Home » Temples » Penchalakona Kshetram

Penchalakona Kshetram

పెంచలకోన క్షేత్రం(Penchalakona Kshetram)

దట్టమైన అడవిలో సుందర ప్రశాంత వాతావరణములో కొండల మధ్యలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి నామస్మరణతో ఓం “శ్రీ లక్ష్మీనరసింహస్వామియేనమః” అంటూ పునీతమవుతున్న పవిత్ర క్షేత్రం పెంచలకోన, ఈ దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామివారు భక్తులచే నిత్యా పూజలు అందుకుంటున్నారు.

పెంచలకోన నరసింహ క్షేత్రం విశిష్టత

పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం గురించి కొన్ని మాటల్లో … శ్రీహరి నరసింహుడిగా మారి హిరణ్యకస్యపుడిని సంహరించి ఉగ్ర నరసింహుడు అయ్యాడు. ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు, ప్రజలు భయబ్రాంతులు గురయ్యారు. అలా శేషాచలం అడవుల్లో సంచరిస్తుంటే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించింది. అప్పుడు ఆ ముగ్ధమొహన సౌందర్యం ఆయనని శాంతపరిచింది. స్వామి పెళ్ళిచేసుకోవాలని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయమాడాడు. ఆమెను పెనవేసుకొని ఈ అటవీ ప్రాంతంలో శిలగా స్థిరపడ్డాడు. ఆ శిల వెలసిన ప్రాంతం ‘పెనుశిల కోన’ అయ్యింది. కాలక్రమేణా అదికాస్తా ‘పెంచలకోన’ గా అవతరించింది.శ్రీహరి చెంచులక్ష్మి ని వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి దేవి అమ్మవారు ఆగ్రహించి స్వామికి ఆల్లంత దూరంలో ఏటి అవతల గట్టు కు వెళ్లిపోయినట్లు కథనం. దాంతో అక్కడ కూడా అమ్మవారికి కూడా ఆలయాన్ని నిర్మించారు.ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి దగ్గరలో సంతానలక్ష్మి వటవృక్షం ఉంది. పిల్లలు లేని వారు ఈ చెట్టుకు చీరకొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఈ దివ్యక్షేత్రం నెల్లూరు నుండి 80 కిమీ దూరములో ఉంది. పెంచలకోన జలపాతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

Sri Kanaka Mahalakshmi Temple

శ్రీ కనకమహాలక్ష్మి (Sri Kanaka Mahalakshmi Temple) విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన మహిమాన్విత తల్లే శ్రీకనకమహాలక్ష్మి. ఉత్తరాంధ్ర వాసులకేగాక సకల తెలుగు జనావళికి సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా భాసిల్లుతోందామె. బంగారం కొన్నా వెండి కొన్నా తమ ఇంట...

Mopidevi Subramanya Swamy Temple

Mopidevi Subramanya Swamy Temple సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః. శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయే కుక్కుట ధ్వజం Mopidevi Temple is located 70 Kms...

Sri Grishneshwara Jyotirlingam

శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం (Sri Grishneshwara Jyotirlingam) ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఆఖరి జ్యోతిర్లింగం దీనిని ఘృష్ణేశ్వరుడు, ఘ్రుణేశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగం గురుంచి ఒక పురాణ...

Sri Jonnawada Kamakshi Taayi

జొన్నవాడ కామాక్షి తాయి (Sri Jonnawada Kamakshi Taayi) Sri Mallikarjuna Swamy Sametha Sri Jonnawada Kamakshi Taayi temple. Jonnawada is place located 12 kms away from Nellore. Temple is at bank of...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!