Home » Stotras » Sri Mangala Gowri Vratham

Sri Mangala Gowri Vratham

శ్రీ మంగళ గౌరీ వ్రత కథ (Sri Mangala Gowri Vratham)

పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.

ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.

ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.

మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.

Sri Venkatesa Dwadasa nama Stotram

శ్రీ వేంకటేశ ద్వాదశనామస్తోత్రం (Sri Venkatesa Dwadasa nama Stotram) వేంకటేశో వాసుదేవో వారిజాసనవందితః | స్వామిపుష్కరిణీవాసః శంఖచక్రగదాధరః || ౧ || పీతాంబరధరో దేవో గరుడారూఢశోభితః | విశ్వాత్మా విశ్వలోకేశో విజయో వేంకటేశ్వరః || ౨ || ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యాం యః...

Sri Shiva Kavacham Stotram

శ్రీ శివ కవచము (Sri Shiva Kavacham Stotram) ఓంనమోభగవతేసదాశివాయ సకలతత్వాత్మకాయ! సర్వమంత్రస్వరూపాయ! సర్వయంత్రాధిష్ఠితాయ! సర్వతంత్రస్వరూపాయ! సర్వతత్వవిదూరాయ! బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ! పార్వతీమనోహరప్రియాయ! సోమసూర్యాగ్నిలోచనాయ! భస్మోద్ధూలితవిగ్రహాయ! మహామణి ముకుటధారణాయ! మాణిక్యభూషణాయ! సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ! దక్షాధ్వరధ్వంసకాయ! మహాకాలభేదనాయ! మూలధారైకనిలయాయ! తత్వాతీతాయ! గంగాధరాయ! సర్వదేవాదిదేవాయ! షడాశ్రయాయ!...

Sri Durga Devi Chandrakala Stuti

దేవీ చన్ద్రకళాస్తుతీ (Sri Durga Devi Chandrakala Stuti) వేధోహరీశ్వరస్తుత్యాం విహర్త్రీం వింధ్య భూధరే! హర ప్రాణేశ్వరీం వన్దే హన్త్రీం విబుధవిద్విషామ్!!  || 1 || భావం: బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తోత్రింపబినది – వింధ్య పర్వతమున విహరించునది, శివుని ప్రాణేశ్వరి, దేవ...

Kasi Panchakam

కాశీ పంచకం (Kasi Panchakam) మనో నివృత్తి: పరమోపశంతి: సా తీర్ధవర్యా మణికర్ణి కాచ జ్ఞాన ప్రవాహో విమలాది గంగా సా కాశికాహం నిజభో ధరూపా || 1 || యస్యామిదం కల్పితమిన్ద్రజాలం చరచారం భాతి మనోవిలాసం సచ్చిత్సు ఖైకా పరమాత్మ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!