శివ పంచాక్షరీ స్తోత్రం (Siva Panchakshara Stotram)
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ‘నకారాయ నమశ్శివాయ!!
మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ!!
శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ!!
వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ!!
యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ!!
పంచాక్షర మిదం పుణ్యం యఃపఠేత్ శివసన్నిధౌ
శివలొకమవాప్నోతి శివేన సహమోదతే!!
Leave a Comment