Home » Temples » Sri Grishneshwara Jyotirlingam

Sri Grishneshwara Jyotirlingam

శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం (Sri Grishneshwara Jyotirlingam)

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఆఖరి జ్యోతిర్లింగం దీనిని ఘృష్ణేశ్వరుడు, ఘ్రుణేశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగం గురుంచి ఒక పురాణ కధ ఉంది అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పూర్వం దక్షిణ దేశం లో దేవగిరి పర్వత సమీపం లో సుధర్ముడు – సుదేహ అనే దంపతులుండేవారు వీరికి ఎంతకాలమైనప్పటికి సంతానభాగ్యం కలుగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజోవిరాజితుడైన ఓ యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు. అతనిని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాను ఏర్పాటు చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు, సగంలోనే భోజనాన్ని వదిలెసి వెళ్ళసాగాడు. సంతానంలేనివారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది యతీశ్వరుని నియమం. ఆ దంపతలు యతీశ్వరుని కాళ్ళపై బడి ప్రార్థించగా, త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు. పెళ్ళికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరశీలించిన పండితులు, ఆమెకు సంతానప్రాప్తి లేదని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ, తన చెల్లెలు ఘశ్మకు పెళ్ళి చేసుకోమని భర్తకు చెబుతుంది. సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికి, సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్ళి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమపతివ్రతయైన ఘశ్మ, అక్క సుదేహను తల్లిల్లా, భర్త్నను దైవసమానునిగా భావించి సేవిస్తుండెది. అచిరకాలంలోనే ఘశ్మ గర్భవతి అయింది. ఒక శుభదినంలో ఘశ్మ మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానంగా పెరగసాగడు. అయితే, సుదేహ మనసులో అసూయాజ్వాలలు రేగాయి. తన చెల్లెలు, చెల్లెలి కొడుకుపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకోసాగిది. ఒకరోజు రాత్రి సుదేఅ, పసివాని గొతుకోసి, తలను మొండేన్ని వేరువేరుగ చెరువులోకి విసిరివేసింది. ఇదంతా తెలియని ఘశ్మ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలను తీర్చుకుని, స్నానం చేసేందుకు సరోవరానికి వెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటువచ్చి, ‘అమ్మా! నేనొక పీడకల కన్నాను. అందులో నేను చచ్చి బ్రతికినట్లు కనిపించింది’. అని చెప్పాడు. కొడుకు చెప్పిన సంగతిని విన్న ఘశ్మ దిగ్ర్భమజెంది, ఎందుకిలా జరిగింది? ఇది కలా? నిజమా? అని ఆలొచించసాగింది. అలా ఆమె దీర్ఘాలొచనలోనుండగా, శివుడు ప్రత్యక్షమై, సుదేహ చేసిన ఘోరకృత్యాన్ని చెప్పి, ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు. అప్పుడు శివుని కాళ్ళపై బదిన ఘశ్మ, తన అక్కకు ఎటువంటి దండన వద్దని, మారుగా ఆమెకు మంచి బుద్ధి, సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు, ‘తల్లీ! నీ కోరిక ప్రకారమే జరుగుతుంది. ఇకపై నేను ఘృష్నేశ్వరనామంతో ఇక్కడె కొలువై ఉండగలవాడను. నీవు దీర్ఘసుమంగళివై చిరకాలం వర్థిల్లి, చివరకు నా లోకాన్ని చేరుకుంటా’ వని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.

ఘృష్ణేశ్వర లింగాన్ని పూజించిన వారికి పుత్రశోకం కలుగదని ప్రతీతి.

Sri Omkareshwar Jyotirlingam

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం (Sri Omkareshwar Jyotirlingam) కావేరికా నర్మదయోహ పవిత్రే, సమాగమే సజ్జనతారనాయ సదివ మాదాత్రుపురే వసంత, మొన్కారమీశం శివమేకామీడే ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారేవరూ లేరని విర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారదమహర్షి చెప్పగా, కోపితుడై, ఓంకార క్షేత్రానికెళ్ళి...

Sri Chamundeshwari Shakti Peetam, Mysore

శ్రీ చాముండేశ్వరి శక్తి పీఠం, మైసూరు (Sri Chamundeshwari Shakti Peetam) ఈ క్షేత్రం కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరు కి 120 కిలోమీటర్ల దూరం లో  మైసూరు లో ఉంటుంది దీనినే క్రౌంచ పట్టణం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!