Home » Sri Dattatreya » Sri Dattatreya Avataram

Sri Dattatreya Avataram

శ్రీ దత్తు జయంతి (Sri Datta Jayanthi)

దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.

ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.

దత్తాత్రేయుడు త్రిమూర్తి అంశ. దీనిలో విష్ణువు మధ్యలో అటు ఇటూ బ్రహ్మ, మహేశ్వరులు ఉంటారు. ఆయన శంఖం, చక్రం, గదా, పద్మం, త్రిశూలం, డమరుకం, కమండలం, అక్షమాల (జపమాల) ధరించి వీరాసనంలో ఉంటాడు. వీరాసనం అంటే ఎడమతొడపై కుడికాలుని వేసుకొని తన రెండుపాదాలను, పాదుకలను కన్పించేలా కూర్చోవడం. వీటితోపాటు తనచుట్టు నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీక. ఇక దూరంగా ఆవు ఉంటుంది. ఇది ఉపనిషత్‌లకు సూచిక. దత్తుడు ధరించిన ఆయుధాలు శత్రు సంహారానికి కాదు. కేవలం జ్ఞానమార్గాన భక్తులను ఉద్ధరించడానికి మాత్రమే. ఈ అవతారం జ్ఞానావతారం. ప్రధానంగా దత్తాత్రేయుడిగా, హరి, కృష్ణ, ఉన్మత్త, ముని, ఆనందదాయక, దిగంబర, బాల, పిశాచ, జ్ఞానసాగర అనే 10 రూపాల్ల్లో దర్శనమిస్తాడు. ఈ రూపాలను స్మరించుకొంటే పాపపుణ్యాలను తీసివేస్తాడు. అద్భుత ఫలితాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. ఆయన కాశీ గంగలో స్నానమాచరించి, కొల్హాపురిలో భిక్ష తీసుకొని, సహ్యాద్రి శిఖరంలోని మాలాపురంలో నిద్రపోతారని పురాణాల్లో ఉంది. ఇటువంటి ఈ గురువును పట్టుకోవాలంటే కేవలం స్మరణ చేస్తే చాలు. అందుకే ఆయనను స్మర్తృగామి అంటారు. అవతార పరిసమాప్తిలేని అవతారం దత్త అవతారం.

సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్షపూర్ణిమనాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు.

శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.

దత్త జయంతి మార్గశిర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!

Sri Datta Hrudayam

శ్రీ దత్త హృదయము (Sri Datta Hrudayam) దత్త స్సనాతనం నిత్యం నిర్వికల్పం  నిరామయం హరిం శివం మహాదేవం సర్వభుతోపకారకం || ౧ || నారాయణం మహావిష్ణుం సర్గస్థత్యోంతకారణం నిరాకారంచ సర్వేశం కార్తవీర్యవరప్రదం || 2 || అత్రిపుత్రం మహాతేజం మునివంద్యం...

Sri Dattatreya Ashtottara Shatanamavali

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి (Sri Dattatreya Ashtottara Shatanamavali) ఓం శ్రీ దత్తాయ నమః ఓం దేవదత్తాయ నమః ఓం బ్రహ్మదత్తాయ నమః ఓం శివదత్తాయ నమః ఓం విష్ణుదత్తాయ నమః ఓం అత్రిదత్తాయ నమః ఓం ఆత్రేయాయ నమః...

Sri Datta Panjara Stotram

శ్రీ దత్త పంజర స్తోత్రం (Sri Datta Panjara Stotram) ఓం నమో భగవతే దత్తత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంట వాసాయ శంఖచక్రగాధాత్రి శూల ధారిణే, వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞాన బ్రహ్మమహా వాక్యాయ, సకలోకైక సన్నుతాయ, సచ్చిదానందాయ, సకలలోక...

Sri Dattatreya Kavacham

శ్రీ దత్తాత్రేయ కవచం (Sri Dattatreya Kavacham) శ్రీ పాదః పాతు మే పాదౌ ఊరూ సిద్ధాసనస్థతః పాయా ద్దిగంబరో గుహ్యం నృహరిహి పాతు మే కటిం || ౧ || నాభిం పాతు జగ త్ర్సాష్టదరం పాతు దలోదరః కృపాళు:...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!