Home » Sri Shiva » Shiva Nindha Stuthi

Shiva Nindha Stuthi

శివ నిందా స్తుతి (Shiva Nindha Stuthi)

ఇసుక రేణువులోన దూరియుందువు నీవు
బ్రహ్మాండమంతయును నిండియుందువు నీవు
చివురాకులాడించు గాలిదేవర నీవు
ఘన కానలను గాల్చు కారుచిచ్చువు నీవు

క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు నీవు
కాలయమునిబట్టి కాలదన్ను నీవు
పెండ్లి జేయరాగ మరుని మండించినావు
పెండ్లియాడి సతికి సగమిచ్చినావు

దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి
వికటాట్టహాసమున భయపెట్టినావు
కడలి చిలుకు వేళ కాలకూటము బుట్ట
దాని త్రావి సురల గాచినావు

ఈ తిక్క శివునితో వేగలేననుచూ
ముక్కంటి కోపాన్ని ఓపలేననుచూ
వదిలిపోదమన్న వేరు దైవము లేదు
నీవు తప్ప నాకు గతియు లేదు

ఏమిసేతును దేవ సర్దుకొందును లెమ్ము
అమ్మవారి నడిగి మసలుకొందు
దూరముగ నీవున్న నా భయము హెచ్చును
నాదాపు నుండుటకు నీవొప్పుకొనుము

నీ ఆలితో గూడి నాగుండెలోనుండి
ఏడేడు లోకాల నేలుకొనుము
నా ఋణము తీర్చుకొన ఇవ్వుమొక చిరువరము
నా మనము నీ పదము నుండునటుల.

Shiva Pratah Smarana Stotram

శివ ప్రాతః స్మరణం (Shiva Pratah Smarana Stotram) ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహన మంబికేశం  || 1 || ఖట్వాంగ శూల వరదాభయ హ సమీశం సంసార రోగహరమౌషధమద్వితీయం || 2 || ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధ...

Sri Raghavendra Stotram

శ్రీ రాఘవేంద్ర స్తోత్రం (Sri Raghavendra Stotram ) పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే || శ్రీపూర్ణబోధగురుతీర్థపయోబ్ధిపారా కామారిమాక్షవిషమాక్షశిరః స్పృశంతీ | పూర్వోత్తరామితతరంగచరత్సుహంసా దేవాళిసేవితపరాంఘ్రిపయోజలగ్నా || జీవేశభేదగుణపూర్తిజగత్సుసత్త్వ నీచోచ్చభావముఖనక్రగణైః సమేతా | దుర్వాద్యజాపతిగిళైః గురురాఘవేంద్ర...

Sri Venkateshwara Stotram

శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రం (Sri Venkateshwara Stotram) కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో | కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే || 1 || సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే |...

Sri Narayana Stotram

శ్రీ నారాయణ స్తోత్రం (Sri Narayana Stotram) నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!