Home » Mahavidya » Dhumavati Mahavidya

Dhumavati Mahavidya

ధూమావతి దేవి (Dhumavathi Devi)

Jesta Masam Powrnami Jayanthi shukla paksha ashtami day

ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది. ధూమావతి అమ్మవారు కేతు గ్రహ దోషాలు నివారిస్తారు.

ఈ అమ్మవారు జేష్ట మాస శుద్ధ అష్టమి నాడు ఆవిర్భవించారు. అమ్మవారి స్వరూపం ని మనం పరిశీలిస్తే విధవ రూపం లో జుట్టు విరబూస్కోని పుచ్చిన మరియు విరిగిన దంతాలతో ధూమ్ర బూడిద వర్ణం,  కాకి గుర్తు ఉన్న జండా ని ధరించి ఉంటుంది.

అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం

ఒకనాడు పార్వతీ అమ్మవారు శివునితో కలిసి ఉన్న సందర్భంలో పార్వతీ దేవి కి  ఆకలి వేస్తుందని ఆకలి నివారించాలని పరమశివుని అర్థించింది. ఎన్నిసార్లు అడిగినా పరమశివుడు వినిపించుకోలేదు అప్పుడు పార్వతీదేవి శరీరము దులుపుకోవడం వల్ల అమ్మవారి భస్మరాశి ఏర్పడినది. నీ సుందరమూర్తి దుమ్ముతో ఉందని అన్నాడు పరమశివుడు. ఈ భస్మా స్వరూపమే ధూమావతి.

దుర్గా సప్తశతి లో ఎవరైతే నన్ను జయిస్తారో అతడినే నా పతి అని అంటుంది .అప్పుడు ఎవరూ ముందుకు రాకపోవడం చేత అమ్మవారు కన్యగా మిగిలిపోయినది. నారద పంచరాత్రాన్ని బట్టి అమ్మవారు శరీరం నుండి ఉగ్రచండి ప్రకటించబడినది. అప్పుడు వందలాది నక్కలు అరిచినట్లుంది.

శివుణ్ణి మింగడానికి సిద్ధ పడడం వల్ల శివుడు అమ్మవారిని పత్నిగా స్వీకరించలేదు.

స్వాతంత్ర తంత్రంలో సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్ని పడి బూడిద కాగా అందులోని పోగ రాగా ఆ పొగయే ధూమావతి అయింది.

ధూమావతి ఉపాసన విపత్తులను పోగొట్టడం, రోగనివారణ, యుద్ధజయం, ఉచ్చాటన ప్రయోగం ఉపయోగపడుతుంది.ప్రపంచంలో రుద్రకోపం వల్ల జ్వరం,ఉన్మాదం, దాహం ఏర్పడతాయి.మూర్చ, వికలాంగత యముని కోపం వల్ల వస్తాయి . కీళ్ల నొప్పులు పక్షవాతం మొదలైనవి వరుణ దేవుడి వల్ల వస్తాయి.కలహం ఆకలి దప్పికలు వికృతి కోపం వల్ల వస్తాయి ధూమావతి లక్ష్మీదేవికి అక్క గా పేర్కొంటారు.

తంత్ర గ్రంథాల ప్రకారం ధూమావతి ఉగ్రతార. పొగవంటి ఆకారంలో ఉండటం లో దూమావతి అని పిలుస్తారు.

దుర్గా సప్తశతి బాభ్రవి, తామసి అని పిలువబడింది. ధూమావతి అమ్మవారు ఉపాసన చేసినట్లయితే సమస్త ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది. ఋగ్వేదంలోని రాత్రీ సూక్తం అమ్మవారి ని సుతరా పేర్కొంటున్నారు. అంటే సుఖంగా చరింప చేసేది అని అర్థం. ఆగమ శాస్త్రం లో భూతి అని పిలువబడుతున్నది అంటే ఐశ్వర్యం. అమ్మవారి అనుగ్రహం స్థితప్రజ్ఞతకు ధూమావతి ప్రతీక.

అమ్మవారి వాహనం కాకి. కాకి వాహనం తో కూడిన మనస్సు సూచిస్తున్నది. అది నిరంతరము, అసంతృప్తి లో ఉంటుంది. అది ఆకలి, కలహం,దారిద్రత కు గుర్తు.

Source https://www.facebook.com/thalapathranidhi/photos/a.335882006598247.1073741828.335025213350593/810995815753528/?type=3

ధూమవతీ గాయిత్రి:

ఓం ధూమవత్యైచ విద్మహే సంహారిణ్యైచ ధీమహి తన్నో ధూమ ప్రచోదయాత్ ||

Sri Dattatreya Vajra Kavacha Stotram

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం (Sri Dattatreya Vajra Kavacham) అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్, ఓం ఆత్మనే నమః,ఓం ద్రీం మనసే...

Sri Narayani Stuthi

నారాయణి స్తుతి (Narayani Stuthi) సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే | స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోzస్తు తే || ౧ || కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని | విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోzస్తు తే || ౨ || సర్వమంగళమాంగళ్యే...

Dasa Mahavidya Sthuthi

దశమహావిద్యా స్తుతి (Dasa Mahavidya Sthuthi ) మహా విద్యా మహా కాళి ప్రియ సఖి | గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1|| ముండ మాలా విభూషితే నీల రూపిణీ | ఏకాజాత నీల సరస్వతి నమః...

Pradosha Stotra Ashtakam

ప్రదోష స్తోత్రాష్టకం (Pradosha Stotra Ashtakam) సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవ్రీమి సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి | సంసారముల్బణమసారమవాప్య జంతోః సారోzయమీశ్వరపదాంబురుహస్య సేవా || 1 || యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!