శ్రీ లక్ష్మీ హృదయం (Sri Lakshmi Hrudayam)
హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా!
హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ || 1 ||
భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని స్మరిస్తున్నాను.
కౌశేయ పీతవసనామరవిందనేత్రాం పద్మాద్వయాభయవరోద్యతపద్మహస్తాం |
ఉద్యఛ్ఛతార్క సదృశాం పరమాంకసంస్థాం ధ్యాయేద్ విధీశనత పాదయుగాం జనిత్రీం || 2 ||
భావం: పద్మ దళముల వంటి కన్నులు కలది, పద్మముల వంటి కోమల హస్తాలతో అభయాన్ని ఇచ్చేది, ఉదయ భానుడి వంటి ప్రకాశవంతమయిన దేహము కలది, ఎరుపు-పసుపు మేళవించిన వస్త్రాలు ధరించినది, పరమార్ధ ప్రదాయిని, లోకమాత అయిన మహాలక్ష్మీదేవి పాదపద్మములను స్మరించుచున్నాను.
పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం
లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృధివీపతిః || 3 ||
భావం: బంగారు మేనిఛాయతో , పీతవస్త్రాలను (పసుపు రంగు) వస్త్రాలను , ఇరు హస్తాలలో పద్మాలు ధరించిన లక్ష్మీదేవిని పై విధంగా ధ్యానించిన వారికి మహారాజయోగం పడుతుంది.
మాతులుంగ గదాఖేటే పాణౌ పాత్రంచ బిభ్రతీ
వాగలింగంచ మానంచ బిభ్రతీ నృపమూర్ధని || 4 ||
భావం: తన చేతులలో గద, డాలు,నిమ్మ పళ్ళతో నిండిన పాత్ర ధరించి, వాగలింగాన్ని గౌరవించే రాజుల నుదిటిపై వెలుగొందే లక్ష్మిని ధ్యానించుచున్నాను
వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీం
బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం
ఆద్యాం శక్తిం సకలజననీం సర్వమాంగళ్య యుక్తాం. || 5 ||
భావం: దైవత్వానికి ప్రతిరూపమయినది, స్వచ్చమయిన బంగారం వలె దివ్యతేజస్సు కలది, కనక వస్త్ర ధారిణి , సకల ఆభరణాలతో మెరిసే దేహము కలది,
దానిమ్మగింజలతో నిండిన కనక కలశాన్ని,పద్మాలను చేత ధరించినది, ఆదిశక్తి లోకమాత అయిన లక్ష్మికి ప్రణామములు.
శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం
సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం || 6 ||
భావం: తన ఉపాసనతో సకలసౌభాగ్యాలను కలిగించేది, అన్ని కోరికలనూ తీర్చేది, అదృష్టదాయిని,సనాతని అయిన లక్ష్మిని నుతించుచున్నాను.
స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీం || 7 ||
భావం: నీ వలన ప్రేరితమయిన మనస్సుతో, నీ ఆజ్ఞను శిరసావహించి, పరమేశ్వరివయిన నిన్ను నిత్యం తలచుకుంటాను దేవీ
సమస్తసంపత్సుఖదాం మహాశ్రియం
సమస్తకల్యాణకరీం మహాశ్రియం
సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం
భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం || 8 ||
భావం: సమస్త సంపదలను ప్రసాదించేది, సమస్త మంగళాలను కలిగించేది, సౌభాగ్యదాయిని, జ్ఞానప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవిని భజిస్తున్నాను
విజ్ఞాన సంపత్సుఖదాం మహాశ్రియం
విచిత్రవాగ్భూతికరీం మనోరమాం
అనంతసౌభాగ్యసుఖప్రదాయినీం
నమామ్యహం భూతికరీం హరిప్రియాం || 9 ||
భావం: మానసిక ఉల్లాసాన్ని కలిగించేది, హరిప్రియ, వాగ్దాయిని, సర్వసంపదలను ప్రసాదించేది, విజ్ఞాన సంపద ద్వారా శాశ్వత ఆనందాన్ని ప్రసాదించేది అయిన మహాలక్ష్మికి వందనములు..
సమస్తభూతాంతరసంస్థితా త్వం
సమస్తభక్తేశ్వరి విశ్వరూపే
తన్నాస్తి యత్త్వద్వ్యతిరిక్తవస్తు
త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః || 10 ||
భావం: తల్లీ! నువ్వు సర్వంతర్యామినివి. భక్తులందరికీ ఆరాధ్యదేవతవు. విశ్వరూపిణివి. నువ్వు కానిది ఏదీ ఈ లోకంలో లేదు. అట్టి నీ పాదపద్మములకు నమస్కారములు.
దారిద్ర్య దుఃఖౌఘ తమోనిహంత్రి
త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ
దీనార్తివిచ్ఛేదన హేతుభూతైః
కృపాకటాక్షైరభిషించ మాం శ్రీః || 11 ||
దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని హరించే, నీ పాదపద్మముల సన్నిధిని నాకు ప్రసాదించు. నా లోని ఆర్తిని, దీనత్వాన్ని తొలగించే నీ కృపాద్రుష్టిని నాపై వర్షింపచెయ్యి తల్లీ
Leave a Comment