Home » Stotras » Dwadashaaryula Surya Stuthi
dwadasa aarya surya stuti

Dwadashaaryula Surya Stuthi

ద్వాదశార్యలు సూర్య స్తుతి (Dwadashaaryula Surya Stuthi)

సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం

ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు || 1 ||

తా|| ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, (కామెర్లు) త్వరగా పోగొట్టుగాక !

నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ || 2 ||

తా|| అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా ! నీకు నమోవాకం !

కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ || 3 ||

తా|| కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక !

త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ || 4 ||

తా|| సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస – నీవే

శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి || 5 ||

తా|| శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.!

త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు || 6 ||

తా|| చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక !

తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ || 7 ||

తా|| చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను (రేచీకటి జబ్బును) రోగపటలమును, గాజును పగులగొట్టినట్టు రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక !

యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః || 8 ||

తా|| వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !

యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే || 9 ||

తా|| ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను.

వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి || 10 ||

తా|| వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా ! నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు.

ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః || 11 ||

తా|| ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక ! మా ఎడల కరుణ జూపించుగాక !

త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ || 12 ||

తా|| సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

ఫలశ్రుతి.

ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||

ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.

Sri Bindu Madhava Stotram

శ్రీ బిందు మాధవ స్తోత్రం (Sri Bindu Madhava Stotram) ౧. ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతః శౌచదాయినే | సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ || ౨. నమామి తే పద ద్వంద్వం సర్వ ద్వంద్వ నివారకం| నిర్ద్వంద్వయా...

Banasura Virachitham Sri Siva Stavarajam

బాణాసుర విరచితం శ్రీ శివ స్తవరాజః (Banasura Virachitham Sri Siva Stavarajam) బాణాసుర ఉవాచ వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ | యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ || 1 || జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం...

Sri Indrakshi Stotram

శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం (Sri Indrakshi Stotram) అస్యశ్రీ ఇంద్రాక్షీ స్తోత్ర మంత్రస్య | శచీ పురందర బుషిః | అనుష్టుప్‌ ఛందః | శ్రీ మదింద్రాక్షీ దేవతా | మహా లక్ష్మీ ఇతి బీజం | భువనేశ్వరీతి శక్తిః |...

Sri Mahalakshmi Rahasya Namavali

శ్రీ మహాలక్ష్మి రహస్య నమావలి (Sri Mahalakshmi Rahasya Namavali) హ్రీం క్లీం మహీప్రదాయై నమః హ్రీం క్లీం విత్తలక్ష్మ్యై నమః హ్రీం క్లీం మిత్రలక్ష్మ్యై నమః హ్రీం క్లీం మధులక్ష్మ్యై నమః హ్రీం క్లీం కాంతిలక్ష్మ్యై నమః హ్రీం క్లీం...

More Reading

Post navigation

error: Content is protected !!