Home » Mukkoti Ekadashi » Ekadashi Vratam

Ekadashi Vratam

ముక్కోటి ఏకాదశి వ్రతం (Mukkoti Ekadashi Vratam) 

ఏకాదశీ వ్రతం” ఎలా చేయాలో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి.

ఏకాదశీ రోజున వేయి కనులతో వీక్షించి, సేవించి, తరి౦చాలని పండితులు చెబుతున్నారు. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.

ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రద ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.

ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాక ముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.

అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది.

SriHari Stotram

శ్రీహరి స్తోత్రం (SriHari Stotram) జగజ్జాలపాలం కన:కంఠమాలం, శరత్చంద్రఫాలం మహదైత్యకాలం, నభో నీలకాయం దురావారమాయం, సుపద్మాసహాయం భజేహం భజేహం || 1 || సదాంభోధి వాసం గళత్పుష్పహాసం, జగత్సన్నివాసం శతాదిత్యభాసం, గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం, హస:చారు వక్త్రం భజేహం భజేహం || 2 ||...

Sri Vishnu Sahasranama Stotram

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం (Sri Vishnu Sahasranama Stotram ) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం...

Sri Ashtamurti Stotram

శ్రీ అష్టమూర్తి స్తోత్రం (Sri Ashtamurti Stotram) ఈశా వాస్యమిదం సర్వం చక్షోః సూర్యో అజాయత ఇతి శ్రుతిరువాచాతో మహాదేవః పరావరః || 1 || అష్టమూర్తేరసౌ సూర్యౌ మూర్తిత్వం పరికల్పితః నేత్రత్రిలోచనస్యైకమసౌ సూర్యస్తదాశ్రితః || 2 || యస్య భాసా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!