Home » Stotras » Shivalinga Abhisheka Benefits
shivainga abhisheka benefits

Shivalinga Abhisheka Benefits

శివాభిషేక ఫలములు (Shiva linga Abhisheka Benefits)

  1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
  2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
  3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
  4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
  5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
  6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
  7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
  8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
  9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
  10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
  11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
  12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
  13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
  14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
  15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
  16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
  17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
  18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
  19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
  20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
  21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
  22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
  23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
  24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.

Indra Kruta Manasa devi Stotram

ఇంద్ర కృత మానసా దేవి స్తోత్రం (Indra Kruta Manasa devi Stotram) దేవీ త్వాం స్తోతు మిచ్చామి స్వాధీనం ప్రవరామ్ వరామ్ | పారత్‌పారాం ప చ పరమాం నహి స్టోతుం క్షమో ధూనా || స్తోత్రానామ్ లక్షణం  వేదే...

Runa Vimochana Narasimha Stotram

ఋణ విమోచన నృసింహ స్తోత్రం (Runa Vimochana Narasimha Stotram) దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 || లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ...

Navagraha Peeda hara Stotram

నవగ్రహా పీడా హార స్తోత్రం (Navagraha Peeda hara Stotram) గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణకారకః విషమ స్థాన సంభూతం పిడాం హరతుమే రవిహి || రోహిణిసస్సుధామూ ర్తిస్సుధాగాత్రస్సు రాలనః విషమస్థాన సంభూతం పీడాం హరతు మే విదు: || భూమిపుత్రో మహాతేజా...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!