శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం (Sri Sainatha Pancharatna Stotram)
ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం సత్యరూపం సకలార్తి నాశనం
సౌక్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం సాయినాధం సద్గురుం చరణం నమామి || 1 ||
భక్తావనం భక్తిమతాం శుభాజనం ముక్తి ప్రదం భక్తి మనోహరం
విభుం జ్ఞాన సుశీల రూపిణీ సాయినాధం సద్గురుం చరణం నమామి || 2 ||
కారుణ్య మూర్తి కరుణాయ తాక్షం కరారే మభ్యర్ధిత దాస వర్గం
కామాది షడ్వర్గజితం వరేణ్యం సాయినాధం సద్గురుం చరణం నమామి || 3 ||
వేదాంతవేద్య విమలాంత రంగం ధ్యానాది రూడం వరసేవ్య సద్గురుం
త్యాగిమహల్సాపతి సేవితాగ్రం సాయినాధం సద్గురుం చరణం నమామి || 4 ||
పత్రిగ్రామే జాతం వరషిరిడి గ్రామ నివాసం శ్రీ వెంకటేశ మహర్షి శిష్యం
శంకరం శుభకరం భక్తి మతాం సాయినాధం సద్గురుం చరణం నమామి || 5 ||
Leave a Comment