Home » Temples » Sri Narrawada Vengamamba

Sri Narrawada Vengamamba

Sri Narrawada Vengamamba

Sri Narrawada Vengamamba Temple is located in Duttalur Mandal of Nellore District, Andhra Pradesh. Temple is dedicated to Godess Vengamamba devi which is has history over 300 years.

Every year Sri Vengamamba Perantalu (Tirunallu) will be performed in the month of Jesta Masam (June or July). Devotees around the world will come to celebrate the 5 days festival for Godess Vengamamba. So many interesting things will be happen there on the Gramotsava day where the Guravayya Swamy and Vengamamba talli will.

నర్రవాడ వెంగమాంబ జననము :

ఇది క్రీ.శ. 16వ శతాబ్దంలో జరిగిన వాస్తవకథ. నర్రవాడ గ్రామానికి సమీపంలో వున్న వడ్డిపాలెంలో పచ్చన వెంగమనాయుడు, సాయమ్మ అనే దంపతులు వుండేవారు. వీరు ఎల్లమ్మ భక్తులు. బిడ్డలకోసము పుణ్యక్షేత్రాలు తిరిగారు, వ్రతాలు, దానధర్మాలు చేశారు. వీరి నోముల పంటగా ఎల్లమ్మ తల్లి వెంగమ్మ తల్లిగా జన్మించినది. జగన్మాత పుట్టుకకు ప్రకృతి, యోగీశ్వరులు పరవశించిపోయారు. అనిర్వచనీయమైన ఆనందము ఆ దంపతులలోను, నర్రవాడ గ్రామములోను తాండవించింది. దివ్యశకులలతో జన్మించిన ఆమె పుట్టుకతోనే ప్రణవాన్ని, గాయత్రి మంత్రాన్ని పలికింది. ఆత్మజ్ఞానంతో దినదిన ప్రవర్ధమానమవుతూ తననెచ్చెలి తుమ్మల పెదవెంగమ్మకు ఆధ్యాత్మిక సూత్రాలను, ఆర్యసూక్తులను చెపుతూ వాటిని ఆచరణలో చూపించేది

ఆమె బోధనలు విని ఆ గ్రామ ప్రజలు భక్తి ప్రపత్తులతో నైతిక జీవనాన్ని సాగిస్తూ క్రమేణా చైతన్యవంతులయ్యారు. యుక్తవయస్సుకు వచ్చిన వెంగమాంబను అదే ఊరిలోని వేమూరి అంకయ్యనాయుడు రెండవ కుమారుడు గురవయ్యకిచ్చి వివాహము జరిపించారు. సాహసవంతుడు, సౌశీల్యవంతుడు అయిన గురవయ్య సాహచర్యంలో వివాహ జీవన వైశిష్ట్యాన్ని త్రికరణ శుద్దితో ఆచరించినది వెంగమాంబ. తనకోసము కాదు ఈ బ్రతుకు … సమాజముకోసము అన్నట్లు ఏవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయక ధైర్యముతో ముందుకు నడచి సమాజ శ్రేయస్సుకోసం పాటుపడింది.

సామాజిక కట్టుబాట్లను ఎదిరించి మానవతా విలువల్ని పరిరక్షించింది. త్రాగునీటి ఎద్దడితో అలమటిస్తున్న దళితవర్గాలకు బాసటగా నిలబడి మంచినీరు అందించింది. ప్రజలంతా సమానులని, అంటరానితనము జాతిమనుగడకు సామాజిక శాపమని భోదించింది. ప్రకృతి వైపరీత్యాలవల్ల క్షామము ఏర్పడి తాగడానికి గుక్కెడు నీళ్ళుకూడా దొరకని పరిస్థితిలో తన పూజలతో వర్షం కురిపించి నిమ్నవర్గాలను ఆదుకొంది. తన ఐదవతనాన్ని సైతం లెక్కచేయక తన భర్తను ఆయుధంగా గజదొంగల మీదకు పంపించి సాటి మానవతుల మాన ప్రాణాలను కాపాడింది. గజదొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక గజదొంగ రహస్యం గా వెనకనుండి వేసిన బళ్ళెం పోటుతో నేలకొరిగాడు. లోకపాననియైన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగళిగా తనువుచాలించి పేరంటాలుగా వెలసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకొంది. దళితులు స్వయంగా తయారుచేసి ఇచ్చిన నేతచీరను కట్టుకొని భర్తకంటే ముందుగా దహనం కావడనికి ఊరిపెద్దల అనుమతి పొంది కొన్ని నిముషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణచేసి యోగాగ్నిలో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది .

తల్లిని కోల్పోయిన బిడ్డల్లా కన్నిరు మున్నీరుగా రోదిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా “నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను. అందుకు గుర్తుగా నా మంగళ సూత్రాలు, పమిటచెంగు, మెట్టెలు, పసుపు కుంకుమలు చెక్కుచెదరకుండా వుంటాయని” చెప్పింది. ఆ తల్లి చెప్పినవిధంగా ఆ వస్తువులన్నీచూసిన ప్రజలు భక్తి పారవశ్యంతో ” శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై” అంటూ జయజయధ్వానాలు చేసి గుడికట్టించి నేటికీ యిలవేల్పుగా కులదైవంగా పూజిస్తున్నారు. ఈ దేవతకు 1940 సంవత్సరములో ఆలయం నిర్మించారు. అమ్మవారు భర్త గురవయ్యతో కొలువైన మందిరానికి ఎడమవైపు తన స్నేహితురాలైన పెదవెంగమ్మ దంపతుల విగ్రహాలను ప్రతిష్టించారు. కుడివైపు అందుడైన వెంగమాంబ బావ ముసలయ్య విగ్రహం పూజలందుకొంటుంది.

నర్రవాడ వెంగమాంబ కొలువైన చోటు:

నాడు విక్రమ సింహపురి అనే పేర ప్రసిద్ధి పొందిన నేటి నెల్లూరుకు హృదయస్థానము ఉదయగిరి. సుమారు వెయ్యేళ్ళు చరిత్ర కలిగిన ఈ హృదయగిరి మనసును రంజింపజేసే ప్రకృతి శోభకు ఆలవాలమైనది. ఎత్తైన కొండలు దట్టమైన అడవులు, కొండఅంచులనుండి జాలువారే జలపాతాలు భాహ్యప్రపంచాన్ని మరపింపజేస్తుంది. శత్రు దుర్భేద్యమయిన ఉదయగిరి దుర్గాన్ని కళింగరాజైన లాంగూల గజపతి నిర్మించాడు. దీని ఎత్తు సముద్ర మట్టానికి 3079 అడుగులు. ఘనచరిత్ర కలిగిన ఈ పట్టణంలో, చుట్టుప్రక్కల ప్రాంతాలలో సుమారు 365 దేవాలయాలుండేవి. వీటిని 1610 సం. ప్రాంతంలో శత్రురాజులు కూల్చివేశారని అక్కడివారు చెపుతారు. పార్వతి పరమేశ్వరులకు దేవగంధర్వులకు ఈ ప్రాంతం విహారస్థలమని పురాణాలు తెలియజేస్తున్నాయి. పవిత్ర స్థలము కావడం వల్ల యోగులు, మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు. దట్టమైన అడవులు, కొండలు, వుండడం చేత గజదొంగలకు స్థావరంగా ఉండేది. దైవభక్తి, దివ్యశక్తి కి నెలవైన ఉదయగిరి ప్రాంతంలో పచ్చని గడ్డికి కొదువలేదు ఎక్కువగా ఉండేది.

అందువల్ల పశుసంపద ఇక్కడి ప్రజలకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. పదమూడవ శతాబ్దిలో యాదవవంశ యశోధీక్షితుడైన శ్రీ కాటమరాజు తన పశువుల్ని ఇక్కడ మేపుకొని పుల్లరివల్ల ఏర్పడిన తగాదా కారణంగా ఆ సమయంలో నెల్లూరును పాలించే నల్లసిద్ది రాజుతో యుద్ధం చేసి అతనిని హతమార్చి జీవకారుణ్యతను లోకానికి చాటిచెప్పాడు. ఈ వీరుని వీరోచిత పోరాటాన్ని ఇప్పటికీ జానపదులు కథలుగా చెప్పుకొంటూ పశుగ్రాసం మీద పుల్లరి విధించి ప్రజల్ని హింసించే ప్రభువులకు కనువిప్పు కలిగిస్తూ వుంటారు. ఇలాంటి చారిత్రక, ఆధ్యాత్మిక నేపధ్యము కలిగిన ఉదయగిరిగి ఈశాన్యదిశలో సుమారు ఇరవై కిలోమీటర్ల దూరములో వున్న నర్రవాడ గ్రామంలో శ్రీవెంగమాంబ దేవత కొలువై ఉన్నది.

స్థల పురాణము :

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం భగవంతుడు మనిషి రూపంలో జన్మిస్తాడని భగవద్గీత తెలియజేస్తోంది. ఇందులో భాగంగానే తనకు మారుగా సర్వేశ్వరుడు స్త్రీని సృష్టించాడని వాదన. జగన్మాత అనేక రూపాల్లో అవతరించి దుష్టులను హతమార్చి లోకకళ్యాణం జరిపించిదని దేవీభావతం సాక్ష్యమిస్తుంది. జగన్మాత ఆవిర్భావానికి మూలకారణాలు సామాజిక అరాచకం, ద్ర్ష్టశక్తులు విలయతాండవం చేయడంగా పేర్కొనవచ్చు. నర్రవాడ ప్రాంతంలో గజదొంగల అకృత్యాలకు అంతులేకుండా వుండేది. స్త్రీల మానప్రాణాలకు రక్షణ వుండేది కాదు. పశువుల మేపుకు, వాటి అమ్మకాలకు పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు. ఈ పరిస్థితులలో స్త్రీలు, బలహీనులైన వృద్ధులు గజదొంగల నీచకృత్యాలకు తలవంచక తప్పలేదు. మూఢనమ్మకాలతో, అర్ధం లేని సామాజిక కట్టుబాట్లతో మానవతా విలువలు అడుగంటిపోయిన దశలో తమను ఆదుకోడానికి దేవతామూర్తి జన్మించాలంటూ కనీటితో ఆకాశానికేసి ప్రార్ధించేవారు. ఆదిపరాశక్తి అయిన ఎల్లమ్మతల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వెంగమాంబగా జన్మించిందని ఇక్కడి స్థలపురాణము తెలియజేస్తుంది.

గ్రామదేవత :

ఆంధ్రప్రదేశ్ లోని వందలాది మంది గ్రామదేవతల కథల్ని పరిశీలిస్తే వారివారి పాతివ్రత్య మహిమచేతనో, దైవభక్తి చేతనో దుర్మార్గాన్ని ఎదిరించి తమ దైవత్వాన్ని నిరూపించి దేవతలైనట్లు తెలుస్తోంది. అయితే నర్రవాడ వెంగమాంబ తన సహజ శక్తిని సమాజ శ్రేయస్సుకు, సంస్కరణకు, నైతిక విలువల పునరుద్ధరణకు, అస్పృశ్యతా నివారణకు వినియోగించి ఇహపరశక్తులను ఆశ్చర్యపరచింది. సత్వగుణాత్మికయై స్త్రీ జాతిని చైతన్య పరచింది. సహజంగా కొత్త కోడలు ఎదుర్కొనే అత్త ఆడపడుచుల ఆరళ్ళను ధైర్యంగా ఎదుర్కోంటూ, మరో వైపు తన ఐదోతనాన్ని సైతం లెక్కచేయక భర్తను దుష్టశిక్షణకోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మానప్రాణాలను కాపాడైన మహిమాన్విత, మానవత్వము నుండే దైవత్వము ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత.

ప్రతిసంవత్సరము జ్యేష్టమాసం లో పౌర్ణము వెళ్ళేక వచ్చే మొదటి ఆదివారము నుండి గురువారము వరకూ గల ఐదురోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆదివారము “నిలుపు”, సోమ మంగళ వారములలో “గ్రామోత్సవం”, బుధవారము ” పసుపు కుంకుమ ఉత్సవం”, గురువారము “పొంగళ్ళు – బండ్లు తిరుగుట, ఎడ్లచే బండ్లు లాగుట పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి . ఈ తిరునాళ్ళకు వేలాది భక్తులు వస్తూఉంటారు. టన్నులకొద్ది ఎండుకొబ్బరి అగ్నిగుండలో వేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఈ ఐదురోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంస భక్షణ చేయరు. ఈ ఆలయము నర్రవాడ గ్ర్రామము నెల్లూరు జిల్లా దత్తలూరు మండలంలో ఉన్నది.

Sri Mahakaleshwara Jyotirlingam

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం (Sri Mahakaleshwara Jyotirlingam) విహితావతారం, ముక్తిప్రదానాయచ సజ్జనానాం | అకాల మ్రుత్యోహ పరిరక్షనార్థం, వందే మహాకాల మహం సురేశం || పరమేశ్వరునికి స్మశానమంటే అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం, పుష్కరం, కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం...

Sri Kurmam Kshetram

శ్రీకూర్మం క్షేత్రం (Sri Kurmam Kshetram) శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండోది అవతారం కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక క్షేత్రమే శ్రీకూర్మం ఇక్కడ స్వామివారు “కూర్మనాధ స్వామి” రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. భారతదేశంలోనే కాదు...

Dwaraka Tirumala

ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) శ్రీ లక్ష్మీనివాసుడైన వేంకటేశ్వరుడు స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం ఈ ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు 41 కి.మి. దూరం లో నెలకొని ఉంది. ఈ క్షేత్రం లో ఒకే...

Sri Omkareshwar Jyotirlingam

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం (Sri Omkareshwar Jyotirlingam) కావేరికా నర్మదయోహ పవిత్రే, సమాగమే సజ్జనతారనాయ సదివ మాదాత్రుపురే వసంత, మొన్కారమీశం శివమేకామీడే ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారేవరూ లేరని విర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారదమహర్షి చెప్పగా, కోపితుడై, ఓంకార క్షేత్రానికెళ్ళి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!