Home » Stotras » Shri Chitta Stheeryakam Stotram

Shri Chitta Stheeryakam Stotram

చిత్త స్థిర స్త్రోత్రo (Shri ChittaStheeryakam Stotram)

అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే |
సర్వదేవాధి దేవత్వం మమ చితం స్థిరీకురు || 1 ||

భావము: అత్రి అనసూయల దీపకుడిగా ఉద్భవించిన వాడు సర్వ దేవతలలో నిండిన దైవత్వంను, బుద్దిమంతుడు అయిన శ్రీ దత్తాత్రేయస్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు

శరణాగత దీనార్త తరకాఖిల కారక |
సర్వ చాలక దేవత్వం మమ చిత్తం స్టిరీకురు || 2 ||

భావము : శరణాగతి చెందిన వారికీ,దీనులకు జ్ఞానం ప్రసాదించే వాడు,అందరినీ స్వయం సమృద్ధిగా ఉద్ధరించే వాడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

సర్వ మంగళ మాంగల్య సర్వాధి వ్యాధి భేషజ |
సర్వసంకట హరీన్ త్వం మమ చితం స్థిరీకురు || 3 ||

భావము : అన్ని శుభములకుమంగళ కారివై అన్ని వ్యాధులకు ఔషధం నీవై,అన్ని కష్టములను తొలగించు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

స్మర్తృగామి స్వ భక్తానాం కామదో రిపు నాశనః |
భుక్తి ముక్తి ప్రద: సత్వం మమ చితం స్థిరీకురు || 4 ||

భావము తన భక్తులు పిలవగానే ప్రత్యక్షమై కామ,క్రోధ,లోభ,మోహం లనే శత్రువులను నాశనం చేసి ఇహ,పర శ్రేయస్సులను సత్వరం మే తీర్చే శ్రీ దత్తాత్రేయ స్వామి..నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

సర్వ పాప క్షయ కర స్తాపదైన్య :నివారణం |
యో భీష్టదః :ప్రభు :సత్వం మమ చితం స్థిరీకురు || 5 ||

భావము అన్ని పాపములు నశింప జేసి,అధ్యామిక,అది బౌతిక,దైవిక తాపాలు నివారించి త్వరగా అభీష్టములు ప్రసాదించు శ్రీ దత్తాత్రేయ స్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

య ఏత త్ర్ప్ యతః శ్లోక పంచకం ప్రపటేత్సుదీ:
స్థిర చిత్త స్స భగవాన్ కృపా పాత్రం భవిష్యతి. || 6 ||

భావము శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఈ పంచకం శ్లోకాలు ఎవరు భక్తితో పఠిస్తారో వారికి భగవాన్ శ్రీ దత్తాత్రేయ అనుగ్రహంతో పాటు స్థిర మైన చిత్తము స్వామి వారిపై కలుగుతుంది.శ్రీ దత్తాత్రేయ స్వామికి అంకితం.

ఈ ఐదు శ్లోకాలు నిత్యము పఠిస్తే దత్తాత్రేయుల వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

Neela Kruta Hanuman Stotram

నీల కృత హనుమా స్తోత్రం  (Neela Kruta Hanuman Stotram) ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి...

Sri Tara Takaradhi Sahasranama Stotram

శ్రీ తారా తకారాది సహస్రనామ స్తోత్రం (Sri Tara Takaradhi Sahasranama Stotram) అథ శ్రీ తారాతకారాదిసహస్రనామ స్తోత్రం । వసిష్ఠ ఉవాచ నామ్నాం సహస్రన్తారాయా ముఖామ్భోజాద్వినిర్గతమ్ । మన్త్రసిద్ధికరమ్ప్రోక్తన్తన్మే వద పితామహ ॥ ౧॥ బ్రహ్మోవాచ శృణు వత్స ప్రవక్ష్యామి...

Sri Nagendra Ashtottara Shatanamavali

శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి (Sri Nagendra Ashtottara Shatanamavali) ఓం అనంతాయ నమః ఓం ఆది శేషా య నమః ఓం అగదాయ నమః ఓం అఖిలోర్వీచాయ నమః ఓం అమిత విక్రమాయ నమః ఓం అనిమిషార్చితాయ నమః ఓం...

Sri Santhana Gopala Stotram

Sri Santhana Gopala Stotram (శ్రీ సంతానగోపాల స్తోత్రం) సంతానం కోరుకునే వారు ఈరోజు కృష్ణాష్టమి రోజున ఉదయం ఉపవాసం ఉండి సంతాన గోపాల స్తోత్రం 11 సార్లు చదివి బ్రాహ్మణులకి స్వయంపాకం నూతన వస్త్రాలను ఇచ్చిన గోపాలుని అనుగ్రహం కలిగి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!