శ్రీ కాత్యాయనీ సప్తశ్లోకీస్తుతి (Sri Katyayani Saptha Sloki Stuti)
కరోపాంతే కాంతే వితరణ వంతే విదధతీం
నవాం వీణాం శోణామభిరుచిభరేణాంకవదనామ్,
సదావందే మందేతరమతిరహం దేశికవశా
త్కృపాలంబామంబాంకుసుమిత కదంబాంకణగృహామ్ || 1 ||
వశిప్రఖ్యం ముఖ్యం కృతకమలసఖ్యం తవముఖం
సుధావాసం హాసం స్మితరుచిభిరాసన్నకుముదమ్,
కృపాపాత్రే నేత్రే దురుతకరితో త్రేచ నమతాం
సదా లోకే లోకేశ్వరి విగతశోకేన మనసా || 2 ||
అపి వ్యాధా వాధావసి సమాధాయ హృది తా
మనౌపమ్యాం రమ్యాం మునిభి రవగమ్యాం తవ కలామ్,
నిజామాద్యాం విద్యాం నియతమవద్యాం న కలయే
స మాతంగీమంగీకృతసరసంగీతరసికామ్ || 3 ||
స్ఫురద్రూపానీపావనిరుహసమీపాశ్
సుధాధారధారధరురుచిరుదారా కరుణయా,
స్తుతిప్రీతా గీతామునిభిరుసపనీతా తవ కలా
త్రయీసీమా సా మా మవతు సురసామాజికమతా || 4 ||
తులాకోటీకోటీ కిరణపరిపాటీ దినకరం
నఖచ్ఛాయామాయా శశినళిన దాయాదవిభవమ్,
పదం సేవే భావే తవ విపదభావే విలసితం
జగన్మాతః ప్రాతః కమలముఖ నాతః పరతరమ్ || 5 ||
కనత్ఫాలాం బాలాం లలిత శుకలీలాంబుజకరాం
లసద్ధారాదారాం కచవిజితధారధరరుచిమ్,
రమేంద్రాణీవాణీ లసదసిత వేణీసుమపదాం
మహత్సీమాం శ్యామామరుణగిరివామాం భజ మతే || 6 ||
గజారణ్యే పుణ్యే శ్రితజన శరణ్యే భగవతీ
జపావర్ణాపరాం తరళతరాకర్ణాంతనయనా,
అనాద్యంతా శాంతా బుధజనసుసంతానలతికా
జగన్మాతా పూతా తుహినగిరిజాతా విజయతే || 7 ||
ఫలశ్రుతి
గౌర్యాసప్తస్తుతిం నిత్యం ప్రభాతే నియతః పఠేత్
తస్య సర్వాణి సిద్ధ్యన్తి వాంచితాని న సంశయః
Leave a Comment