మాతంగీ మహావిద్య (Matangi Mahavidya)
Matangi Jayanti is celebrated on Akshaya Tritiya day in Vaisakha Masam (Shukla Paksha Tritiya day) as per Telugu calendar.
దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.
మాతంగీ గాయిత్రి:
ఓం మాతంగ్యైచ విద్మహే ఉచ్ఛిష్ఠ ఛాండాళ్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
Leave a Comment