శ్రీ రామ వైభవ అష్టరత్నమాలికా స్తోత్రం (Sri Rama Vaibhava Ashtaratna Malika Stotram)
సీతామనోహరభరతలక్ష్మణాగ్రజం
శతృఘ్నప్రియవాతాత్మజవందితం
ఘోరపాపహరణకరుణారససాగరం
రావణాదిభంజన రామచంద్రం భజే || 1 ||
కాలకాలవందితవిధిసురేంద్రవంద్యం
శివధనుర్భంజనప్రచండశౌర్యం
సప్తతాలభంజనసుగ్రీవరక్షకం
అయోధ్యపాలక రామచంద్రం భజే || 2 ||
కౌశికమఖసంరక్షకవీరాధివీరం
పితృవాక్యపాలకఘోరవిపినవాసం
జన్మజన్మాంతరపాశవిమోచకం
తాటకసంహర రామచంద్రం భజే || 3 ||
పూర్వభాషణప్రియస్మితమందహాసం
రామదాసత్యాగరాజరచనావైభవం
జామదగ్న్యమదదర్పగర్వభంజనం
బ్రహ్మవిద్యానిధిం రామచంద్రం భజే || 4 ||
శరభంగనారదాదిమునివందితపదం
శశాంకరవివహ్నికోటిప్రభాభాసురం
శాశ్వతైశ్వర్యప్రదతారకమంత్రం
వీరాసనసంస్థిత రామచంద్రం భజే || 5 ||
ధర్మనిష్ఠాపరభవ్యనిశ్చయాత్మకం
రాజ్యకాంక్షారహితనిర్మలమానసం
జటాయుమోక్షప్రదభవ్యరాజఋషిం
నీలమేఘశ్యామ రామచంద్రం భజే || 6 ||
దుర్మదాంధవాలిహరసుగ్రీవరాజ్యదం
దుర్నిరీక్ష్యప్రతాపచండప్రచండం
దోర్దండకోదండధరభక్తరక్షకం
భద్రాచలవాస రామచంద్రం భజే || 7 ||
నాదబిందుకళాతీతనాదపరబ్రహ్మం
నమ్రవినయశీలగురువాక్యపాలకం
నదీసరయూవిహారసీతాసమేతం
మోహహరకుఠారం రామచంద్రం భజే ||8 ||
సర్వం శ్రీరామ చంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు