జయ స్కంధ స్తోత్రం (Jaya Skanda Stotram)
జయ దేవేంద్రజాకాంత జయ మృత్యుంజయాత్మజ।
జయ శైలేంద్రజా సూనో జయ శంభు గణావృతా।।
జయ తారక దర్పఘ్న జయ విఘ్నేశ్వరానుజ।
జయ దేవేంద్ర జామాతహ జయపంకజలోచన।।
జయ శంకరసంభూత జయ పద్మాసనార్చిత।
జయ దాక్షాయని సూనో జయ కాశవనోద్భవ।।
జయ భాగీరథీసూనో జయ పావక సంభవ।
జయపద్మజ గర్వఘ్న జయ వైకుంఠపూజితా।।
జయ భక్తేష్టవరద జయ భక్తార్తిభంజన।
జయ భక్తపరాధీన జయ భక్త ప్రపూజిత।।
జయధర్మవతాం శ్రేష్ఠ జయ దారిద్ర్యనాశన।
జయ బుద్ధిమతాం శ్రేష్ఠ జయ నారద సన్నుత।।
జయ భోగీశ్వరాధీశ జయ తుంబుర సేవితా।
జయ షట్తారకారాధ్య జయ వల్లి మనోహర।।
జయయోగ సమారాధ్య జయ సుందర విగ్రహ।
జయ సౌందర్యకూపార జయ వాసవవందిత।।
జయ షట్భావరహిత జయవేదవిదాంవర।
జయ షణ్ముఖదేవేశ జయభో విజయీభవ।।
ఇతి శ్రీ జయ స్కంద స్తోత్రం సంపూర్ణం