Home » Stotras » Sri Vinayaka Stotram
vinayaka stotram

Sri Vinayaka Stotram

శ్రీ వినాయక స్తోత్రం (Sri Vinayaka Stotram)

తొండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయగజ్జెలను మెల్లని చూపులు మంద హాసమున్ కొండొక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడు పార్వతి తనయయోయి గణాదిపా నీకు మ్రోక్కెన్ || 1 ||

తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్ధన చేసేద నేకదంత నా వలపటి చేతి ఘంటమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక || 2 ||

తలచెదనే గణనాధుని తలచెదనే విఘ్న పతిని దలచిన పనిగా ధలచనే హీరంభుని దలచెద నా విఘ్నములను తొలగుట కోరుకున్ || 3 ||

అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానబ్రాలు చెరుకురసంభున్ విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్దింతు మదిన్ || 4||

అంకముజేరి శైలతనయా స్తన దుగ్ధము లానువేళ బా ల్యాంకవిచేష్ట తుండమున యవ్వలిచ న్గబలింపబోయి యావంక కుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా లాంకుర శంకనంటెడు గాజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్ || 5 ||

ఈశునంతవాని ఎదురించి పోరాడి మడిసివాని చేత మరళాబ్రతికి
సర్వవంద్యు డైన సామజాతమూర్తి – కంజలింతు విఘ్న భంజనునకు

Kali Santaraka Stotram

కలి సంతారక స్తోత్రం (Kali Santaraka Stotram) శేషాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా! కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!! కశ్యప ఉవాచ: కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా!...

Sri Navagraha Sooktam

శ్రీ నవగ్రహ సూక్తం (Sri Navagraha Sooktam) ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్| ప్రసన్నవదనమ్ ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే || ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యమ్ ఓం...

Sri Rajarajeshwari Mathruka Stavah

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకా స్తవః (Sri Rajarajeshwari Mathruka Stavah) కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాంప్రా​ణేశ్వరానందినీం పూర్ణం పూర్ణతరాంపరేశమహిషీంపూర్​ణామృతాస్వాదీనీం సంపూర్ణాంపరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం || ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం...

Sri Karthaveeryarjuna Dwadasa Nama Stotram

శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం (Sri Karthaveeryarjuna Dwadasa Nama Stotram) కార్తవీర్యార్జునోనామ రాజ బాహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || 1 || కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!