Home » Dandakam » Bhaskara Dandakam

Bhaskara Dandakam

భాస్కర దండకమ్ (Bhaskara Dandakam)

Surya bhagavanఓం శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి

యాత్మరక్షామణీ త్వం నమోపాపశిక్షా, నమో విశ్వభర్తా నమో విశ్వకర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథా మహాభూత భేదంబులున్నీవయై, బ్రోతువెల్లప్పుడన్ భాస్కరా!

పద్మినీ వల్లభా, గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా, మహా దివ్యగాత్రా, అచింత్యావతారా, నిరాకార, ధీరా పరాకయ్య మోయయ్య తాపత్రయా భీలదావాగ్ని రుద్రాతనూద్భూత మింపార గంభీర సంభావితానేక కామాద్యనేకంబులుందాక నేకాకినై చిక్కి, యేదిక్కున నుంగానగాలేక యున్నాడ, నీవాడనో తండ్రి జేగీయమానా కటాక్షంబులన్ నన్ను గృపాదృష్టి వీక్షించి వేగన్ మునీంద్రాది వంద్యాజగన్నేత్రమూర్తీ ప్రచండ స్వరూపుండవైయొంటి సారధ్యమున్ గుంటి యశ్వంబులేడింటినిన్నొంటి చక్రంబుదాల్చి మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారంబుగా దోషజాలంబులన్ ద్రుంచి కీర్తిన్ అప్రతాపంబులన్ మించి, నీ దాసులంగాచి యిష్టార్దముల్ గూర్తువో

దృష్టివేల్పా! మహాపాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబైనా భారంబుగానీక శూరోత్తమా మోప్పులుంతప్పులుంనేరముల్ మాని సహస్రంశువైనట్టి నీ కీర్తి కీర్తింపనేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వాన్ జూపినాయాత్మ భేడంబులన్ బాపి పోషింప నీవంతునిన్ శేషబహాషాధిపుల్ పొగడగాలేరు నీ దివ్యరూప ప్రభావంబు గానంగ నేనెంత మొల్లప్పుడన్ స్వల్ప జీవుండనౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ పాదపద్మంబులేసాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతతన్ చేయవే కామితార్ధ ప్రదాయీ మహిన్ నిన్ను గీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగుబంగారు తంగేడు జున్నయి ఫలించున్ భాస్కరా ద్యుతే సమస్తే నమస్తే నమః

Sri Shanmukha Dandakam

శ్రీ షణ్ముఖ దండకం (Sri Shanmukha Dandakam) ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్...

Kalidasa Prokta Shyamala Dandakam

శ్రీ కాళిదాస ప్రోక్త శ్యామలా దండకం ( Kalidasa Prokta Shyamala Dandakam) మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ | మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || 1 || చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ||...

Sri Garuda Dandakam

శ్రీ గరుడదండకం (Sri Garuda Dandakam) నమః పన్నగనద్ధాయ వైకుణ్ఠవశవర్తినే । శ్రుతిసిన్ధు సుధోత్పాదమన్దరాయ గరుత్మతే ॥ 1॥ Namah pannaganadhaaya Vaikuntavasavarthiney, Shruti Sindhu sudhothpadha mandharaya guruthmathe || గరుడమఖిలవేద నీడాధిరూఢమ్ ద్విషత్పీడనోత్కణ్ఠి తాకుణ్ఠవైకుణ్ఠపీఠీకృతస్కన్ధమీడే స్వనీడాగతిప్రీతరుద్రాసుకీర్తిస్తనాభోగగాఢోపగూఢ స్ఫురత్కణ్టకవ్రాతవేధవ్యథావేపమాన ద్విజిహ్వాధిపాకల్పవిష్ఫార్యమాణ...

Sri Vinayaka Dandakam

శ్రీ వినాయక దండకం (Sri Vinayaka Dandakam) శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ   బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!