Home » Sri Shiva » Eshwara Dandakam

Eshwara Dandakam

ఈశ్వర దండకం (Eeshwara Dandakam)

శ్రీ కంఠ, లోకేశ, లోకోద్భవస్థాన, సంహారకారీ పురారి ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ
సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు ! భావించి బద్ధిం బ్రధానంబు కర్మంబు!
విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు ! సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ ! విచారించుచో నిన్ను
భావింతు రీశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా ! నిర్వికల్ప ప్రభావా ! భవానీ పతీ ! నీవు లోక త్రయీ వర్తనంబుల్
మహీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ
నిత్యంబు నత్యంత యెాగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల ! విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! జితక్రోధరోగాది దోషుల్ ! యతీంద్రుల్ ! యతాత్ముల్ ! భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా! భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా ! భార్గవాగస్థ్య కుత్సాది నానా ముని స్తోత్ర దత్తవధానా ! లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! భస్మానులిప్తాంగ ! గంగాధరా ! నీ ప్రసాదంబునన్ ! సర్వ గీర్వాణ గంధర్వులున్ ! సిద్ధసాధ్యోరగేంద్రామరేంద్రాదులున్ !
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !! సురాభ్యర్చితా !! నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !! త్రిలోకైకనాథా !
మహా దేవ దేవా !! నమస్తే నమస్తే నమస్తే నమః !!

“మహా భారత అరణ్య పర్వంలోనిది !!
అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ ‘దండకం’తో శివుని సంతోష పరిచాడు!!
(కవి త్రయంలో ఒకరైన నన్నయ భట్టు వ్రాసినది)

Sri Shiva Prokta Dussehra Ganga Stotram

శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం (Sri Shiva proktha dussehra ganga stotram ) ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః | నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే || నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే...

Sri Dakshina Devi Stotram

శ్రీ దక్షిణా దేవి స్తోత్రం (Sri Dakshina Devi Stotram) కర్మిణాం కర్మణాం దేవీ త్వమేవ ఫలదా సదా త్వయా వినా చ సర్వేషాం సర్వం కర్మ చ నిష్ఫలం || త్వయా వినా తథా కర్మ కర్మిణాం చ న...

Sri Maha Ganapathy Sahasranama Stotram

శ్రీ మహా గణపతి సహస్రనామ స్తోత్రం (Sri Maha Ganapathy Sahasranama Stotram) మునిరువాచ:- కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ । శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ॥ 1 ॥ బ్రహ్మోవాచ దేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే ।...

108 Shiva Lingas

మహిమాన్విత 108 లింగాలు (108 Shiva Lingas) 1. ఓం లింగాయ నమః 2. ఓం శివ లింగాయ నమః 3. ఓం శంబు లింగాయ నమః 4. ఓం ఆధిగణార్చిత లింగాయ నమః 5. ఓం అక్షయ లింగాయ నమః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!