Home » Remedies » 28 names of Lord Subrahmanya

28 names of Lord Subrahmanya

సుబ్రమణ్య స్వామి 28 నామములు (28 names of Lord Subrahmanya)

స్కంద ఉవాచ

1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి.

2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి.

3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.

4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.

5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు.

6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికేచెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.

7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.

8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.

9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.

10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.

11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.

12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు.

13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.

14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.

15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.

16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.

17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.

18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు.

19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.

20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.

21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగావచ్చారు. ఈ విషయమే, శ్రీవిద్యా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.

22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.

23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.

24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.

25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూఉన్నవాడు, పుట్టుక లేనివాడు.

26.ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.

27.సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.

28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.

*
ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.

” సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు “

Sri Skandamatha Dwadasa Nama Stotram

శ్రీ స్కంద మాతా ద్వాదశ నామ స్తోత్రం (Sri Skandamatha Dwadasa Nama Stotram) ప్రధమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం తృతీయం ధవళవర్ణాంశ్చ, చతుర్ధం సింహావాహినీం పంచమం అభయముద్రాంశ్చ , షష్టం మోక్షదాయినీం సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచయనీం...

Sri Shanmukha Dandakam

శ్రీ షణ్ముఖ దండకం (Sri Shanmukha Dandakam) ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్థూల సూక్ష్మ ప్రదర్శకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేదుర్ధరాయం, భజేహం పవిత్రం, భజే శివతేజం, భజే స్థాపకాయం, భజే ప్రసన్నరూపం, భజే దయామయివటంచున్ ప్రభాతంబు, సాయంత్రం మున్నీదు దివ్యనామ సంకీర్తనల్...

Sri Subrahmanya Swamy Ashtothram

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి (Sri Subramanya Swamy Ashtothram) ఓం స్కందాయ నమః ఓం గుహాయ నమః ఓం షణ్ముఖాయ నమః ఓం ఫాలనేత్ర సుతుయ నమః ఓం ప్రభవే నమః ఓం పింగళాయ నమః ఓం కృత్తికాసూనవే...

Skandothpathi

స్కందోత్పత్తి(సుబ్రహ్మణ్య) (Skandothpathi) తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా | సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్ || 1 || తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్ | ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః|| 2 || యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!