Home » Sri Shiva » Sri Krishna Kruta Shiva Stuthi

Sri Krishna Kruta Shiva Stuthi

శ్రీ కృష్ణ కృత శివ స్తుతి  (Sri Krishna Kruta Shiva Stuti)

త్వమేవ సత్త్వం చ రజస్తమశ్చ త్వమేవ సర్వం ప్రవదంతి సంతః |
తతస్త్వమేవాసి జగద్విధాయకః త్వమేవ సత్యం ప్రవదంతి వేదాః ||

సత్త్వరజస్తమాలనే గుణాలు నీవే. సర్వం నీవేనని సత్పురుషులు చెబుతుంటారు. కనుక నీవే జగద్విధానాన్ని నడపువాడవు. నువ్వు సత్యానివని వేదములు పలుకుతున్నాయి.

త్వ బ్రహ్మా హరిరథ విశ్వయోనిః అగ్నిస్సంహర్తా దినకర మండలాధివాసః |
ప్రాణస్త్వం హుతవహ వాసవాది భేదః త్వామేకం శరణముపైమి దేవమీశం ||

విశ్వానికి కారణమైన నువ్వే బ్రహ్మవు, హరివి, సంహారకుడైన (కాలరూప) అగ్నివి. సూర్యమండలంలో ఉన్నవాడవు. ప్రాణానివి. అగ్ని ఇంద్రాది భేదములతో నున్న ఏక రూపుడైన, స్వయం ప్రకాశుడవైన, ఈశ్వరుడవైన నిన్ను శరణువేడుతున్నాను.

సాంఖ్యా స్త్వామగుణ మధాహురేక రూపం యోగస్త్వాం సతతముపాసతే హృదస్థం  |
దేవాస్త్వామభిదధతేహ రుద్రమగ్నిం త్వామేకం శరణముపైమి దేవమశం ||

సాంఖ్యులు (బ్రహ్మజ్ఞానులు) నిన్ను నిర్గుణుడివైన ఏకతత్త్వముగా చెబుతున్నారు. యోగులు హృదయంలో నిన్ను ఎల్లవేళలా ఉపాసిస్తున్నారు. అగ్ని రూపుడవైన రుద్రునిగా దేవతలు నిన్ను సంపూర్ణంగా గ్రహిస్తున్నారు.

Sri Shiva Raksha Stotram

శ్రీ శివ రక్షా స్తోత్రం (Sri Shiva Raksha Stotram) అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః || చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్...

Hanumat Langoolastra Stotram

హనుమత్ లాంగూలాస్త్ర స్తోత్రం (Hanumat Langoolastra Stotram) హనుమన్నంజనీ సూనో మహాబల పరాక్రమ | లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ || 1 || మర్కటాధిప మార్తాండ మండల గ్రాస కారక| లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ|| 2 || అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర | లోలల్లాంగూల...

Dakaradi Sri Durga Sahasranama Stotram

దకారాది శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం (Dakaradi Sri Durga Sahasranama Stotram) శ్రీ దేవ్యువాచ । మమ నామ సహస్రం చ శివ పూర్వవినిర్మితమ్ । తత్పఠ్యతాం విధానేన తథా సర్వం భవిష్యతి ॥ ఇత్యుక్త్వా పార్వతీ దేవి...

Sri Narayana Stotram

శ్రీ నారాయణ స్తోత్రం (Sri Narayana Stotram) నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!