Lingodbhava Gadhyam
జయ జయ శివ లింగ జ్యోతిర్మహాలింగ లింగోద్భవ శ్రీ మహాలింగ వేదత్రయీ లింగ నిర్లింగ సంస్పర్శ లింగ క్షమా లింగ సద్భావ లింగ స్వభావైక లింగ దిగ్దేశ కాల వ్యవఛ్చేద రాహిత్య లింగ స్వయంభూ మహాలింగ పాతాళలింగ క్రియాలింగ పంచాక్షరీ లింగ పంచప్రకారోపదీపక్రియా లింగ వారాణసీ క్షేత్ర సింధూ గయా రుద్ర పాదద్వయీ శ్రీగిరి స్థాన శోణాచల వ్యాఘ్రపుర్యాది నానావిధ స్థాన సంసిద్ధి ప్రమాణాప్రమేయ ప్రభా లింగ విద్యాకళాలింగ షత్కర్త లింగాగమామ్నాయ లింగా ప్రతిష్టా కళా లింగ, మూలాలవాలాంతరాళానలావాణ కోణత్రయీ గేహ రోహ ప్రథా లేఖికాస్యూతి నిధ్యాన షట్పుష్కరీ నిమ్న టంక్రోడ విష్కంభ నిష్కంప శంపాలతా లంఘిత బ్రహ్మరంధ్ర స్రవచ్చాంద్రసాన్ద్రామ్రుత స్యందనస్పందితానంద లింగాదిమధ్యాంతశూన్య స్వరూపాభిధాలింగ ఖట్వాంగ లింగా హిలింగాభ్రగంగాసరిల్లింగ సారంగలింగాత్మభూలింగ ఐంలింగ ఈంలింగ ఓంలింగ వృక్షాపరోక్ష విరూపాక్షా లింగా నమస్తే నమస్తే నమః !