాలాయై నమః
వైష్ణవ్యై నమః
చ౦ద్రికాయై నమః
చ౦ద్రవదనాయై నమః
చ౦ద్రలేఖావిభూషితాయై నమః
సావిత్ర్యై నమః
సురసాయై నమః
దేవ్యై నమః
దివ్యాల౦కార భూషితాయై నమః
వాగ్దేవ్యై నమః
వసుధాయై నమః
తీవ్రాయై నమః
మహాభద్రాయై నమః
మహాబలాయై నమః
భోగదాయై నమః
భారత్యై నమః
భామాయై నమః
గోవి౦దాయై నమః
గోమత్యై నమః
శివాయై నమః
జటిలాయై నమః
వి౦ధ్యావాసాయై నమః
వి౦ధ్యాచల విరాజితాయై నమః
చ౦డికాయై నమః
వైష్ణవ్యై నమః
బ్రాహ్మ్యై నమః
బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
సౌదామిన్యై నమః
సుధామూర్తయే నమః
సుభద్రాయై నమః
సుర పూజితాయై నమః
సువాసిన్యై నమః
సువాసాయై నమః
వినిద్రాయై నమః
పద్మలోచనాయై నమః
విద్యా రూపాయై నమః
విశాలాక్ష్యై నమః
బ్రహ్మధ్యేయాయై నమః
మహాఫలాయై నమః
త్రయీమూర్త్యై నమః
త్రికాలజ్ఞాయై నమః
త్రిగుణాయై నమః
శాస్త్ర రూపిణ్యై నమః
శు౦భాసుర ప్రమథిన్యై నమః
శుభదాయై నమః
సర్వాత్మికాయై నమః
రక్తబీజనిహ౦త్ర్యై నమః
చాము౦డాయై నమః
అ౦బికాయై నమః
ము౦డకాయ ప్రహరణాయై నమః
ధూమ్రలోచన మర్దనాయై నమః
సర్వదేవస్తుతాయై నమః
సౌమ్యాయై నమః
సురాసుర మస్కృతాయై నమః
కాళరాత్ర్యై నమః
కలాధారాయై నమః
రూపసౌభాగ్యదాయిన్యే నమః
వాగ్దేవ్యై నమః
వరారోహాయై నమః
వారాహ్యై నమః
వారిజాసనాయై నమః
చిత్రా౦బరాయై నమః
చిత్రా౦గదాయై నమః
చిత్రమాల్య విభూషితాయై నమః
కా౦తాయై నమః
కామప్రదాయై నమః
వ౦ద్యాయై నమః
విద్యాధరసుపూజితాయై నమః
రూప సౌభాగ్యదాయిన్యై నమః
శ్వేతాననాయై నమః
నీలభుజాయై నమః
చతుర్వర్గ ఫలప్రదాయై నమః
చతురాసన సామ్రాజ్ఞ్యై నమః
నిర౦జనాయై నమః
హ౦సాసనాయై నమః
రక్తమధ్యాయై నమః
నీల జ౦ఘాయై నమః
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి

ధూపం:

దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!
ధూపం దాస్యామి దేవేశి గృహాణ హరివల్లభే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి

దీపం:

ఘ్రుతాక్తవర్తి స౦యుక్త౦ అ౦ధకార వినాశనమ్
దీప౦ దాస్యామి తే దేవీ గృహాణ ముదితాభవ!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః దీప౦ దర్శయామి
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి (దేవిపై నీళ్ళు పూవుతో చల్లాలి)

నైవేద్యం:

దైవానికి కుడివైపున భూమిని శుద్ధి చేసి, అందు విస్తరి వేసి, మహా నైవేద్యం, పళ్ళు, కొబ్బరి శకలాలు అన్నీ ఉంచి, అభిఘరించి, కలశపాత్రలోని జలం వాటిపై జల్లుతూ
మగవారు అయితే యీ క్రింది మంత్రం పఠించవలెను.
ఓం భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్!
తర్వాత అమృతమస్తు, అమృతోపస్తరణమసి.
అంటూ మరికొన్ని నీళ్ళు పదార్థాలపై త్రిప్పి దేవికి చూపి పళ్ళెంలో వదలాలి.
పదార్ధాలు దేవికి నివేదిస్తూ
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా.
ఆడవారు నైవేద్యం పెడుచున్నచో ఈ క్రింది విధంగా పఠించవలెను.
శ్లో!! యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే!! (అని సూర్యుని స్మరించి దేవికి ఆచమనం ఇచ్చి)
శ్లో!! నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతమ్!
నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!! (అని ప్రార్థించి)
శ్రీ సరస్వతీ దేవ్యై నమః మహా నైవేద్యం సమర్పయామి.
ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః (అనుచు పదార్థములు దేవికి నివేదించి ఇంచుకసేపు దేవిని ధ్యానించవలెను)
ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితమ్!
పానీయం గృహ్యాతాం దేవీ శీతలం సుమనోహరమ్!! (అని పఠించి)
శ్రీ సరస్వతీ దేవ్యై నమః హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి (అనుచు జలమునిచ్చి)

తాంబూలం:

శ్లో!! పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం!
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి
తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
నీరాజనం
శ్లో!! నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్!
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యాతాం విష్ణువల్లభే!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి

మంత్రపుష్పం:

చేతిలోనికి పుష్పములు, అక్షతలు తీసుకొని లేచి నిలిచి భక్తితో మంత్రపుష్పమును పఠించవలెను.
దోర్భిర్యుక్యా చతుర్భిః స్ఫటిక మణిమయీ మక్షమాలా౦ దధానా
హస్తేనైకేన పద్మ౦ సితమపి చ శుక౦ పుస్తక౦ చాపరేణ!
భాసా కు౦దే౦దు శ౦ఖ స్ఫటిక మణినిభా భాసమానా సమానా
సామే వాగ్దేవతేయ౦ నివతు వదనే సర్వదా సుప్రసన్నా!!
చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ
సా దేవీ కృపయా మహ్య౦ జిహ్వాసిద్ధి౦ కరోతు చ!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః సువర్ణ మ౦త్రపుష్ప౦ సమర్పయామి (పుష్పములను అక్షతలను అమ్మవారికి సమర్పించవలెను)

ఆత్మప్రదక్షిణ నమస్కారాః
(తమకు కుడివైపు ప్రదక్షిణ మూడు సార్లు చేయవలెను)

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ!
త్రాహిమాం కృపయా దేవీ శరణాగత వత్సలే!!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష పరమేశ్వరి!!
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఓ౦ సరస్వత్యై నమః – ఛత్రం ఆచ్చాదయామి
ఓ౦ సరస్వత్యై నమః – చామర౦ వీచయామి
ఓ౦ సరస్వత్యై నమః – గీత౦ శ్రావయామి
ఓ౦ సరస్వత్యై నమః – నృత్య౦ దర్శయామి
సమస్తరాజోపచార, దేవోపచార , శక్త్యోపచార , భక్త్యోపచార పూజాన్ సమర్పయామి

సమర్పణ:

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూన౦ సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్!!
మ౦త్రహీన క్రియాహీన౦ భక్తిహీన౦ మహేశ్వరీ
యత్పూజిత౦ మయా దేవీ పరిపూర్ణ౦ తదస్తుతే!!
అనయా కల్పోక్త ప్రకారేణ ఆయా కృతయా షోడశోపచార పూజయా భగవతీ సర్వదేవాత్మికా శ్రీ సరస్వతీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు! మమ ఇష్టకామ్యార్థసిద్ధిరస్తు!!
అని జలమును వదలవలయును.

తీర్థ స్వీకరణ:

“అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం!
సమస్త పాపక్షయకరం శ్రీ సరస్వతీ దేవతా పాదోదకం పావనం శుభమ్” అంటూ ముమ్మారు స్వీకరించవలెను.
సర్వం శ్రీ సరస్వతీ దేవతార్పణమస్తు
శ్రీ సరస్వతీ దేవీం యథాస్థానం ప్రతిష్ఠాపయామి
శ్రీ సరస్వతీ పూజావిధి సమాప్తః

Source : https://www.facebook.com/thalapathranidhi/photos/a.335882006598247.1073741828.335025213350593/810979289088514/?type=3

Sri Sarada Devi Stotram

శ్రీ శారద దేవీ స్తోత్రం( Sri Sarada Devi Stotram) నమస్తే శారదా దేవీ కాశ్మీరపురవాసిని | త్వామహం ప్రార్ధయే నిత్యం విధ్యాదానం చ దేహిమే || 1 || యాశ్రద్ధ ధారణా మేధా వాగ్దేవి విధివల్లభ | భక్తి జిహ్వగ్రా...

Adi Shankaracharya Puja Vidhi

ఆదిశంకరాచార్య పూజావిధిః (Adi Shankaracharya Puja Vidhi) వైశాక శుద్ధ పంచమి శంకర జయంతి శ్రీ శంకరభగవత్పాదా విజయంతే మఙ్గలాచరణమ్ నమో బ్రహ్మణ్య దేవ్యాయ గోబ్రాహ్మణ హితాయ చ | జగద్ధితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః || గురుర్బహ్మా గురుర్విష్ణుః...

Sri Saraswati Stotram

శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్ (Sri Saraswati Stotram) సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః ఇంద్రనీలాలకా చంద్రబింబాననా పక్వబింబాధరా రత్నమౌళీధరా చారువీణాధరా చారు పద్మాసనా శారదా పాతుమాం లోకమాతా సదా స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా ఫాల...

Sri Vinayaka Chavithi Pooja Vidhanam

శ్రీ వినాయక వ్రత పూజా విధానం  (Sri Vinayaka Chavithi Pooja Vidhanam) శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం| ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే|| సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః, లంబోదరశ్చ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!