శ్రీ బ్రహ్మచారిణి దేవీ (Sri Brahmacharini Devi)
ఈ అమ్మవారు పరమేశ్వరుని భర్తగా పొందటానికి కఠోరమైన దీక్ష చేసింది ఆమె ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది. కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును. వివాహం కాని కన్యలు లేదా యువకులు అమ్మవారిని పూజించటం వలన శీగ్రం గా వివాహం అవుతుంది.
దధానా కరపద్మాభ్యామక్షమాలాకమణ్డలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
Leave a Comment