శ్రీ కాళీ స్తోత్రం (Sri Kali Stotram)
నమస్తే నీలశైలస్థే ! యోని పీఠనివాసిని ! భద్రకాళి ! మహాకాళి ! కామాఖ్యే ! కామసుందరి ! ఇహావతరకళ్యాణి ! కామరూపిణి! కామిని ! కామేశ్వరి ! మహామాయే! ప్రాగ్జ్యోతిషపురేశ్వరి ! భగలింగే ! భగాకారే ! భగమాలే ! భగేశ్వరి ! భగదాయిని ! భవ్యాంగి! భద్రకాళి! నమోస్తుతే. ఆనందభైరవస్వామి ప్రాణేశ్వరి ! రతిప్రియే ! రసికే ! రసికారాధ్యే ! వీరే! వీరపథాశ్రితే కామే ! కామకళారూపే! కదంబవనవాసిని ! కామాక్షి ! కామసౌందర్యే ! కరుణావరుణాలయే నీలోత్పలదళశ్యామే ! నీలాచలనివాసిని ! ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి ప్రదాయిని ! మహేశ్వరి ! యోనికుండ మహాజ్వాలే ! యోనియంత్ర విలాసిని ! హోమప్రియే ! మహాదేవి ! తారామంత్ర ప్రకాశిని ! దర్శనం దేహికామేశి ! స్పర్శనం దేహి కామిని ! అభీష్టం దేహి కామాఖ్యే ! తారాకాళి ! నమో నమః