అయ్యప్పస్వామి మాలాధారణ మంత్రము (Ayyappa Swamy Maladharana Mantram)
జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |
విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
ఊరుజం వాపురం చైవ భైఅరవద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
మాల విసర్జన మంత్రం (Ayyappa Mala Visarjana Mantram)
అపూర్వ మచలా రోగా ద్దివ్య దర్శన కారన |
శాస్తృ ముద్రాద్మహాదేవ దేహిమే వ్రతమోచనం ||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
మాల ఇరుముడి చెల్లించి ఇంటికి వచ్చాక మాల విసర్జన చేసే సమయంలో పైన ఉన్న మంత్రం ని చదవాలి
శబరిమల నుండి రాగానే ఇంటి ముందల కొబ్బరికాయ కొట్టి లోపలి కి ప్రవేశించి పూజా మందిరం కానీ , మీరు ఏర్పాటు చేసుకున్న స్వామి పీఠ ముంగిట కర్పూరం వెలిగించి శరణుఘోషలు చెప్పి గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి, మాల విసర్జన మంత్రమును చెప్పి గురుస్వామి గారిచే మాల తీయించుకొనవలెను.