Home » Pooja Vidhanam » Sri Vinayaka Chavithi Pooja Vidhanam

Sri Vinayaka Chavithi Pooja Vidhanam

శ్రీ వినాయక వ్రత పూజా విధానం  (Sri Vinayaka Chavithi Pooja Vidhanam)

శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
హరిః ఓం

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే||

నమస్కరించుకుని ఆచమనం చేయాలి. ఎడమచేతితో ఉద్దరిణ పట్టుకుని, నీటి పాత్ర నుంచి మూడుసార్లు నీటిని కుడి చేతిలో వేసుకుంటూ
కేశవాయ స్వాహా,
నారాయణాయ స్వాహా,
మాధవాయ స్వాహా అంటూ నీటిని తాగాలి. హస్తం ప్రక్షాళ్య అంటూ ఉద్దరిణతో నీటిని తీసుకుని చేతిని కడుక్కోవాలి.)

ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః,
ఓం మధు సూదనాయ నమః,
ఓం త్రివిక్రమాయ నమః,
ఓం వామనాయనమః,
ఓం శ్రీధరాయ నమః,
ఓం హృషీకేశాయనమః,
ఓం పద్మనాభాయనమః,
ఓం దామోదరాయనమః,
ఓం సంకర్షణాయనమః,
ఓం వాసుదేవాయనమః,
ఓం ప్రద్యుమ్నాయనమః,
ఓం అనిరుద్దాయనమః,
ఓం పురుషోత్త మాయనమః,
ఓం అధోక్షజాయనమః,
ఓం నారసింహాయనమః,
ఓం అచ్యుతాయనమః,
ఓం జనార్దనాయనమః,
ఓం ఉపేంద్రాయనమః,
ఓం హరయేనమః,
ఓం శ్రీకృష్ణాయనమః.

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే.

(ప్రాణాయామం చేయాలి. నాసిక ఎడమ రంధ్రం నుంచి గాలి పీలుస్తూ, గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించాలి)

ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః ఓం తపః ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.

మమ ఉపాత్త సమస్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ……… ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్య ప్రదేశే…స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహ గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన …….సంవత్సరే ….ఆయనే…..ఋతౌ…మాసే…..పక్షే….తిథౌ…..వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః….అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం ధ్యానావాహనాది షోడషోపచార పూజాం కరిష్యే. అక్షతలు తీసుకుని నీరు వదలవలెను.

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యంర్ధం
శ్రీ మహగణధిపతి దేవతా పూజాం కరిష్యే !

మరలా కొంచం నీరు వదలవలెను.

తదంగత్వేన కలశపూజాం కరిష్యే!

అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను.

శ్లో కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!
అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!

ఓం ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే ; ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాడాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ |
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ||
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ముద్దిశ్య
కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య ||

దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య ||

(కలశములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన, తమ పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.)

తదంగ ప్రాణప్రతిష్టాపనం కరిష్యే

ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతేస్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |

శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణ ప్రతిష్టాపనముహూర్త సుముహూర్తోస్తు

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచితసింహసనం సమర్పయామి|

శ్రీ మహాగణాధి పతయే నమః పాదయో పాద్యం సమర్పయామి(పుష్పంతో మూడుసార్లు నీరుచల్లండి)| హస్తయో అర్గ్యం సమర్పయామి |

ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి

ఉపచారిక స్నానం
(స్వామిపై పుష్పంతో నీరుచల్లండి)

శ్రీ మహాగణాదిపతయే నమః | శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |

వస్త్రం
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |
అధఃపుష్పైపూజయామి.

ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గానాదిపాయనమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.

ధూపమాగ్రాపయామి

దీపం దర్శయామి

ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి

నైవేద్యం:

ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ సత్యన్త్వర్తేన పరిషించామి| అమృతమస్తు అమృతోపస్త్హరణమసి ||
శ్రీ మహాగణాధిపతయే నమోనమః కదళీఫలం నివేదయామి.

ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

అమ్రుతాపితానమసి వుత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖేశుద్దాచమనీయం సమర్పయామి

శ్రీ మహా గణాధిపతయే నమో నమః
తాంబూలం సమర్పయామి

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||

నీరాజనం
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి మాధవ్యోసనీతి ఏకధా బ్రహ్మణ ముపహరతి ఏకదైవ ఆయుష్తేజో దదాతి
ఓం శ్రీ మహాగానాదిపతయే నమోనమః నీరాజనం సమర్పయాం ||

నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

శ్రీ మహాగానాదిపతయే నమోనమః

మంత్రపుష్పం
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా.

శ్రీ మహాగానాదిపతయే నమోనమః
సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షణ

శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||

యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తాన్యాతి సద్యోవందే గణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి.

గణపతి వద్దనున్న పుష్పము,అక్షతలు శిరస్సున ధరించవలెను.

గణపతి ఆకుని తూర్పవైపుకు జరపవలేను

మంత్రం  :

యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మానణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే క్షేమాయ పునరాగమనాయచ.

అధ శ్రీ మహగణపతిపూజాం సంపూర్ణం

అధః  వినాయక వ్రతపూజా ప్రారంభం

భవసంచిత.. పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే ఏకదంతం శూర్పకర్ణం. పాశాంకుశధరం దేవం గజవక్త్రం చతుర్భుజం| ధ్యాయేత్సద్ధి వినాయకమ్ ఉత్తమం గణనాథస్య వ్రతం.. సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విష్ను నాయకమ్ ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం | చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి.

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
శ్రీ మహా గణాధిపతయే నమఃఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥
శ్రీ మహా గణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
శ్రీ మహా గణాధిపతయే నమః పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

శ్రీ మహా గణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమోనమః
శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమోనమః వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమోనమః ఉపవీతం సమర్పయామి.

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమోనమః గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమోనమః  అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమోనమః పుష్పాణి పూజయామి.

అథాంగ పూజ

( పుష్పములతో పూజించవలెను)

ఓం శ్రీ గణేశాయనమః పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః గుల్పౌపూజయామి
ఓం శూర్పకర్ణాయనమః జానునీ పూజయామి
ఓం విఘ్నరాజాయనమః జజ్ఞే పూజయామి
ఓం ఆఖువాహనాయనమః ఊరూపూజయామి
ఓం హేరమ్బాయనమః కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః ఉదరంపూజయామి
ఓం గణనాధాయనమః నాభిం పూజయామి
ఓం గణేశాయనమః హృదయంపూజయామి
ఓం స్థూలకణాయనమఃకణ్ణం పూజయామి
ఓం స్కన్దాగ్రజాయనమః స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయనమః హస్తా పూజయామి
ఓం గజవక్రాయనమః వక్త్రం పూజయామి
ఓం విఘ్న హర్తే నమః నేత్రే పూజయామి
ఓం శూర్పకర్ణాయనమః కర్ణా పూజయామి
ఓం ఫాలచంద్రాయనమః లలాటం పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ  (21 విధముల పత్రములతో పూజింపవలెను)

  1. సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి।(మాచి ఆకు)
  2. గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।(బలురక్కసి /ములుగు)
  3. ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి।(మారేడు)
  4. గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి(గరిక)
  5. హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి।(ఉమ్మెత్త)
  6. లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి।(రేగు)
  7. గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి।(ఉత్తరేణి)
  8. గజకర్ణాయనమః – * పూజయామి,
  9. ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,(మామిడి)
  10. వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి।(గన్నేరు)
  11. భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,(విష్ణుక్రాంత)
  12. వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,(దానిమ్మ)
  13. సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,(దేవదారు)
  14. ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,(మరువం)
  15. హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి(వావిలాకు)
  16. శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,(జాజిఆకు)
  17. సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,(దేవకాంచనం)
  18. ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,(జమ్మిఆకు)
  19. వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,(రావి)
  20. సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి।(తెల్లమద్దె)
  21. కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి।(జిల్లేడు)
    శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ గణేశ అష్టోత్తర శత నామావళి

  1. ఓం గజాననాయ నమః
  2. ఓం గణాధ్యక్షాయ నమః
  3. ఓం విఘ్నారాజాయ నమః
  4. ఓం వినాయకాయ నమః
  5. ఓం ద్త్వెమాతురాయ నమః
  6. ఓం ద్విముఖాయ నమః
  7. ఓం ప్రముఖాయ నమః
  8. ఓం సుముఖాయ నమః
  9. ఓం కృతినే నమః
  10. ఓం సుప్రదీపాయ నమః (10)
  11. ఓం సుఖనిధయే నమః
  12. ఓం సురాధ్యక్షాయ నమః
  13. ఓం సురారిఘ్నాయ నమః
  14. ఓం మహాగణపతయే నమః
  15. ఓం మాన్యాయ నమః
  16. ఓం మహాకాలాయ నమః
  17. ఓం మహాబలాయ నమః
  18. ఓం హేరంబాయ నమః
  19. ఓం లంబజఠరాయ నమః
  20. ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
  21. ఓం మహోదరాయ నమః
  22. ఓం మదోత్కటాయ నమః
  23. ఓం మహావీరాయ నమః
  24. ఓం మంత్రిణే నమః
  25. ఓం మంగళ స్వరాయ నమః
  26. ఓం ప్రమధాయ నమః
  27. ఓం ప్రథమాయ నమః
  28. ఓం ప్రాజ్ఞాయ నమః
  29. ఓం విఘ్నకర్త్రే నమః
  30. ఓం విఘ్నహంత్రే నమః (30)
  31. ఓం విశ్వనేత్రే నమః
  32. ఓం విరాట్పతయే నమః
  33. ఓం శ్రీపతయే నమః
  34. ఓం వాక్పతయే నమః
  35. ఓం శృంగారిణే నమః
  36. ఓం ఆశ్రిత వత్సలాయ నమః
  37. ఓం శివప్రియాయ నమః
  38. ఓం శీఘ్రకారిణే నమః
  39. ఓం శాశ్వతాయ నమః
  40. ఓం బలాయ నమః (40)
  41. ఓం బలోత్థితాయ నమః
  42. ఓం భవాత్మజాయ నమః
  43. ఓం పురాణ పురుషాయ నమః
  44. ఓం పూష్ణే నమః
  45. ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
  46. ఓం అగ్రగణ్యాయ నమః
  47. ఓం అగ్రపూజ్యాయ నమః
  48. ఓం అగ్రగామినే నమః
  49. ఓం మంత్రకృతే నమః
  50. ఓం చామీకర ప్రభాయ నమః (50)
  51. ఓం సర్వాయ నమః
  52. ఓం సర్వోపాస్యాయ నమః
  53. ఓం సర్వ కర్త్రే నమః
  54. ఓం సర్వనేత్రే నమః
  55. ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
  56. ఓం సర్వ సిద్ధయే నమః
  57. ఓం పంచహస్తాయ నమః
  58. ఓం పార్వతీనందనాయ నమః
  59. ఓం ప్రభవే నమః
  60. ఓం కుమార గురవే నమః (60)
  61. ఓం అక్షోభ్యాయ నమః
  62. ఓం కుంజరాసుర భంజనాయ నమః
  63. ఓం ప్రమోదాయ నమః
  64. ఓం మోదకప్రియాయ నమః
  65. ఓం కాంతిమతే నమః
  66. ఓం ధృతిమతే నమః
  67. ఓం కామినే నమః
  68. ఓం కపిత్థవనప్రియాయ నమః
  69. ఓం బ్రహ్మచారిణే నమః
  70. ఓం బ్రహ్మరూపిణే నమః (70)
  71. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
  72. ఓం జిష్ణవే నమః
  73. ఓం విష్ణుప్రియాయ నమః
  74. ఓం భక్త జీవితాయ నమః
  75. ఓం జిత మన్మథాయ నమః
  76. ఓం ఐశ్వర్య కారణాయ నమః
  77. ఓం జ్యాయసే నమః
  78. ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
  79. ఓం గంగా సుతాయ నమః
  80. ఓం గణాధీశాయ నమః (80)
  81. ఓం గంభీర నినదాయ నమః
  82. ఓం వటవే నమః
  83. ఓం అభీష్ట వరదాయినే నమః
  84. ఓం జ్యోతిషే నమః
  85. ఓం భక్త నిధయే నమః
  86. ఓం భావగమ్యాయ నమః
  87. ఓం మంగళ ప్రదాయ నమః
  88. ఓం అవ్వక్తాయ నమః
  89. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
  90. ఓం సత్యధర్మిణే నమః (90)
  91. ఓం సఖయే నమః
  92. ఓం సరసాంబు నిధయే నమః
  93. ఓం మహేశాయ నమః
  94. ఓం దివ్యాంగాయ నమః
  95. ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
  96. ఓం సమస్తదేవతా మూర్తయే నమః
  97. ఓం సహిష్ణవే నమః
  98. ఓం సతతోత్థితాయ నమః
  99. ఓం విఘాత కారిణే నమః
  100. ఓం విశ్వగ్దృశే నమః (100)
  101. ఓం విశ్వరక్షాకృతే నమః
  102. ఓం కళ్యాణ గురవే నమః
  103. ఓం ఉన్మత్త వేషాయ నమః
  104. ఓం అపరాజితే నమః
  105. ఓం సమస్త జగదాధారాయ నమః
  106. ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః
  107. ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
  108. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి.

ధూపం

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
ధూపమాఘ్రాపయామి॥

దీపం దర్శయామి

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
దీపంసందర్శయామి।

ధూప దీపానంతరం ముఖే సుధ ఆచమనీయం సమర్పయామి

నైవేద్యం

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
నైవేద్యం సమర్పయామి।

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
తాంబూలం సమర్పయామి।

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
నీరాజనం సమర్పయామి।

నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

అథ దూర్వాయుగ్మ పూజా

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

తత్ పురుషాయ విద్మహే వక్ర తుండాయ ధీమహి తన్నో దంతి:ప్రచోదయాత్

సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః

ఆత్మప్రదక్షిణ నమస్కారం

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నరాజాయ, నమస్తే విఘ్ననాశన,
ప్రమధగణ దేవేశ ప్రసిధ్ధ గణనాయక,ప్రదక్షిణం కరోమిత్వా ఈశపుత్ర నమోస్తుతే.

యయానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే ||
పాపోయం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ||
అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర ||
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
అర్ఘ్యం సమర్పయామి

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,
పునరర్ఘ్యం సమర్పయామి,
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
అర్ఘ్యం సమర్పయామి

ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః
ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి.

వాయనమంత్రం

గణేశ ప్రతిగృహ్ణాతు గణేశ దదాతి చ
గణేశతారకోభాభ్యాం గణేశాయ నమో నమః

యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు: న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం

ఇతి పూజా విధానం సంపూర్ణం.

శ్రీ వినాయక వ్రత కథ ప్రారంభము  (అక్షతలు చేతిలోకి తీసుకుని కథ వినవలెను)

గణపతి జననము

సూత మహాముని సౌనకాదు మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్ర దర్శన దోష కారణంబును ఆదోష నివారణమును ఈవిధముగా చెప్పదూడంగెను .

పూర్వము గజాసురుడను రాక్షసుడు శివుని గూర్చి ఘోరతపంబునర్చను అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి స్వామి నీ ఎల్లప్పుడూ నా వుదురు ముందు నివసించి యుండుమని కోరను భక్త సులబడవు ఆ పరమేశ్వరుడా అతని కోర్కె తీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంగా ఉండెను.

కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగులు అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసుర గర్భాస్తుడు ఉండుట తెలుసుకొని రప్పించుకొని మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన ప్రతి వృత్తాంతమును తెలిపి మహాత్మ నీవు పూర్వము భస్మాసురుని భార్య నుంచి నా పతిని రక్షించి నాకోసంగితివి. ఇప్పుడు కూడా నుపాయముచే నా పతిని రక్షింపుము అని విలపింప శ్రీహరి ఆ పార్వతిని ఊరడించి పంపే అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేలమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుల అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలకు ఒక వాయిద్యమును ధరింపజేసి తానును చెరువు గంటలు, సన్నాయి దాల్చి గజాశురపురము జోచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా గజాసురుడు వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపనియోగించెను బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బోరు సలప జగన్నాటక సూత్రధారిఅగు ఆ హరి చిత్రవిచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలెను కోరుకొండు అనెను హరివానిని సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనుటకై వచ్చే కావున శివుని నోసంగము అనెను.

ఆ మాటలకు గజాసురుడు నివ్వరబడి అతనిని రాక్షసాంత కుడగు ఒక శ్రీహరి అని ఎరుగెను తనకు మరణమే నిశ్చయమనుకొని తన గర్భస్తుడగు పరమేశ్వరుని నా శిరస్సు త్లిలోక పూజ్యముగా చేసి నా చర్మం నీవు ధరింపమని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము తెలుప నా తడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగముచే గజాసురుని చీల్చే సంహరించెను అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను అంత నా హరి దుష్టాత్ముల కిట్టి వరంబులియరాదు. ఇచ్చిన పామునకు పాలు పోసినట్లుగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీట్కోలిపి తాను వైకుంఠమునకేగిను శివుడు నందిని ఎక్కి కైలాసమునకేగెను.

వినాయకోత్పత్తి

కైలాసమున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని మూదమోంది అభ్యంగ స్నానమాచరించుచూ నలుగుపిండితో ఒక బాలుని చేసి ప్రాణముపోసి వాకిలి ద్వారమున కాపుగా నుంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొని పతి రాకకై నిరీక్షించుచుండెను అప్పుడు పరమేశ్వరుడు నంది నదిరోహించి వచ్చి లోపలికి పోవా వాకిలి ద్వారమున ఉన్న బాలుడు అడ్డగించెను శివుడు కోపించి త్రిశూలం తో బాలుని కంఠమును దునిమి లోపలికేగెను అంత పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యములచే పూజించే వారి ఇరువురు పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే అంత మహేశ్వరుడు తాను నోరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరస్సును బాలుని కతికించి ప్రాణంబునోసంగి గజాననుడు అని నామమోసంగెను అతనిని పుత్రప్రేమంబూన ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తీతో సేవించుచుండెను అతను సులభముగా ఎక్కి తిరుగుటకు అనుంజుడను ఒక ఎలక రాజును వాహనముగా చేసుకొనెను కొంత కాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను అతను మహా బలశాలి అతని వాహనము నెమలి దేవతల సైనా నాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉన్నాడు.

విఘ్నేశాధిపత్యము

ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు. విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కోసంగమని కోరిరి గజాననుడు తాను జ్యేష్టుడు గనుక ఆ ఆధిపత్యము తనకోసంగమనియే.

గణననుడు మరుగుజ్జు వాడు అనర్హుడు. అసమర్థుడు గనుక ఆ ఆధిపత్యము తనకొసంగమని కుమారస్వామియూ తండ్రిని వేడుకొనిరి.
శివుడు ఆ కుమారులను చూసి, ‘మీలో ఎవరు ముల్లో కములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు వచెదరో వారికీయాధిపత్యంబోసంగుదు నని మహేశ్వరుడు పలుక వారిరువురూ సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబు నెక్కి వాయు వేగంబున నేగె అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా! నా అసమర్ధత తామెరింగియు ఇట్టానతీయ తగునే ! నీ పాదసేవకుడను నాయందు కటాక్షముంచి తగు ఉపాయము తెలిపి రక్షింపవే అని ప్రార్ధింప -మహేశ్వరుడు దయాళుడై, కుమారా! ఒకసారి. ” నారాయణ మంత్రము పఠించు’ అని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించె.సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక” అంత గజాననుడుడు సంతసించి, అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించుచు కైలాసంబున నుండె ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వం గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండు ఆనదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు కనిపించే, నతుడును మూడు కోట్ల ఏబది లక్షల నదులలో కూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు.
కైలాసంబునకేగి తండ్రి సమీపమందున్న గజానమని గాంచి నమస్కరించి తను బలమును నింపించుకొని తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే మొసంగు మని ప్రార్థించె.

అంత పరమేశ్వరునిచే భాద్రపద చతుద్ధినాడు గజాననునిగి విఘ్నధిపత్యంబొసంగబడియె. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొ॥ సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మొ॥ భక్షించియు, కొన్ని వాహనమునకోసంగియు కొన్ని చేత ధరించియు మందగమనంబన సూర్యాస్తమయం వేళకు కైలాసంబున కేగి తల్లితండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము. భూమికానిన చేతులు భూమి కందవాయ్యే, బలవంతమ్ముగా. చేతులానిన చరణంబులాకాశంబు జూచె ఇట్లు దండ ప్రణామంబు సేయ గడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె. అంత రాజదృష్టి సోకిన రాళ్ళుకూడ నుగ్గుగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు ఆ ప్రదేశమంతా దుర్లేను. అతండు మృతుండయ్యో పార్వతి శోకించుచు చంద్రుని చూచి ‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణిచే కాన నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు నొందుదురుగాక’ అని శపించెను.

ఋషి పత్నులకు నీలాపనిందలు

ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి శాప భయమున అశక్తుడై క్షీణించు చుండుగా అది అగ్నిభార్యఅగు స్వాహాదేవి గ్రహించి. అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషిపత్నులు రూపంబు తావేదాల్చి పత్రికి ప్రియంబు చేసే. బుఘలు అగ్నిదేవుతో నున్నవారు తయభార్యలే అని శంకించి తమ భార్యలను విడనాడిరి.

పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.

బుషాపత్నుల ఆపద పరమేష్టకి దెల్ప నాతండు సర్వజ్ఞుండుగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబుదాల్చి వచ్చుట దెల్పి సప్తఋషులను సమాధాన పరిచె వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరులు సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.

అంత దేవాదులు. ‘ఓ పార్వతీదేవి నీ శాపంబున లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానినుపసంహరింపు” మని ప్రార్ధించ పార్వతి సంతసించి, ఏదినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నువ్వెనో ఆ దినంబున చంద్రుని చూడరాదు”. అని శాపోపశమంబును వసగె. అంత బ్రహ్మదులు సంతసించి తమ గృహంబులకేగి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రము చందృని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.

శ్యమంతకోపాఖ్యానము

యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నుని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రా జిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములుచేసి స్తుతించెను. ప్రసన్ను డైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి “శ్యమంతకమణి”ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతక మణిని తన కంఠమునుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించి నచో, ప్రతి దినమూ మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్న దేశమున అనావృష్టి, ఈతిబాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కాని, అశుచియై ధరించినచో నది ధరించినవానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యునినుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడచి వచ్చుచుండగా చూచిన పౌరులు, దాని కాంతికి భ్రమసి, సూర్యభగవానుడే కృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీకృష్ణునకు నివేదించిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజాక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పింప సంకల్పించెను.

అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనున కిచ్చెను.ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోదన కారణముగ ప్రసేనుడు అశౌచమును పొందెను. ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును జాంబవంతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకొని పోయి దానిని గుహలో ఊయలలో నున్న తన కుమారునకు ఆటవస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.

ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్లెను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై వెదకుచూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశ మున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనబడెను. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగివచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనముకొరకై, ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణముచేత, అతడే ప్రసేనుని చంపి మణి అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి.

అంతట ఆ అపవాదును బాపుకొనుటకై, శ్రీకృష్ణుడు మరునాడు, అడవిలో శోధింపగా, ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. దానిచే ప్రసేనుని గుర్రమును ఏదో కౄరమృగము చంపి ఉండునని శ్రీకృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి, ఒక సింహపు పాదముద్రలు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంటవచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటిరోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు, రాత్రివేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకొను టకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.

కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చట నుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యింతి ఊయలలో పరున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తు వుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ లలనయే జాంబవతి. ఆమె కృష్ణునిచూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి, శ్రీకృష్ణుకేమైనా ఆపద కల్పించునేమోనని భీతిచెంది, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధము నిట్లు చెప్పెను.

శ్లో॥ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతః
సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః

తా. ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా ! ఈ మణి నీకే ఏడవకుము. అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతక మణి కొరకై శ్రీకృష్ణుడు వచ్చెనని శంకించి, ద్వంద యుద్ధమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతారకాలమున జాంబవంతునికి చిరంజీవిగా వర మిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొన వలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై, జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజులపాటు యుద్ధమొనర్చెను. క్రమ ముగా జాంబవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలిసికొని ఆయన పాదములపై పడి ప్రార్థించి శ్యమంతకమణిని, తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి సాగనంపెను.

ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతక మణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొని శ్రీకృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన సత్యభామను మణి రత్నమైన శ్యమంతకమణిని, గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను. కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణిని సత్రాజిత్తునకే ఇచ్చివేసెను.

ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీకృష్ణునకు, వారు సజీవులై వున్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునించుట, లౌకికమర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శత ధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు సత్యభామను శ్రీకృష్ణుకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్య భామనిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కాని అనుకోని పై పరిణామ ములలో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహమొనర్చెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి, ఆ మణిని అక్రూరినివద్ద వదలి పారిపోయెను. ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలసి, రధములో బయలుదేరెను. గుర్రముపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రధమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి, ద్వందయుద్ధములో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యె అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు, కృష్ణునితో, నీవు బాల్యమునుండియు చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.

బాహ్య శౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతః శౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికముగా భగవద్విరోధ భావము నొందిన అక్రూరుడు మనఃశ్శాంతికై తీర్థయాత్రచేయుచూ, కాశీపట్టణమును చేరెను. అచ్చటికి పోగానే మనఃశ్శాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును దైవకార్యములకుపయోగించెను. అక్రూరుడు బాహ్యా భ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి, రోగబాధలు లేక ప్రశాంతముగా నుండెను.

ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందపడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమును చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయచేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమాయని ఆలోచించుచుండగా, నారదుడేతెంచి భాద్రపద శుక్లచవితి నాటి రాత్రి ప్రసేనునితో అడవికి వెళ్ళినపుడు, చంద్రుని చూచుటయే కారణమని, తద్విశేషమును ఇట్లు చెప్పెను.

శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరిం చుచూ ఒకనాడు చంద్రలోకమును చేరెను. బాహ్యమున వినాయకుడు మరగుజ్జు, లంబోదరుడూ ఐనప్పటికీ, హృదయమున మిక్కిలి కారుణ్య మూర్తి కానీ, చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడి యందు దోషములున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై, వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూచినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరూ చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను.

చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలచి, దేవతలు, ఋషులు, బ్రహ్మ గారివద్దకు పోయి, నివారణోపాయమునర్ధించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ, (పగటి ఉపవాసము) విఘ్నేశ్వ రుని పూజించి, మోదకములు (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను.

అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచిననూ ఎట్టి నిందలూ కలుగవని శాపావకాశమిచ్చెను.

అంతట భాద్రపదశుక్ల చవితినాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్ధతతో ఇంత కష్టపడితినిగాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగు ననీ, కాన లోకమంతటినీ అను గ్రహింపమని కోరెను.

భాద్రపద శుక్ల చవితినాడు తనను పూజించి, శ్యమంతకోపాఖ్యానమును వినిన వారికి చంద్రుని చూచిననూ అపనిందలు కలుగవని వినాయకుడు వరమిచ్చెను.

ద్వారకా నగరమునందు కలిగిన క్షామనివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీకృష్ణుడు అకౄరునకు కబురు పంపెను. పరమ భక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరమునకు వచ్చుటచే, అందరికీ శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట శౌచము కల అక్రూరునివద్ద శ్యమంతకమణి శుభపరంపరలిచ్చుచూ నుండెను.

కావున ఈ వ్రత సమయమందు జాంబవతి ఊయల ఊపుచూ చెప్పిన శ్లోకము అందరూ తప్పక పఠింపవలెను.

సుకుమారక మారోధీః అనగా ఆ సుకుమారుడు మనమే. తవః హ్యేషా శ్యమంతకః

అనగా ఇప్పుడు గోపాలరత్నము, గణేశరత్నము కూడా మనవై వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందెదరు.

ఓం గం గణపతయే నమః

Navaratri Pooja Vidhanam

నవరాత్రి పూజ విధానం (Navaratri Pooja Vidhanam) అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః (తలమీద నీళ్ళను చల్లుకోవాలి) గణపతి ప్రార్దన ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్...

Sri Varalakshmi Vrata Pooja Vidhanam

శ్రీ  వరలక్ష్మి వ్రతం (Sri Varalakshmi Vrata Pooja Vidhanam) శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :- పసుపు – 100 gms కుంకుమ – 100 gms గంధం – 1box విడిపూలు –  1/2 kg పూల...

Adi Shankaracharya Puja Vidhi

ఆదిశంకరాచార్య పూజావిధిః (Adi Shankaracharya Puja Vidhi) వైశాక శుద్ధ పంచమి శంకర జయంతి శ్రీ శంకరభగవత్పాదా విజయంతే మఙ్గలాచరణమ్ నమో బ్రహ్మణ్య దేవ్యాయ గోబ్రాహ్మణ హితాయ చ | జగద్ధితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః || గురుర్బహ్మా గురుర్విష్ణుః...

Sri Varahi Devi Pooja Vidhanam

శ్రీ వారాహీ దేవీ పూజా విధానం (Sri Varahi Devi Pooja Vidhanam) గణపతి మరియు గురు ప్రార్థన దీపారాధన ఘంటానాదం భూతోచ్ఛాటనం ఆచమనం ఆసనం ప్రాణాయామం పసుపు గణపతి పూజ , కళశారాధన, ( ఇవన్నీ అన్ని పూజల్లో చెప్పిన...

More Reading

Post navigation

error: Content is protected !!