Home » Sri Rama » Sri Rama Dandakam
sri rama dandakam

Sri Rama Dandakam

శ్రీ రామ దండకం

‘శ్రీ రామ రామా, త్రిలోకాభి రామా, పరంధామ, నిష్కామ సంపూర్ణ కామా, బుదేన్ద్రాంత రంగాబ్ది సోమా, లసద్దివ్య నామా, విరాజద్గురు స్తోమ, యుష్మత్ ప్రకాశ స్వరూపంబు అవాచ్యం, అచింత్యం, అనంతం, అసంగం, అఖండం అబాధ్యం, అబోధ్యం, అభేద్యం, అవిచ్చేద్యం, ఆద్యంత శూన్యం, ఆజం, అప్రమేయం, అవిజ్నేయం, అధ్యేయం, అద్వంద్వం, అవ్యక్తం, అగ్రాహ్యం, ఆధ్యాత్మ మేకం, అరూపం, అనాఖ్యం, అరక్తం, ఆశుక్లం, అ కృష్ణం, అపేతం, అపీనం, అ సూక్ష్మం, అదీర్ఘం, ఆహ్రస్వం, అబాహ్యాంతరం, అక్షరం, అవ్యయం, ఇంద్రియా గోచరం, అప్రతర్క్యం, అనిర్దేశ్యం, ఆద్యం, అద్రుశం, అకంపం, అలక్ష్యం, అలిప్తం, ఆశబ్దం, అసంస్పర్శ భూతం, అరూపం, అసుస్వాదు గంధం, అవాన్మానస ప్రాప్యమై, పూర్ణ మై, నిత్యమై, సత్యమై, శుద్ధ మై, బుద్ధ మై, ముక్త మై, శాంతమై, కేవలంబై, నిరాకారమై, సచ్చి దానంద రూపాత్మ చైతన్యమై, సర్వ భూతోరు దేహెంద్రియ ప్రాణ హృద్బుద్ధ్య హంకార, చిత్తాది, దృశ్య ప్రపంచంబు, నాదిత్యుడీ విశ్వ మెల్లన్, వెలింగిమ్పగా, జేయు రీతిన్, ప్రకాశింపగా జేయగా, సాక్షి వై, యాకసం బేకమై, సర్వ భాండంబు లందు అంతట న్, లోపలన్ , వెల్పలన్ నిండి యున్నట్టుల్ ఆకాశ వాయ్వగ్ని వార్భూమి, నానా విధా శేష భూతం బు లందు అంతట న్, నిర్వి లిప్తున్దవై యుండి, కర్తృత్వ, భోత్క్రుత్వ, మంత్రత్వ, భర్త్రుత్వ, హర్త్రుత్వ ముల్, నామ రూప క్రియో పాది వర్నాశ్రమంబు లు గుణమ్బుల్ , వివేకా వివేకంబుల్, శోక మొహమ్బులన్, లేక, ఈ స్థూల శూక్ష్మాదులన్, జాగర స్వప్న సుప్త్యాదుల్, పంచ భూతంబులన్, పంచ కోశంబులన్ ,చూచుచున్, నిర్వి కారున్డవై, నిర్వి కల్పున్డవై, నిర్వి చేష్టున్దవై, నిష్ప్రపంచుండ వై, నిర్వి శేషున్డవై, నిర్గుణ బ్రహ్మ మాత్రున్డవై, యొప్పు, నీ దివ్య తత్వంబు, నీ సత్క్రుపా, సంభ్రుతాంచాట్ కటాక్షంబు చేతం గనున్గొంటి దేవా, నమస్తే, నమస్తే, నమస్తే నమః.

Sri Rama Ashtottara Sathnamavali

శ్రీ రామ అష్టోత్తర శతనామావళి(Sri Rama Ashtottara Sathanamavali) 1. ఓం శ్రీరామాయ నమః 2. ఓం రామభద్రాయ నమః 3. ఓం రామచంద్రాయ నమః 4. ఓం శాశ్వతాయ నమః 5. ఓం రాజీవలోచనాయ నమః 6. ఓం శ్రీమతే...

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Sri Surya Narayana Dandakam

శ్రీ సూర్య నారాయణ దండకం (Sri Surya Narayana Dandakam) శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ 2సార్లు ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!...

Vontimitta Sri Rama Kshetram Kadapa

ఒంటిమిట్ట శ్రీ రాముని క్షేత్రం (Vontimitta Sri Rama Temple Kadapa) శ్రీరాఘవం దాశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం! ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి!! అంటూ శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలానగరంగా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!