శ్రీ కృష్ణ కృత శివ స్తుతి (Sri Krishna Kruta Shiva Stuti)
త్వమేవ సత్త్వం చ రజస్తమశ్చ త్వమేవ సర్వం ప్రవదంతి సంతః |
తతస్త్వమేవాసి జగద్విధాయకః త్వమేవ సత్యం ప్రవదంతి వేదాః ||
సత్త్వరజస్తమాలనే గుణాలు నీవే. సర్వం నీవేనని సత్పురుషులు చెబుతుంటారు. కనుక నీవే జగద్విధానాన్ని నడపువాడవు. నువ్వు సత్యానివని వేదములు పలుకుతున్నాయి.
త్వ బ్రహ్మా హరిరథ విశ్వయోనిః అగ్నిస్సంహర్తా దినకర మండలాధివాసః |
ప్రాణస్త్వం హుతవహ వాసవాది భేదః త్వామేకం శరణముపైమి దేవమీశం ||
విశ్వానికి కారణమైన నువ్వే బ్రహ్మవు, హరివి, సంహారకుడైన (కాలరూప) అగ్నివి. సూర్యమండలంలో ఉన్నవాడవు. ప్రాణానివి. అగ్ని ఇంద్రాది భేదములతో నున్న ఏక రూపుడైన, స్వయం ప్రకాశుడవైన, ఈశ్వరుడవైన నిన్ను శరణువేడుతున్నాను.
సాంఖ్యా స్త్వామగుణ మధాహురేక రూపం యోగస్త్వాం సతతముపాసతే హృదస్థం |
దేవాస్త్వామభిదధతేహ రుద్రమగ్నిం త్వామేకం శరణముపైమి దేవమశం ||
సాంఖ్యులు (బ్రహ్మజ్ఞానులు) నిన్ను నిర్గుణుడివైన ఏకతత్త్వముగా చెబుతున్నారు. యోగులు హృదయంలో నిన్ను ఎల్లవేళలా ఉపాసిస్తున్నారు. అగ్ని రూపుడవైన రుద్రునిగా దేవతలు నిన్ను సంపూర్ణంగా గ్రహిస్తున్నారు.
Leave a Comment