శ్రీ జోగులాంబ దేవి, అల్లంపుర (Sri Jogulamba Devi, Alampur)
ఈ క్షేత్రం తెలంగాణా రాష్ట్రం లోని మహబూబ్ నగర్ జిల్లా కు 100 కిలో మీటర్ల దూరం లో నెలకొని ఉంది. మన రాష్ట్రాల్లో ఇదే మొదటి శక్తి పీఠం తుంగభద్రా నదీ తీరం లో అమ్మవారు జ్యోగులాంబ దేవి గా కొలువు తీరి ఉంది. ఇక్కడ అమ్మవారి పైన దంతి భాగం (పైన పళ్ళవరుస) ఇక్కడ పడినది గా స్థల పురాణం. ఈ క్షేత్రాన్ని బాల బ్రహ్మేశ్వర క్షేత్రం గా పిలవబడుతుంది. 6 వ శతాబ్దం నుంచి రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇక్కడ కృష్ణ నది మరియు తుంగబధ్ర నది సంగమం జరుగుతుంది.
ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.
శక్తి క్షేత్రం, దక్షణ కాశీ గా పిలుస్తారు ఇక్కడ ఆలయం లో బ్రహ్మ, నారద, ఇంద్ర, యముడు, అగ్ని సూర్య నారాయణ స్వామి, నరసింహ స్వామి, పాండురంగ స్వామి వారల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ గుడి చుట్టూ కొలను. నవబ్రహ్మ(నవలింగ దివ్య క్షేత్రం) ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ బ్రహ్మత్వం కోసం శివుని పూజించి తన బ్రహ్మత్వం పొందారు. ఇక్కడ గరుడ బ్రహ్మ, తారక బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ , అర్క బ్రహ్మ , కుమార బ్రహ్మ , పద్మ బ్రహ్మ.