శ్రీ తారా కవచం (Sri Tara Kavacham)
ధ్యానం
ఓం ప్రత్యాలీఢపదార్పితంఘిశ్వహృద్ ఘోరాట్టహాసా పరా
ఖడ్గెందీవరకర్త్రికర్పరభుజా హుంకార బీజోద్భవా
సర్వా నీలవిశాలపింగలజటాజూటైక నాగైర్యుతా
జాడ్యన్యస్య కపాలకే త్రిజగతాం హంత్యుగ్రతారా స్వయమ్
శూన్యస్థా మతితేజసాం చ దధతీం శూలాబ్జ ఖడ్గం గదాం
ముక్తాహారసుబద్ధ రత్న రసనాం కర్పూర కుందోజ్వలామ్
వందే విష్ణుసురేంద్రరుద్రనమితాం త్రైలోక్య రక్షాపరామ్
నీలాం తా మహిభూషణాధివలయామత్యుగ్రతారాం భజే!
కవచం
ఓం ప్రణవో మేశిరః పాతు బ్రహ్మ రూపా మహేశ్వరీ
లలాటే పాతు హ్రీంకారీ బీజరూపా మహేశ్వరీ॥
స్త్రీంకారీః పాతువదనే రూపా మహేశ్వరీ
హూంకారః పాతు హృదయే భవానీ శక్తి రూపధృక్॥
ఫట్కారః పాతు సర్వాంగే సర్వ సిద్ధి ఫలప్రదా
నీలా మాం పాతు దేవేశీ గండయుగ్మే భయాపహా॥
లంబోదరీ సదా పాతు కర్ణ యుగ్మం భయాపహా
వ్యాఘ్ర చర్మవృతా కట్యాం పాతు దేవీకటి శివప్రియా॥
పీనోన్నత స్తనీ పాతు పార్శ్వ యుగ్మే మహేశ్వరీ
రక్త వర్తుల నేత్రా చ కటి దేశే సదావతు ॥
లలజ్జిహ్వా సదాపాతు నాభౌ మాం భువనేశ్వరీ
కరాళాస్యా సదాపాతు లింగే దేవీ శివ ప్రియా॥
పింగోగ్రైక జటాపాతు జంఘాయాం విశ్వనాశినీ
ఖడ్గ హస్తా మహా దేవీ జాను చక్రే మహేశ్వరీ॥
నీల వర్ణా సదాపాతు జానునీ సర్వదా మమ
నాగకుండల ధాత్రీ చ పాతుపాదయుగే తతః॥
నాగహారధరా దేవీ సర్వాంగాన్ పాతు సర్వదా
పాతాళే పాతు మాం దేవీ నాగినీ మాన సంచితా॥
హ్రీంకారీ పాతు పూర్వే మాం శక్తిరూపా మహేశ్వరీ
స్త్రీంకారీ దక్షిణే పాతు స్త్రీ రూపా పరమేశ్వరీ॥
హుం స్వరూపా మహామాయా పాతు మాం క్రోధ రూపిణీ
ఖ స్వరూపా మహా మాయా పశ్చిమే పాతు సర్వదా॥
ఉత్తరే పాతు మాం దేవీ ఢ స్వరూపా హరి ప్రియా
మధ్యే మాం పాతు దేవేశీ హూం స్వరూపా నగాత్మజా॥
నీల వర్ణా సదా పాతు సర్వత్ర వాగ్భవీ సదా
తారిణీ పాతు భవనే సర్వైశ్వర్య ప్రదాయినీ॥