Home » Sri Shiva » Eshwara Dandakam

Eshwara Dandakam

ఈశ్వర దండకం (Eeshwara Dandakam)

శ్రీ కంఠ, లోకేశ, లోకోద్భవస్థాన, సంహారకారీ పురారి ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ
సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు ! భావించి బద్ధిం బ్రధానంబు కర్మంబు!
విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు ! సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ ! విచారించుచో నిన్ను
భావింతు రీశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా ! నిర్వికల్ప ప్రభావా ! భవానీ పతీ ! నీవు లోక త్రయీ వర్తనంబుల్
మహీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ
నిత్యంబు నత్యంత యెాగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల ! విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! జితక్రోధరోగాది దోషుల్ ! యతీంద్రుల్ ! యతాత్ముల్ ! భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా! భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా ! భార్గవాగస్థ్య కుత్సాది నానా ముని స్తోత్ర దత్తవధానా ! లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! భస్మానులిప్తాంగ ! గంగాధరా ! నీ ప్రసాదంబునన్ ! సర్వ గీర్వాణ గంధర్వులున్ ! సిద్ధసాధ్యోరగేంద్రామరేంద్రాదులున్ !
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !! సురాభ్యర్చితా !! నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !! త్రిలోకైకనాథా !
మహా దేవ దేవా !! నమస్తే నమస్తే నమస్తే నమః !!

“మహా భారత అరణ్య పర్వంలోనిది !!
అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ ‘దండకం’తో శివుని సంతోష పరిచాడు!!
(కవి త్రయంలో ఒకరైన నన్నయ భట్టు వ్రాసినది)

Sri Lopamudrambika Ashtottara Shatanamavali

श्री लोपामुद्राम्बिका अष्टोत्तर शतनामावली (Sri Lopamudrambika Ashtottara Shatanamavali) 1. ॐ श्री लोपमुद्रा मात्रे नम: 2. ॐ श्री अगस्त्येश्वरिये नम: 3. ॐ श्री ब्रह्मस्वरूपिण्ये नम: 4. ॐ श्री शक्तिमायायै नम: 5....

Kakada Harathi

కాకడ ఆరతి… ౧. జోడు నియాకర చరణి ఠేవిలా మాధా | పరిసావీ వినంతీ మాఝి పండరీనాధా || ||౧|| అసోనసో భావ ఆలో తూఝియా ఠాయా | కృపా దృష్టి పాహే మజకడే సద్గురురాయా || ||౨|| అఖండీత సావే...

Sri Bala Shanti Stotram

శ్రీ బాలా శాంతి స్తోత్రం (Sri Bala Shanti Stotram) శ్రీ భైరవ ఉవాచ జయ దేవి జగద్ధాత్రి జయ పాపౌఘహారిణి, జయ దుఃఖప్రశమని శాంతిర్భవ మమార్చనే  ll 1 ll శ్రీబాలే పరమేశాని జయ కల్పాంతకారిణి, జయ సర్వవిపత్తిఘ్నే శాంతిర్భవ...

Sri Tara Mahavidya

శ్రీ తారా  మహావిద్య (Sri Tara Mahavidya) Tara Jayanthi is celebrated in the Chaitra Masam Shukla Paksha navami (9th day ). Tara Swarna Tara Neela Saraswathi దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీ తారాదేవి. నీలవర్ణంతో...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!