శ్రీ శ్రీనివాస స్తుతి (Sri Srinivasa Stuti)
నమో నమస్తేஉఖిల కారణాయ నమో నమస్తే అఖిల పాలకాయ |
నమో నమస్తే உమరనాయకాయ నమోనమో దైత్యవిమర్దనాయ ॥
నమో భక్తిజన ప్రియాయ నమోనమః పాపవిదారణాయ |
నమో నమో దుర్జననాశకాయ నమోஉస్తు తస్మైజగదీశ్వరాయ ॥
నమో నమః కారణవామనాయ నారాయణాయాతి విక్రమాయ |
శ్రీ శంఖుచక్రా గదాధరాయ నమోஉస్తు తస్మై పురుషోత్తమాయ ॥
నమః పయోరాశి నివాసకాయ నమోஉ స్తు లక్ష్మీపతయే అవ్యయాయ |
నమో உస్తు సూర్యాద్యమిత ప్రభాయ నమోనమః పుణ్యగతా గతాయ ॥
నమో నమోஉర్కేందు విలోచనాయ నమోస్తు తే యజ్ఞ ఫలప్రదాయ ||
నమోஉస్తు యజ్ఞాంగ విరాజితాయ నమోస్తుஉతే సజ్జనవల్లభాయ ॥
నమోనమః కారణ కారణాయ నమోஉస్తు శబ్దాదివివర్జితాయ |
నమోస్తుతే உభీష్టసుఖప్రదాయ నమోనమో భక్త మనోరమాయ ॥
నమోనమస్తే ద్భుతకారణాయ నమోஉస్తు తే మందరధారకాయ ||
నమోస్తుతే యజ్ఞవరాహ, నామ్నే నమోహిరణ్యాక్ష విదారకాయ ॥
నమోஉస్తుతే వామనరూపభాజ్ నమో உస్తు తే క్షత్రకులాంతకాయ |
నమోஉస్తుతే రావణ మర్దనాయ నమోஉస్తుతే నందసుతాగ్రజాయ ॥ 8
నమస్తే కమలాకాంత నమస్త సుఖదాయినే ।
శ్రితార్తి నాశినే తుభ్యం భూయో భుయో నమో నమః ॥