నవరాత్రి పూజ విధానం (Navaratri Pooja Vidhanam)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః
(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)
గణపతి ప్రార్దన
ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
(హృదయం దగ్గర నమస్కారం ముద్రతో శ్లోకం చదవాలి)
ఆచమనము
ఓం కేశవాయ స్వాహా (ఆచమనము చేయాలి)
ఓం నారాయణాయ స్వాహా (ఆచమనము చేయాలి)
ఓం మాధవాయ స్వాహా ఆచమనము చేయాలి
(పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము చేయాలి, తర్వాత చెయ్యి కడుగుకోవాలి)
స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
( కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కకి వదలాలి, భార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి)
ప్రాణాయామముప్రాణాయామము
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ శంకరం
(ప్రాణాయామం చేయవలెను )
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ, శుభే శోబానే ముహూర్తే, శుభనక్షత్రే, శుభ కరణే, ఏవం గుణ విశేషణా విశిష్టాయాం శుభ తిధౌ, అస్మాకం సహ కుటుంబానాం, సర్వేషాం గోత్రోద్భవానాం జీవానాం, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, ధన ధాన్య సమృధ్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, అస్మిన్ దేశే గోవధ నిషేదార్థం, గో సంరక్షణార్థం, వేద సంప్రదాయాభివృద్యర్ధం, అస్మిన్ దేశే సర్వేషాం జీవానాం, సత్వర సంపూర్ణ ఆరోగ్య సిత్యర్థం, ధన కనక వస్తు వాహనాది సమృద్యర్థం, సర్వతోముఖాభి వృద్యర్థం, మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ స్వరూప దుర్గాంబికాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!
( కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి )
ఘంటా నాదంఘంటా నాదం చేస్తూ (గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్
కలశారాధనకలశారాధన
కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు
(పచ్చకర్పూరం, తులసి దళం, ఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలి, పువ్వుతో నీళ్ళు మనమీద, కుడివైపు చల్లుకోవాలి)
గణపతి పూజ
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
ఆదౌ నిర్విఘ్నం పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే
శ్రీ మహాగణపతయే నమః – ధ్యాయామి
శ్రీ మహాగణపతయే నమః – ఆవాహయామి
శ్రీ మహాగణపతయే నమః – ఆసనం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – పాదయోః పాద్యం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – ఆచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – స్నానం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – వస్త్ర యుగ్మం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – యజ్ఞోపవీతం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – గంధం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – పుష్పాణి సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – ధూపమాఘ్రాపయామి
శ్రీ మహాగణపతయే నమః – దీపం దర్శయామి
శ్రీ మహాగణపతయే నమః – నైవేద్యం సమర్పయామి
(సత్యం త్వర్తేన పరిషం చామి అమృతమస్తు అమృతోపస్తర ణమసి (ప్రాణాయ స్వాహా – అపానాయ స్వాహా – వ్యానాయ స్వాహా – ఉదానాయ స్వాహా – సమానాయ స్వాహా)
శ్రీ మహాగణపతయే నమః – తాంబూలం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – నీరాజనం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – మంత్ర పుష్పం, నమస్కారం సమర్పయామి
అనయా, యథా శక్తి పూజాయచ – శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు, శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృణ్హామి
దుర్గా షోడశోపచార పూజ
ధ్యానం
శ్లోకం
హ్రీంకారాసన గర్భితా నల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశ ధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః ధ్యాయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆవాహనం
శ్లోకం
శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం
త్రిశక్తిరూపిణీ మంబాం దుర్గా చండీం నమామ్యహమ్
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః ఆవాహయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆసనం
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
రత్న సింహాసన మిదం మహాదేవీ ప్రగృహ్యతామ్
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
పాద్యం
సురాసుర మహా మౌళీ మాలా మాణిక్య కాంతిభిః
విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దదామ్యహం
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
అర్ఘ్యం
పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీ జలం
శంఖ గర్భ స్థితం శుద్ధం గృహ్యతాం శ్రీ శివప్రియే
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
ఆచమనీయం
పుణ్య తీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా
గృహాణాచమనం దేవీ సర్వదేవ నమస్కృతే
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
స్నానం
(అమ్మవారి రూపుని పళ్ళెంలో పెట్టి, అవకాశం ఉంటే పంచామృతాలు లేకపోతే కలశంలోని నీళ్ళతో లేకపోతే కలశంలోని పువ్వుతో అభిషేకం చేయండి)
పయోదధి ఘృతో పేతం శర్కరా మథు సంయుతం
పంచామృత మిదం స్నానం గృహాణ సురపూజితే
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి
తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
(దేవికి నీళ్ళతో స్నానము చేయాలి, అమ్మవారి రూపుని మంచి బట్టతో తుడిచి, గంధం కుంకుమ పెట్టండి)
వస్త్రం
పీతాంబర ధరే దేవీ పీతాంబర సహోదరీ
పీతాంబరం ప్రయఛ్చామి విద్యుత్ అంగ జటాధరే
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను)
యజ్ఞోపవీతం
శబ్ద బ్రహ్మాత్మికే దేవీ శబ్ద శాస్త్ర కృతాలయే
సౌవర్ణం యజ్ఞ సూత్రంతే, దదామి పరమేశ్వరీ
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
గంధం
కస్తూరీ కుంకుమైర్ యుక్తం ఘనసార విమిశ్రితం
మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః గంధ సమర్పయామి (ధారయామి)
హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి
(పువ్వుతో గంధం తీసుకుని అమ్మవారి చేతులకి పాదాలకు అద్ది పువ్వును పాదాల దగ్గర ఉంచండి, దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)
పుష్పం
తురీయ వన సంభూతం నానా గుణ మనోహరం
ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం ఇదముత్తమం
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి
(పుష్పాలు సమర్పించవలెను)
రత్నస్వర్ణవికారం చ దేహాలంకారవర్ధనం
శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యాతామ్
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి
అంగపూజ
దుర్గాయై నమః – పాదౌ పూజయామి
కాత్యాయన్యై నమః – గుల్ఫౌ పూజయామి
మంగళాయై నమః – జానునీ పూజయామి
కాంతాయై నమః – ఊరూం పూజయామి
భద్రకాళ్యై నమః – కటిం పూజయామి
కపాలిన్యై నమః – నాభిం పూజయామి
శివాయై నమః – హృదయం పూజయామి
వైరాగ్యై నమః – స్తనౌ పూజయామి
లలితాయై నమః – భుజద్వయం పూజయామి
స్వాహాయై నమః – కంఠం పూజయామి
స్వధాయై నమః – ముఖం పూజయామి
సునాసికాయై నమః – నాసికాం పూజయామి
సునేత్రాయై నమః – నేత్రే పూజయామి
రమాయై నమః – కర్ణౌ పూజయామి
సింహవాహనాయై నమః – లలాటం పూజయామి
రుద్రాణ్యై నమః – శిరః పూజయామి
శ్రీ దుర్గాదేవ్య నమః – సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ దుర్గాదేవ్యైనమః నాణావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
దుర్గ అష్టోత్తరశతనామావళి చదవాలి
- ఓం దుర్గాయై నమః
- ఓం మహాలక్ష్మ్యై నమః
- ఓం మహాగౌర్యై నమః
- ఓం చండికాయై నమః
- ఓం సర్వజ్ఞాయై నమః
- ఓం సర్వలోకేశాయై నమః
- ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
- ఓం సర్వతీర్ధ మయాయై నమః
- ఓం పుణ్యాయై నమః
- ఓం దేవయోనయే నమః
- ఓం అయోనిజాయై నమః
- ఓం భూమిజాయై నమః
- ఓం నిర్గుణాయై నమః
- ఓం ఆధారశక్త్యై నమః
- ఓం అనీశ్వర్యై నమః
- ఓం నిర్గుణాయై నమః
- ఓం నిరహంకారాయై నమః
- ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
- ఓం సర్వలోకప్రియాయై నమః
- ఓం వాణ్యై నమః
- ఓం సర్వ విద్యాధిదేవతాయై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం దేవమాత్రే నమః
- ఓం వనీశాయై నమః
- ఓం వింధ్యవాసిన్యై నమః
- ఓం తేజోవత్యై నమః
- ఓం మహామాత్రే నమః
- ఓం కోటిసూర్య ప్రభాయై నమః
- ఓం దేవతాయై నమః
- ఓం వహ్నిరూపాయై నమః
- ఓం స్వతేజసే నమః
- ఓం వర్ణరూపిణ్యై నమః
- ఓం గుణాశ్రయాయై నమః
- ఓం గుణమధ్యాయై నమః
- ఓం గుణత్రయవివర్జితాయై నమః
- ఓం కర్మజ్ఞానప్రదాయై నమః
- ఓం కాంతాయై నమః
- ఓం సర్వసంహారకారిణ్యై నమః
- ఓం ధర్మ జ్ఞా నాయై నమః
- ఓం ధర్మనిష్టాయై నమః
- ఓం సర్వకర్మవివర్జితాయై నమః
- ఓం కామాక్ష్యై నమః
- ఓం కామ సంహర్ర్యై నమః
- ఓం కామక్రోధ వివర్జితాయై నమః
- ఓం శాంకర్యై నమః
- ఓం శాంభవ్యై నమః
- ఓం శాంతాయై నమః
- ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః
- ఓం సుజయాయై నమః
- ఓం జయభూమిష్ఠాయై నమః
- ఓం జాహ్నవ్యై నమః
- ఓం జనపూజితాయై నమః
- ఓం శాస్త్రాయై నమః
- ఓం శాస్త్రమయాయై నమః
- ఓం నిత్యాయ నమః
- ఓం శుభాయై నమః
- ఓం చంద్రార్థమస్తకాయై నమః
- ఓం భారత్యై నమః
- ఓం భ్రామర్యై నమః
- ఓం కల్పాయై నమః
- ఓం కరాళ్యైనమః
- ఓం కృష్ణపింగళాయై నమః
- ఓం బ్రాహ్మ్యై నమః
- ఓం నారాయణ్యై నమః
- ఓం రౌ ధ్య్రై నమః
- ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః
- ఓం జ్యేష్ఠాయై నమః
- ఓం ఇందిరాయై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం జగజగత్సృష్ట్యధికారిణ్యై నమః
- ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః
- ఓం కామిన్యై నమః
- ఓం కమలాలయాయై నమః
- ఓం కాత్యాయన్యై నమః
- ఓం కాలాతీతాయై నమః
- ఓం కాలసంహారకారిణ్యై నమః
- ఓం యోగనిష్ఠాయై నమః
- ఓం యోగిగమ్యాయై నమః
- ఓం యోగిధ్యేయాయై నమః
- ఓం తపస్విన్యై నమః
- ఓం జ్ఞానరూపాయై నమః
- ఓం నిరాకారాయై నమః
- ఓం భక్తాభీష్ట నమః
- ఓం ఫలప్రదాయై నమః
- ఓం భూతాత్మికాయై నమః
- ఓం భూతమాత్రే నమః
- ఓం భూతేశాయై నమః
- ఓం భూతధారిణ్యై నమః
- ఓం స్వధానారీమధ్యగతాయై నమః
- ఓం షడాధారాదివర్ధిన్యై నమః
- ఓం మోహితాయై నమః
- ఓం అంశుభవాయై నమః
- ఓం సూక్ష్మాయై నమః
- ఓం మాత్రాయై నమః
- ఓం నిరాలసాయై నమః
- ఓం నిమ్నగాయై నమః
- ఓం నీలసంకాశాయై నమః
- ఓం నిత్యానందాయై నమః
- ఓం హరాయై నమః
- ఓం పరాయై నమః
- ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
- ఓం అనంతాయై నమః
- ఓం సత్యాయై నమః
- ఓం దుర్లభరూపిణ్యై నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం సర్వగతాయై నమః
- ఓం సర్వాభీష్టప్రదాయ నమః
అష్టోతరం పూర్తి చేసి
ధూపం
శ్లోకం
వనస్పతి రసైర్ దివ్యైః నానా గంధైః సుసంయుతం,
అఘ్రేయ స్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః ధూపం అఘ్రాపయామి
(ధూపం చూపించాలి)
దీపం
శ్లోకం
జగచ్చక్షుః స్వరూపంచ ప్రాణరక్షణ కారణం
ప్రదీపం శుద్ధరూపంచ గృహ్యతాం పరమేశ్వరీ
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః దీపం దర్శయామి
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
(దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను)
నైవేద్యం
శ్లోకం
శర్కరా మధు సంయుక్తం, ఆజ్యాదైః అధపూరితం
గృహాణ దుర్గే నైవేద్యం, మహిషాసుర మర్దిని
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి
(నైవేద్యం మీద నీళ్ళు జల్లి అమ్మవారికి చూపించండి)
సత్యం త్వర్తేన పరిషించామి (ఉదయం సమయంలో )
త్వా సత్యేన పరిషించామి (సాయంత్రం సమయంలో )
అమృతమస్తు అమృతోపస్తరణమసి
ఓం ప్రాణాయ స్వాహా – ఓం అపానాయ స్వాహా – ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా
(సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను )
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి
ఉత్తరా పోశనం సమర్పయామి – హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి
పాదౌ ప్రక్షాళయామి – శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
శ్లోకం
పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం సమర్పించవలెను)
నీరాజనం
శ్లోకం
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః కర్పూర నీరాజనం దర్శయామి
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి
(కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను)
మంత్రపుష్పం – నమస్కారం
(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)
శ్లోకం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే
ఉపచారం
శ్రీ దుర్గా దేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)
క్షమా ప్రార్ధన – స్వస్తి
(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషుః
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ
యాత్పూజితం మాయా దేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా యదా శక్తి పూజయాచ భగవాతీ సర్వాత్మిక
శ్రీ దుర్గా దేవతా సుప్రసన్నః స్సుప్రీతో వరదో భవతు
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు
కలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయః
అపుత్రాః పుత్రిణః పంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః
అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం
ఒక్కో రోజు అమ్మవారి అవతారం తగట్టు అష్టోత్తర సహస్ర నామాలు శ్లోకాలు పారాయణం చేసుకోవాలి, ప్రతిరోజూ లలితా సహస్ర నామాలు పారాయణం కుంకుమార్చన చేసుకుంటే మంచిది..