Home » Stotras » Sri Mangala Gowri Vrata Vidhanam

Sri Mangala Gowri Vrata Vidhanam

మంగళగౌరీ వ్రత విధానం (Mangala Gowri Vrata Vidhanam)

ఆచమనం

  • ఓం కేశవాయ స్వాహా,
  • ఓం నారాయణాయ స్వాహా,
  • ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

  • ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః
శ్రీధరాయ నమః ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.

ఓం లక్ష్మినారాయణభ్యయం నమః
శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః
శ్రీ శచిపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః
శ్రీ సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః , మాతృభ్యో నమః, పితృభ్యో నమః

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే, వర్ష ఋతవే, శ్రావణ మాసే, శుక్ల పక్షే , శుభ తిథౌ, భౌమ్య(మంగళ)వాసరే, శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ మాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సత్సంతాన సౌభాగ్య ఫలసిద్ధ్యర్థం సంపత్సౌభాగ్యసహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, సర్వమంగళాగౌరీ దేవతా ముద్దిశ్య మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం మమ వివాహప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం మంగళగౌరీ వ్రత మహం కరిష్యే అదౌనిర్విగ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

శ్లో: కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో: గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన, తమపైన జల్లుకొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గయే తథా
సఙ్గ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః ||: ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాదిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయనమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః, మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూప మాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.

శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా
సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

తోర పూజ :

తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం

శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :
మాతః సర్వ జగన్నాధే యావత్పూజావసానకం |
తావత్త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు ||
అవాహితాభవ స్థాపితా భవ సుప్రసన్నభవ వరదాభవ మమ ఇష్టకామ్యార్థ సిద్దిదా భవ

అత్రాగచ్చ మహాదేవి సర్వలోక సుఖప్రదే |
యావద్ర్వత మహంకుర్వే పుత్త్ర పౌత్రాభి వృద్ధయే ||
సర్వమంగళాయై నమః ఆవాహయామి

బాలాంనవోఢాం సంపూజ్యాం మంగళద్రవ్య వాసినీం |
సర్వాలంకార సంపూర్ణాం భావయే త్సర్వమంగళాం ||
మంగళగౌర్యై నమః ధ్యానం సమర్పయామి

రౌప్యేణ చాసనం దివ్య రత్న మాణిక్య శోభితం |
మయానీతం గ్ర్హాణ త్వం గౌరి కామారి వల్లభే ||
ఆసనం సమర్పయామి

గంధపుష్పాక్షతైర్యుక్తం పాద్యం సంపాదితం మయా |
త్వంగృహాణ దయాసింధో గౌరి మంగళ దేవతే ||
పాదయః పాద్యం సమర్పయామి

సర్వలోక ప్రియేదేవి శంకరప్రియభామిని |
గృహాణార్ఘ్యం మయాదత్తం సౌభాగ్యం దేహి సర్వదా ||
అర్ఘ్యం సమర్పయామి

కామారి వల్లభేదేవి కుర్వాచమనమంబికే |
నిరంతర మహం వందే చరణౌ తవపార్వతి ||
ఆచమనీయం సమర్పయామి

పయోదధిఘృతం చైవ మధుశర్కరయా సమం |
పంచామృతేన స్నపనం కారయే త్వాం శివప్రియే ||
పంచామృతైః స్నపయామిగంగాజలం సమానీతం శుభం కర్పూర సంయుతం |
స్నాపయామి సురశ్రేష్ఠే త్వాం పుత్త్రాది ఫలప్రదాం ||
శుద్ధోదక స్నానం సమర్పయామి

వస్త్రంచ సోమ దైవత్యం లజ్జాయాస్తు నివారణం |
మయా సమర్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి ||
వస్త్రయుగ్మం సమర్పయామి

కుంకుమాగరు కర్పూర కస్తూరీ చందనాదికం |
విలేపనం మహాదేవి గంధం స్వీకురు శాంకరి ||
గంధం ధారయామి

రంజితాం కుంకుమౌఘేన హరిద్రాక్తా స్తథాక్షతాః |
తవతలంకరణార్థాయ ప్రదత్తా స్సర్వ మంగళే ||
అక్షతాన్ సమర్పయామి

హరిద్రాం కుంకుమంచైవ సింధూరం కజ్జలాన్వితం |
నీలలోహిత తాటంకే మంగళద్రవ్య మీశ్వరి ||
హరిద్రాకుంకుమాది సౌభాగ్య ద్రవ్యాణి సమర్పయామి

చంపకాకుంద మందార పున్నాగ బృహతీయుతైః |
పుష్పైర్బిల్వదళోపేతైః పూజయామి సివప్రియే ||

అథాంగ పూజ:
ఉమాయై నమః పాదౌ పూజయామి
గౌర్యై నమః జంఘే పూజయామి
పార్వత్యై నమః జానునీ పూజయామి
జగన్మాత్రే నమః ఊరూ పూజయామి
జగత్ర్పతిష్ఠాయై నమః కటిం పూజయామి
మూల ప్రకృతయే నమః నాభిం పూజయామి
అంబికాయై నమః ఉదరం పూజయామి
అన్నపూర్ణాయై నమః స్తనౌ పూజయామి
శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి
మహాబలాయై నమః బాహూన్ పూజయామి
వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
బ్రహ్మవిద్యాయై నమః జిహ్వాం పూజయామి
శాంకర్యై నమః ముఖం పూజయామి
శివాయై నమః నేత్రౌ పూజయామి
రుద్రాయై నమః కర్ణౌ పూజయామి
సర్వ మంగళాయై నమః లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి
మంగళగౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ గౌరిఅష్టోత్తర శతనామావళి: (ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)

    1. ఓం గౌర్యై నమః
    2. ఓం గణేశజనన్యై నమః
    3. ఓం గుహాంబికాయై నమః
    4. ఓం జగన్నేత్రే నమః
    5. ఓం గిరితనూభవాయై నమః
    6. ఓం వీరభధ్రప్రసవే నమః
    7. ఓం విశ్వవ్యాపిణ్యై నమః
    8. ఓం విశ్వరూపిణ్యై నమః
    9. ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
    10. ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః 10
    11. ఓం శివాయై నమః
    12. ఓం శాంభవ్యై నమః
    13. ఓం శాంకర్యై నమః
    14. ఓం బాలాయై నమః
    15. ఓం భవాన్యై నమః
    16. ఓం హెమవత్యై నమః
    17. ఓం పార్వత్యై నమః
    18. ఓం కాత్యాయన్యై నమః
    19. ఓం మాంగల్యధాయిన్యై నమః
    20. ఓం సర్వమంగళాయై నమః 20
    21. ఓం మంజుభాషిణ్యై నమః
    22. ఓం మహేశ్వర్యై నమః
    23. ఓం మహామాయాయై నమః
    24. ఓం మంత్రారాధ్యాయై నమః
    25. ఓం మహాబలాయై నమః
    26. ఓం సత్యై నమః
    27. ఓం సర్వమయై నమః
    28. ఓం సౌభాగ్యదాయై నమః
    29. ఓం కామకలనాయై నమః
    30. ఓం కాంక్షితార్ధప్రదాయై నమః 30
    31. ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః
    32. ఓం చిదంబరశరీరిణ్యై నమః
    33. ఓం శ్రీ చక్రవాసిన్యై నమః
    34. ఓం దేవ్యై నమః
    35. ఓం కామేశ్వరపత్న్యై నమః
    36. ఓం పాపనాశిన్యై నమః
    37. ఓం నరాయణాంశజాయై నమః
    38. ఓం నిత్యాయై నమః
    39. ఓం నిర్మలాయై నమః
    40. ఓం అంబికాయై నమః 40
    41. ఓం హిమాద్రిజాయై నమః
    42. ఓం వేదాంతలక్షణాయై నమః
    43. ఓం కర్మబ్రహ్మామయై నమః
    44. ఓం గంగాధరకుటుంబిన్యై నమః
    45. ఓం మృడాయై నమః
    46. ఓం మునిసంసేవ్యాయై నమః
    47. ఓం మాలిన్యై నమః
    48. ఓం మేనకాత్మజాయై నమః
    49. ఓం కుమార్యై నమః
    50. ఓం కన్యకాయై నమః 50
    51. ఓం దుర్గాయై నమః
    52. ఓం కలిదోషవిఘ్నాతిన్యై నమః
    53. ఓం కమలాయై నమః
    54. ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
    55. ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
    56. ఓం పుణ్యాయై నమః
    57. ఓం కృపాపూర్ణాయై నమః
    58. ఓం కల్యాణ్యై నమః
    59. ఓం కమలాయై నమః
    60. ఓం అచింత్యాయై నమః 60
    61. ఓం త్రిపురాయై నమః
    62. ఓం త్రిగుణాంబికాయై నమః
    63. ఓం పురుషార్ధప్రదాయై నమః
    64. ఓం సత్యధర్మరతాయై నమః
    65. ఓం సర్వరక్షిణ్యై నమః
    66. ఓం శశాంకరూపిణ్యై నమః
    67. ఓం సరస్వత్యై నమః
    68. ఓం విరజాయై నమః
    69. ఓం స్వాహాయ్యై నమః
    70. ఓం స్వధాయై నమః 70
    71. ఓం ప్రత్యంగిరాంబికాయైనమః
    72. ఓం ఆర్యాయై నమః
    73. ఓం దాక్షాయిణ్యై నమః
    74. ఓం దీక్షాయై నమః
    75. ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః
    76. ఓం శివాభినామధేయాయై నమః
    77. ఓం శ్రీవిద్యాయై నమః
    78. ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
    79. ఓం హ్రీంకార్త్యె నమః
    80. ఓం నాదరూపాయై నమః 80
    81. ఓం సుందర్యై నమః
    82. ఓం షోడాశాక్షరదీపికాయై నమః
    83. ఓం మహాగౌర్యై నమః
    84. ఓం శ్యామలాయై నమః
    85. ఓం చండ్యై నమః
    86. ఓం భగమాళిన్యై నమః
    87. ఓం భగళాయై నమః
    88. ఓం మాతృకాయై నమః
    89. ఓం శూలిన్యై నమః
    90. ఓం అమలాయై నమః 90
    91. ఓం అన్నపూర్ణాయై నమః
    92. ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
    93. ఓం అంబాయై నమః
    94. ఓం భానుకోటిసముద్యతాయై నమః
    95. ఓం వరాయై నమః
    96. ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
    97. ఓం సర్వకాలసుమంగళ్యై నమః
    98. ఓం సోమశేఖర్యై నమః
    99. ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః
    100. ఓం బాలారాధిత భూతిదాయై నమః 100
    101. ఓం హిరణ్యాయై నమః
    102. ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
    103. ఓం సర్వభోగప్రదాయై నమః
    104. ఓం మార్కండేయవర ప్రదాయై నమః
    105. ఓం అమరసంసేవ్యాయై నమః
    106. ఓం అమరైశ్వర్యై నమః
    107. ఓం సూక్ష్మాయై నమః
    108. ఓం భద్రదాయిన్యై నమః 108

ఇతి శ్రీ గౌరీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

సర్వమంగళా మంగళ గౌర్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పైః పూజయామి

దేవదారు రసోద్భూతః కృష్ణాగరు సమన్వితః |
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ||
ధూపమాఘ్రాపయామి

త్వంజ్యోతి స్సర్వదేవానాం తేజసాం తేజ ఉత్తమం |
జ్యోతిర్మండలగే దేవి దీపం స్వీకురు శాంకరి ||
దీపం దర్శయామి

అన్నం చతుర్విధంస్వాదుర సైష్షడ్భి స్స్మన్వితం |
గృహాణ భక్ష్య భోజ్యాఢ్యం సుమృష్ణం సర్వమంగళే ||
నైవేద్యం సమర్పయామి

వూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళాన్వితం |
కర్పూరైలా సుధాయుక్తం తాంబూలం శివసుందరి ||
తాంబూలం స్మర్పయామి

సౌవర్ణీ దక్షిణా ప్రోక్తా పూజా సాఫల్య కారణం |
దక్షిణాం ప్రతిహృహ్ణీష్వ దక్షిణే సర్వమంగళే ||
దక్షిణాం సమర్పయామివాణీ లక్ష్మీ శచీ మౌళీ నీరాజిత పదాం బుజే |
శివే నీరాజయామి త్వాం నిత్య లోక ప్రకాశికాం ||
కర్పూర నీరాజనం దర్శయామి

శివాంక వాసినీ మంబాం సర్వే దేవా మహర్షయః |
ప్రదక్షిణేన పశ్యంతి తేన కుర్యాం ప్రదక్షిణం ||
ఇం నమశ్శివకాంతాయై హ్రీం నమశ్శివశక్తయే |
శ్రీంనమో జగతాం మాత్రే మమ భూయాన్మనోరథః ||
ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

పుత్రాం దేహి ధనం దేహి సౌభాగ్యం సర్వమంగళే |
సౌమంగల్యం సుఖం జ్ఞానం దేహిమే శివసుందరి ||
ఛత్ర చామరాందోలనాది సర్వోపచార పూజా పరికల్పయామి

అనేన మంగళగౌరీ వ్రతేన సర్వమంగళ మంగళగౌరీ సుప్రీత సుప్రసన్న వరదా భవతు
బ్రాహ్మణునికి, ముత్తైదువకు, తల్లికి వాయనం ఇవ్వవలెను.

అన్ని శ్రావణమాసంలో మంగళవారాలు ఐదు పోగులు, ఐదు ముడులు ఉన్న తొరమును పూజలో పెట్టి పూజైన తరువాత ధరించవలెను. బియ్యంపిండి, బెల్లం కలిపి ప్రమిదలు ఐదు చేసి జ్యోతులు వెలిగించి తమలపాకు కట్టిన చాకుతో దీపాన్ని తాకుతూ కథ చదవాలి. కథ ముగిన తరువాత చాకుపై ఉన్న కాటికను ముత్తైదువులకు ఇచ్చి వ్రతం చేసిన వారు ధరించాలి.

మంగళగౌరీ వ్రత కథ

పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణామూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు.

ఒకప్పుడు సూత మహాముని సౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీ మహత్యమును, నారదమునీంద్రులు సావిత్రీదేవి కుపదేశించిన మంగళగౌరీ వ్రత కథయు, పూజావిధానమును ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.

పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. పసువు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళద్రవ్యాలలోను, ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ మంగళగౌరీ కొలువై ఉంటుంది.

త్రిపురాసురుని చంపటానికి వెళ్ళే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మను వంశజుడైన ‘మండూడనే రాజు గౌరీ దేవి వ్రత ప్రభావము వల్లనే చాలా కాలము భూలోకములో సర్వసంపదలతో రాజూమేలాడు. అటువంటి గౌరీ దేవిని పూజించి, వైధవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను.

చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానము కలుగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము.

చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంతః పురము బయట ద్వారము వద్ద నిలబడి “భవతీ భిక్షాందేహి” అన్నాడు. జయపాలుని భార్య బంగారు పళ్ళెంలో అన్నీ సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు . ఇలా మూడు రోజులు జరిగింది, జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధం గా ఉండమని భార్యతో చెప్పాడా రాజు.

మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోవడం జరిగింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక మీకు సంతానము లేని కారణంగా నీచేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య, “అయితే మహాత్మా! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి” అని వేడుకోగా ఆ సన్యాసి రూపములో ఉన్న ఈశ్వరుడు “అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీ కోరిక నెరవేరుతుంది.

“నీ భర్తను నీల వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను, ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది. ఆ స్వర్ణదేవాలయం లో ఉండే అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది”. అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు. ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు.స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు. జయపాలుని భక్తికి మెచ్చి అమ్మవారు సాక్షాత్కరించి ఎం కావాలో కోరుకోమంటే తనకు సంతానం కావలెనని కోరాడు. అప్పుడు అమ్మవారు “వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని” అడిగింది. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడాదేవి తన పక్కన ఉన్న గణపతి దగ్గరనున్న మామిడిచెట్టు మీది ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసాడు. కాని అన్ని మాయమయి ఒక్కటే మిగిలినది. గణపతికి అలాకోసేసరికి కోపము వచ్చి ఈ చర్య వల్ల నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని శపించాడు.

ఈ విధంగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. అతనికి శివుడని నామకరణము చేసిరి. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్తతో అన్నది. కాశీవిశ్వేశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామతో కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్ఠానపురం చేరారు.

అక్కడ కొందరు కన్యలు పూలుకోసుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను “ముండ,రండ” అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల “మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది” కాబట్టి మా కుటుంబములో ఎవరూ ముండలు, రండలు ఉండరు అంది కోపంతో అంత వరకూ కోసిన పూలను నేల మీదికి విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్లమీదికి చేరిపోయాయి.

జయపాలుడు కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. “మా ఇంట్లో ముండలు, రండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళగౌరీవ్రతం చేస్తుంటుంది” అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోచింది. సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా సుశీల తల్లిదండ్రుల దగ్గరకి వెళ్ళి నీకూతురుకి తగిన భర్త అని శివుని చూపగా వారు ఆ పరమశివుడే శివుని పంపాడని వారిరువురికి వివాహం జరిపిస్తారు. వారి పెళ్ళిలో సుశీల తల్లి తన కూతురికి మంగళగౌరీ నోము ఉద్యాపన చేస్తుంది.

పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి “నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రితో ఆతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు మార్గము చెపుతాను విను అని ఈవిధంగా చెప్పెను, “కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడ పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు”. దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది” అని అంతర్ధానమయ్యెను.

సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాళ్ళపారాణి ఇంకా ఆరని పాదం, తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగా నున్న కుండని తీసింది. సుశీల గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపడిపోయింది. అతను చూసుకోలేదు. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారక ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్దికోసం బయలుదేరారన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు, భార్యకు ఏ వివరం చెప్పకుండానే. సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి ఖిన్నురాలై అతని చేతినుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది.

ఉంగరం వదలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించటానికి వీలుగ అతనికి అతిధిమర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిధులకు రోజూ కాళ్ళు కడుగుతుండేది. దాదాపు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దోవలో అతనికి, తను చనిపోతునట్లూ అప్పుడు మంగళగౌరియు, యమదూతలు తన విషయంలో వాదించుకుంటునట్లూ కల వచ్చింది. వాళ్ళు మరలా ప్రతిష్ఠానపురం కొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు.

సుశీల అతని కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి, అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవక్ర్పవల్ల ఆ కాళ్ళపారాణి ఆరని కాలిగుర్తు అతని తొడమీద కనబడింది. శివుడు కూడా తను ఎందుకిలా వెళ్ళాడో వివరించాడు.శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు.

పుట్టింట్లో మంగళగౌరీ నోము నోచుకొని, భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది సుశీల. అన్నాళ్ళుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లితండ్రులు అంధులై పోయారు. సుశీల మంగళ గౌరీ నోములో నోచిన కాటుక వారి కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కళ్ళారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు.ఇందన్నడు అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుషు ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు.

దానికంతా కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరీ కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. ఆ పురుషుడికి మంచి ఆయిష్షు లేకపోయినా అతన్ని చేసుకున్న భార్య చేసిన పుణ్య కార్యాల వల్ల పూజా విధముల వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతోంది.

ఓ ద్రౌపదీ! మంగళ గౌరీ వ్రత ప్రసాదముతో వైధవ్యం లేకుందా చేసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

వ్రత ఉద్యాపన:

ఈ వ్రతం పెళ్ళైన సంవత్సరం ప్రారంభించి ఐదు సంవత్సరములు చేయాలి. ఐదవ సంవత్సరం ఆఖరి శ్రావణ మంగళవారం మంగళగౌరిని యధావిధిగా పూజించాలి తరువాత ఒక పెళ్ళిలో పెళ్ళికూతురికి కొత్త వస్త్రాలు ఇచ్చి మెట్టెలు, మంగళసూత్రం కలిపి వాయనం ఇవ్వాలి. ఆ విధంగా మంగళగౌరీ ఉద్యాపన పూర్తి చేయాలి.

Sri Bhavani Bhujanga Prayatha Stotram

శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం (Sri Bhavani Bhujanga Prayatha Stotram) షడాధార పంకేరు హాందర్విరాజ త్సుషుమ్నాంత రాలే తితే జోల సంతీమ్ | సుధా మండలం ద్రావయంతీం పిబంతీం సుధామూర్తి మీడే చిదానంద రూపామ్. |1| జ్వలత్కోటి బాలార్క...

Sri Stotram

శ్రీ స్తోత్రం (Sri Stotram) పురన్దర ఉవాచ: నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః । కృష్ణప్రియాయయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః ॥ 1 ॥ పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః । పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ...

Sri Kanchi Kamakshi Stotram

శ్రీ కంచి కామాక్షీ స్తోత్రమ్ (Sri Kanchi Kamakshi Stotram) కాంచినూపురరత్నకఙ్కణలసత్కేయూరహారోజ్జ్వలాం కాశ్మీరారుణకఞ్చుకాఞ్చితకుచాం కస్తూరికాచర్చితామ్ । కల్హారాఞ్చితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౧॥ కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం కన్దర్పాధికదర్పదానవిలసత్సౌన్దర్యదీపాఙ్కురామ్ । కీరాలాపవినోదినీం భగవతీం కామ్యప్రదానవ్రతాం కామాక్షీం కలయామి...

Sri Varahi Anugraha Ashtakam

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం(Sri Varahi Anugraha Ashtakam) ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన-నాటక-సూత్రధార స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ । ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ ౧॥ నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।...

More Reading

Post navigation

error: Content is protected !!