Home » Stotras » Shri Chitta Stheeryakam Stotram

Shri Chitta Stheeryakam Stotram

చిత్త స్థిర స్త్రోత్రo (Shri ChittaStheeryakam Stotram)

అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే |
సర్వదేవాధి దేవత్వం మమ చితం స్థిరీకురు || 1 ||

భావము: అత్రి అనసూయల దీపకుడిగా ఉద్భవించిన వాడు సర్వ దేవతలలో నిండిన దైవత్వంను, బుద్దిమంతుడు అయిన శ్రీ దత్తాత్రేయస్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు

శరణాగత దీనార్త తరకాఖిల కారక |
సర్వ చాలక దేవత్వం మమ చిత్తం స్టిరీకురు || 2 ||

భావము : శరణాగతి చెందిన వారికీ,దీనులకు జ్ఞానం ప్రసాదించే వాడు,అందరినీ స్వయం సమృద్ధిగా ఉద్ధరించే వాడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

సర్వ మంగళ మాంగల్య సర్వాధి వ్యాధి భేషజ |
సర్వసంకట హరీన్ త్వం మమ చితం స్థిరీకురు || 3 ||

భావము : అన్ని శుభములకుమంగళ కారివై అన్ని వ్యాధులకు ఔషధం నీవై,అన్ని కష్టములను తొలగించు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

స్మర్తృగామి స్వ భక్తానాం కామదో రిపు నాశనః |
భుక్తి ముక్తి ప్రద: సత్వం మమ చితం స్థిరీకురు || 4 ||

భావము తన భక్తులు పిలవగానే ప్రత్యక్షమై కామ,క్రోధ,లోభ,మోహం లనే శత్రువులను నాశనం చేసి ఇహ,పర శ్రేయస్సులను సత్వరం మే తీర్చే శ్రీ దత్తాత్రేయ స్వామి..నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

సర్వ పాప క్షయ కర స్తాపదైన్య :నివారణం |
యో భీష్టదః :ప్రభు :సత్వం మమ చితం స్థిరీకురు || 5 ||

భావము అన్ని పాపములు నశింప జేసి,అధ్యామిక,అది బౌతిక,దైవిక తాపాలు నివారించి త్వరగా అభీష్టములు ప్రసాదించు శ్రీ దత్తాత్రేయ స్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

య ఏత త్ర్ప్ యతః శ్లోక పంచకం ప్రపటేత్సుదీ:
స్థిర చిత్త స్స భగవాన్ కృపా పాత్రం భవిష్యతి. || 6 ||

భావము శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఈ పంచకం శ్లోకాలు ఎవరు భక్తితో పఠిస్తారో వారికి భగవాన్ శ్రీ దత్తాత్రేయ అనుగ్రహంతో పాటు స్థిర మైన చిత్తము స్వామి వారిపై కలుగుతుంది.శ్రీ దత్తాత్రేయ స్వామికి అంకితం.

ఈ ఐదు శ్లోకాలు నిత్యము పఠిస్తే దత్తాత్రేయుల వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

Shiva Suvarnamala Stuti

శివ సువర్ణమాలా స్తుతి (Shiva Suvarnamala Stuti) అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం || అఖండమదఖండన పండిత తండు ప్రియ చండీశ విభో సాంబ సదాశివ శంభో శంకర...

Sri Siva Sahasranama Stotram

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ (Sri Siva Sahasranama Stotram) ఓం నమః శివాయ స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః | సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || 1 || జటీ చర్మీ శిఖండీ చ...

Sri Durga Dwadasa nama Stotram

శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం (Sri Durga Dwadasa nama Stotram) ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం నవమం అరుణనేత్రాంశ్చ దశమం...

Sri Lakshmi Sahasranama Stotram

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం (Sri Lakshmi Sahasranama Stotram) నామ్నాం సాష్ట సహస్రం చ బ్రూహి గార్య మహామతే | మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తిముక్త్యర్థసిద్ధయే || ౧ || శ్రీ గార్గ్య ఉవాచ- సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్యసన్నిభం | అపృచ్ఛన్యోగినో భక్త్యా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!