అయ్యప్ప స్వామీ 18 మెట్ల విసిష్టత ( Ayyappa 18 metlu visistatha)
- 1వ మెట్టు – కామం – ఈ మెట్టు కి అది దేవత “గీతామాత” ఈ మెట్టు ఎక్కటం వలన మనిషికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది
- 2 వ మెట్టు – క్రోధం – ఈ మెట్టు కి అది దేవత “గంగాదేవీ” ఈ మెట్టును స్పర్శించటం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్దాత్మను అనే జ్ఞానం కలుగుతుంది.
- ౩వ మెట్టు – లోభం – గాయత్రీ మాత – ఈ మెట్టును స్పర్శించటం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమ గతులు కలుగుతాయి
- 4 ఆవ మెట్టు మొహం – సీతాదేవి. ఈ మెట్టు జ్ఞాన యోగానికి ప్రతీక – ఒక వ్యక్తి పై గల ప్రేమానురాగాలకు ప్రతిరూపం గా ఈ మెట్టు ని భావిస్తారు.
- 5 వ మెట్టు – మదం – సత్యవతీ దేవీ ఈ మెట్టు కర్మ సన్యాస యోగానికి ప్రతీక ఈ మెట్టు అధిరోహిస్తే వారి ఇంట్లో ఉన్న పశు పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి ఉత్తమ గతులు కలుగుతాయి.
- 6 వ మెట్టు – మాత్సర్యం – సరస్వతీ దేవీ ఈ మెట్టు స్పర్శ వలణ విష్ణు సాయుజ్యంతో పాటు దానఫలం లభిస్తుంది
- 7వ మీటు – దంబం – బ్రహ్మవిద్యా దేవీ ఈ మెట్టు స్పర్శ వలన జ్ఞాన యోగం కలిగి జన్మరాహిత్యం సిద్ధిస్తుంది.
- 8 వ మెట్టు – అహంకారం – ఈ మెట్టు కి అది బ్రహ్మవల్లీదేవీ . ఈ మెట్టును అధిరోహించటం వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.
- 9వ మెట్టు – నేత్రాలు – త్రిసంధ్యాదేవీ – ఈ మెట్టు స్పర్శ వలన మనం అప్పుగా తీసుకున్న వస్తువులు వల్ల సంక్రమించిన పాపం నశిస్తుంది
- 10 వ మెట్టు – చెవులు – ముక్తి గేహినే దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమ ధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతుంది.
- 11 వ మెట్టు – నాసిక – అర్ధమాత్రా దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన అకాలమృత్యుభయం ఉండదు
- 12 వ మెట్టు – జిహ్వ – చిదానందా దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన ఇష్ట దేవతా దర్శనం ప్రాప్తిస్తుంది.
- 13 వ మెట్టు – స్పర్శ – భావఘ్నీదేవీ ఈ మెట్టు స్పర్శ వలన చేసిన అపచారాలు, పాపాలు నశిస్తాయి.
- 14 వ మెట్టు – సత్వం – భయనాశినీ దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీ హత్యా పాతకాలు తోలుగుతాయి.
- 15 వ మెట్టు – తామసం – వెధత్రయీ దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన ఆహార శుద్ధి మోక్షం కలుగుతాయి.
- 16 వ మెట్టు – రాజసం – పరాదేవీ – ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం, బలం లబిస్తాయి
- 17 వ మెట్టు – విద్య – అనంతా దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘ వ్యాధులు సైతం నసిస్తాయి
- 18 వ మెట్టు – అవిద్యా – జ్ఞానమంజరీ దేవీ – ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది
Leave a Comment