పళని క్షేత్రం (Palani Kshetram)
మధురై కు వాయువ్యం దిశగా 120 కీ.మీ దూరంలో పళని కలదు. ఇది దిండుగల్లు జిల్లా పరిధి లోనికి వస్తుంది. వైగైనది అనకట్టకు అల్లంత దూరన గల కొండ పైన మురుగన్ ఆలయం ఉంటుంది. ఇది ఆరు మురుగన్ క్షేత్రాలలో ఒకటి. స్వామిని దండాయుధ పాణి గా పిలుస్తారు. స్వామి చీర వంశీయ రాజు కు స్వప్నంలో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశించినాడు. పిమ్మట పాండ్య రాజులు, చోళ రాజులు మొదలగు వారు ఆలయ అభివృద్ధి కృషి చేసినారు. కొండ పైన గల ఆలయం నకు రాజగోపురం, పరమేళ మండపం, నవ రంగమండపం, గర్భాలయం మొదలగునవి ఉంటాయి.
స్వామికి నిత్యం పాలాభిషేకం, పంచామృతాభిషేకం, అర్చనలు మొదలగునవి జరుగుతాయి. భక్తులు పాల కావిడి స్వామికి సమర్పించుట ఆచారం. స్కంద షష్టి సంద్భముగా ఆరు రోజులు పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. కొండ క్రింద నుంచి కొండ పైకి చక్కటి మెట్లు మార్గంతో పాటు “రోప్ వే” సౌకర్యం కలదు. పళని విభూతి, పంచామృతం తయారీకి ప్రసిద్ది. కొండ మెట్లుకు దగ్గరలోనే బస్ స్టాండ్ ఉంది. మధురై, కొడైకెనాల్, తిరుచ్చి, దిండుగల్లు, కోయంబత్తూర్ మొదలగు ప్రాంతములు నుంచి బస్సులు ఉంటాయి. కొండ మెట్లుకు 2 కీ.మీ దూరంలో రైల్వే స్టేషన్ కలదు. మధురై, కోయంబత్తూర్, పాలఘాట్ (కేరళ) నుంచి పళని రైల్వే స్టేషన్ కు రైలు సర్వీసులు వయా పొల్లాచి జంక్షన్ మీదగా ఉంటాయి. రిక్షా/ఆటోలు దొరుకుతాయి
Leave a Comment